భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-5 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 50 1. భారత దేశము ఏ సిద్దాంతమును అనుసరించి పురాతన గోండ్వానా ప్రాంతము నుండి విడిపోయిన భూభాగములో ఒకటి అయి ఉన్నది? A. భౌగోళిక సిద్ధాంతము B. ఖండ మోచన సిద్ధాంతం C. ఖండ చలన సిద్ధాంతం D. ఏదీ కాదు 2. టేథిస్ సముద్రములోని అవక్షేప నిక్షేపాలు ముడతలు పడి ఏర్పడిన పర్వతాలు ఏవి? A. వింధ్య పర్వతాలు B. హిమాలయ పర్వతాలు C. సర్పూర పర్వతాలు D. కాంచన పర్వతాలు 3. హిమాలయాల నుండి ప్రవహించు నదుల ద్వారా తెచ్చిన అపక్షేపములను టేథిస్ సముద్ర అగాధాలలో నిక్షేపణ చేయుట వలన ఏర్పడిన మైదానాలు ఏవి? A. గంగా మారియు సింధు మైదానాలు B. బ్రహ్మ పుత్ర మైదానాలు C. a మరియు b D. ఏదీ కాదు 4. భారతదేశంలో టేథిస్ సముద్రము కనుమరుగైన తర్వాత మిగిలిన భాగం ఏ సముద్రముగా పిలువబడుతున్నది? A. ఎర్ర సముద్రము B. మధ్య దరా సముద్రము C. నీలి సముద్రము D. ఏదీ కాదు 5. భారతదేశ నైసర్గిక స్వరూపాలలో అత్యధిక వయస్సు కల భాగం ఏది? A. గంగా,సింధు మైదానాలు B. హిమాలయ పర్వతాలు C. ద్వీప కల్ప భారతదేశము D. పీఠ భూములు 6. భారతదేశ నైసర్గిక స్వరూపాలలో అతి తక్కువ వయస్సు కల భాగం ఏది? A. ద్వీపకల్ప భారతదేశము B. గంగా మారియు సింధు మైదానములు C. హిమాలయాలు D. పీఠ భూములు 7. cso అంచనాల ప్రకారం భారతదేశంలోని నైసర్గిక స్వరూపంలో పీఠ భూముల శాతం ఎంత? A. 10.70% B. 18.60% C. 27.70% D. 43% 8. cso అంచనాల ప్రకారం భారతదేశంలోని నైసర్గిక స్వరూపంలో మైదