భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-16 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 551 - 600 551. భారతదేశంలోని "డస్ట్ ఆఫ్ మౌంటేన్స్ " అని పేరుగాంచిన నైసర్గిక స్వరూపం ఏది? A. హిమాలయ పర్వత శ్రేణులు B. పీఠ భూములు C. గంగా సింధూ మైదానాలు D. పైవన్నీ 552. హిమాలయ ద్వీపకల్ప నదులు తీసుకువచ్చిన ఒండ్రుమట్టి ఒకప్పుడు మిగిలిపోయిన టెథిస్ భూ అభినీతి లో (టెథిస్ జియోసింక్లెన్ )నిక్షేపితమవడంతో ఏర్పడిన భూభాగం ఏది ? A. పీఠ భూములు B. గంగా సింధూ మైదానాలు C. కనుమలు D. ఏదీ కాదు 553. హిమాలయ ,ద్వీపకల్ప నదులు ఏ మట్టి వలన గంగా సింధూ మైదానాలు ఏర్పడినాయి ? A. బంక మట్టి B. ఒండ్రు మట్టి C. నల్లరేగడి మట్టి D. ఎర్ర నేలలు 554. గంగా సింధూ మైదానాలు విస్తరించిన రాష్ట్రాలలో ,ఏ రాష్ట్రంలో ఉన్న మైదానాలలో సగ భాగం వరకు విస్తరించి ఉంది ? A. బీహార్ B. పంజాబ్ C. ఉత్తరప్రదేశ్ D. హర్యానా 555. 21-22 మిలియన్ ల సంవత్సరాల క్రితం ఏ కాలాలలో బృహత్ మైదానం ఏర్పడింది ? A. ప్లిస్టోసీన్ -హలోసీన్ కాలాలలో B. టెర్షియరి -ఓలగోసిన్ కాలాలలో C. మధ్య మియోసిన్ కాలాలలో D. ఏదీ కాదు 556. గంగా సింధూ మైదానాలు దేశ భూభాగంలో ఎన్ని లక్షల చదరపు కి.మీ.విస్తీర్ణాన్ని ఆక్రమించి చతుర్భుజీవ (క్వార్టనరీ )మహాయుగంలో ఏర్పడింది ? A. 5 లక్షల చదరపు కి.మీ B. 6 లక్షల చదరపు కి.మీ C. 6.5 లక్షల చదరపు కి.మీ D. 7.5 లక్షల చదరపు కి.మీ 557. బృహత్ మైదానమును, అక్కడి నేలలకు ఉండే లక్షణాల ఆధారంగా ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది ? A. 4 B. 5 C. 8 D. 6 558. బాబర్ మైదానాలు ఏ హిమాలయాల పర్వత పాదాల వెంబడి విస్తరించి ఉన్నాయి ? A. హిమాద్రి హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు C. శివాలిక్ హిమాలయాలు D. ట్రాన్స్ హిమాలయాలు 559. సింధు - తీస్తా నదుల మధ్య విస్తరించిన మైదానాలు ఏవి ? A. టెరాయ్ B. ఖాదర్ C. భంగల్ D. బాబర్ 560. సాధారణంగా తక్కువ వెడల్పు కలిగిన బృహత్ మైదానాలు ఏవి ? A. బాబర్ B. ఖాదర్ C. భంగర్ D. టెరాయ్ 561. భారతదేశంలో బృహత్ మైదానాలలోని బాబర్ నేలల యొక్క వెడల్పు ఎంత? A. 7 నుండి 12 కి.మీ B. 8 నుండి 12 కి.మీ C. 8 నుండి 16 కి.మీ D. 7 నుండి 16 కి.మీ 562. శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో గుళకారాళ్ళు అశ్రేణీకృత అవక్సేపాలు నిక్షేపించగా ఏర్పడిన మైదానం ఏది ? A. సచ్చిధ్ర పీర్ మౌంట్ మైదానము B. రే/కల్లార్/ఉసర్ మైదానము C. టెరాయ్ మైదానము D. భంగర్ మైదానము 563. ఏ మైదానాల ప్రాంత సచ్చిద్ర స్వభావం వల్ల హిమాలయ నదులు ప్రవహిస్తూ ఆ ప్రాంతమునకు రాగానే అందులోని నీరు ఇంకిపోయి నీటి పరిమాణం తగ్గుతుంది ? A. టెరాయ్ B. ఖాదర్ C. బాబర్ D. భంగర్ 564. బృహత్ మైదానాలలోని బాబర్ నేలలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ? A. శ్రీ నగర్ B. బీహార్ C. పంజాబ్ D. అస్సాం 565. బాబర్ మండలంలో ఇంకిపోయిన నీరు దక్షిణాన పైకి పొంగి ప్రవహించడం వలన ఏర్పడిన దట్టమైన అరణ్యాలతో కూడిన చిత్తడి ప్రదేశాన్ని ఏమంటారు ? A. టెరాయ్ B. ఖాదర్ C. భంగర్ D. బాబర్ 566. బృహత్ మైదానాలలోని ఏ నేలలు చిత్తడిగా వుండి ఎక్కువ అడవులతోనూ వివిధ జంతువులను కలిగి ఉండి ,భూమధ్య రేఖ శీతోష్ణస్థితిని తలపిస్తుంది ? A. భంగర్ B. టెరాయ్ C. ఖాదర్ D. బాబర్ 567. భారతదేశంలోని టెరాయ్ మైదానాలు ఏ అడవులకు ప్రసిద్ధి? A. నాల్ అడవులు B. కులు అడవులు C. కాంగ్రా అడవులు D. కుటి అడవులు 568. బృహత్ మైదానాలలోని ఏ నేలల శీతోష్ణస్థితి ని "మలేరియల్ శీతోష్ణస్థితి" గా పేర్కొంటారు ? A. భంగర్ B. టెరాయ్ C. ఖాదర్ D. బాబర్ 569. టెరాయి నేలలు విస్తరించిన పశ్చిమ బెంగాల్ లోని సుందరవనాలు ఏ దేశ సరిహద్దు వరకు ఉన్నాయి ? A. చైనా B. నేపాల్ C. బంగ్లాదేశ్ D. పాకిస్తాన్ 570. భారత దేశంలోని వివిధ నదుల ప్రక్కన పల్లపు ప్రాంతంలో కొత్త ఒండ్రుమట్టితో ఏర్పడిన వరద మైదానాలు ఏవి ? A. ఖాదర్ మైదానాలు B. టెరాయ్ మైదానాలు C. భంగర్ మైదానాలు D. ఏవీ కాదు 571. ఖాదర్ నేలలు ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ? A. ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ B. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ C. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ D. బీహార్ మరియు పంజాబ్ 572. ఖాదర్ నేలలు ఏ స్వరూపాన్ని కల్గి ఉంటాయి ? A. కాలేకెరియన్ పదార్హం తక్కువగాను B. ఇసుక ,సీల్డ్,బురద మరియు క్లేను C. లేత వర్ణం గల ఒండ్రు మట్టి D. పైవన్నీ 573. బృహత్ మైదానాలలోని ఏ నేలలను పంజాబ్ లో "బెట్ " గా పిలుస్తారు ? A. టెరాయ్ B. బాబర్ C. ఖాదర్ D. భంగర్ 574. ఖాదర్ మైదానాల విస్తరణగా ఏ మైదానాలను పేర్కొంటారు ? A. బెట్ మైదానాలను B. డెల్టా మైదానాలను C. టెరాయ్ మైదానాలను D. భంగర్ మైదానాలు 575. డెల్టా మైదానాలు ఎన్ని లక్షల కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి ? A. 1.46 లక్షల కి .మీ B. 1.48 లక్షల కి .మీ C. 1.82 లక్షల కి .మీ D. 1.86 లక్షల కి .మీ 576. డెల్టా మైదానాలు 1.86 లక్షల కి.మీ. వైశాల్యంతో ఏ ప్రాంతంలో గంగా నది దిగువ భాగంలో ఏర్పడి ఉన్నాయి ? A. ఉత్తరప్రదేశ్ B. బీహార్ C. పశ్చిమ బెంగాల్ D. పంజాబ్ 577. బృహత్ మైదానాలలో ప్రాచీన బురద, కొత్త బురద మరియు చిత్తడి నేలని కలిగి ఉన్న మైదానాలు ఏవి? A. ఖాదర్ మైదానాలు B. టెరాయ్ మైదానాలు C. భంగర్ మైదానాలు D. ఉసర్ మైదానాలు 578. బృహత్ మైదానాలు అల్యూమీనియం సంఘటన కలిగి ఉండి, ఏ నిక్షేపాల మధ్య ఏర్పడి ఉన్నాయి? A. భంగర్ B. ఉసర్ C. టెరాయ్ D. ఏదీ కాదు 579. బృహత్ మైదానాలు అల్యూమినియం సంఘటన కలిగి ఉండి, భంగర్ నిక్షేపాల మధ్య ఏ కాలం వరకు ఏర్పడి ఉన్నాయి? A. ప్లిస్టోసీన్ మరియు నవీన భౌమాకాలం వరకు B. వియోసిన్ మరియు నవీన భౌమాకాలం వరకు C. టెర్షియరి మరియు నవీన భౌమాకాలం వరకు D. ఏదీ కాదు 580. ప్రాచీన ఒండ్రు మట్టి నేలలను ఏ నేలలుగా పేర్కొంటారు? A. ఉసర్ నేలలు B. టెరాయ్ నేలలు C. భంగర్ నేలలు D. ఖాదర్ నేలలు 581. రాణా ఆఫ్ కచ్ ఎక్కడ ఉండి ? A. రాజస్థాన్ B. బీహార్ C. గుజరాత్ D. పంజాబ్ 582. భారతదేశం లో అత్యధిక తీర రేఖ ఉన్న ప్రాంతాలు ఏవి? A. అండమాన్ నికోబార్ దీవులు B. గుజరాత్ C. ఆంధ్రప్రదేశ్ D. పైవన్నీ 583. భారతదేశంలో గల తూర్పు తీర మైదానాలు పొడవు ఎంత? A. 1100 కి.మీ B. 1500 కి.మీ C. 2500 కి.మీ D. 750 కి.మీ 584. కావేరి డెల్టా ఏ మైదానం లో ఉంది? A. తమిళనాడు మైదానం B. ఆంధ్ర మైదానం C. ఉత్కళ మైదానం D. వంగ తీరం 585. ఆంధ్ర మైదానం లో ఉన్న ముఖ్యమైన సరస్సులు ఏవి? A. కొల్లేరు B. పులికాట్ C. సాంబార్ D. a మరియు b 586. "సర్కార్ తీరం" అని ఏ మైదానాన్ని పిలుస్తారు? A. వంగతీర మైదానం B. ఆంధ్ర మైదానం C. కోంకణ్ మైదానం D. మలబార్ మైదానం 587. ఉత్కళ మైదానం లో గల ప్రముఖ సరస్సు ఏది? A. పులికాట్ సరస్సు B. కొల్లేరు సరస్సు C. చిలిక సరస్సు D. సాంబార్ సరస్సు 588. భారతదేశం లో బరంపురం నుండి సుందర్ బన్స్ వరకు వ్యాపించి ఉన్న మైదానం ఏది? A. ఉత్కళ మైదానం B. ఆంధ్ర మైదానం C. తమిళనాడు మైదానం D. కెనరా మైదానం 589. కాంతి తీర మైదానం అని ఏ మైదానాన్ని పిలుస్తారు? A. వంగ తీరం B. కథియావార్ తీర మైదానం C. మలబార్ తీర మైదానం D. కొంకన్ తీర మైదానం 590. రామక్రిష్ణ ,మంగిన పూడి మరియు సూర్య లంక అను బీచ్ లు ఏ ప్రాంతంలో కలవు? A. ఒరిస్సా B. తమిళనాడు C. పశ్చిమ బెంగాల్ D. ఆంధ్రప్రదేశ్ 591. మహా నది అను డెల్టా ఏ ప్రాంతం లో ఉంది? A. కేరళ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. ఒరిస్సా 592. గంగా డెల్టా ఏ రాష్ట్రం లో ఉంది? A. ఆంధ్రప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. ఉత్తరప్రదేశ్ D. పశ్చిమబెంగాల్ 593. సుందన్ బన్స్ నుండి గంగానది ముఖద్వారం వరకు విస్తరించి ఉన్న తీర మైదానం ఏది? A. వంగ తీర మైదానం B. కోరమాండల్ తీర మైదానం C. సర్కార తీర మైదానం D. ఉత్కళ్ మైదానం 594. పురి అను బీచ్ ఏ రాష్ట్రం లో కలదు? A. తమిళనాడు B. కేరళ C. ఒరిస్సా D. అస్సాం 595. ఆంధ్రప్రదేశ్ లో గల దీవులు ఏవి? A. న్యూ మూర్ దీవులు B. శ్రీ హరి కోట దీవులు C. లక్ష దీవులు D. అండమాన్ దీవులు 596. మెరినా బీచ్ ఎక్కడ ఉంది? A. తమిళనాడు B. కర్ణాటక C. అరుణాచల్ ప్రదేశ్ D. కేరళ 597. తూర్పు తీరమైదానం లో గల "పులికాట్" అను ఉప్పు నీటి సరస్సు ఏ ప్రాంతం లో కలదు? A. ఆంధ్రప్రదేశ్ B. తమిళనాడు C. పంజాబ్ D. a మరియు b 598. గుజరాత్ నుండి డామన్ వరకు విస్తరించి ఉన్న తీర మైదానం ఏది? A. కథియావార్ మైదానం B. కొంకన్ మైదానం C. కెనరా మైదానం D. మలబార్ మైదానం 599. వాస్కోడిగామా బీచ్ ఏ తీర మైదానం లో ఉంది? A. వంగ తీర మైదానం B. సర్కార్ తీర మైదానం C. కోరమాండల్ తీర మైదానం D. కొంకన్ మైదానం 600. ఏ తీర మైదానం "కయ్యలకు ప్రసిద్ది? A. కర్ణాటక మైదానం B. ఉత్కళ్ మైదానం C. పశ్చిమ బెంగాల్ మైదానం D. తమిళనాడు మైదానం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next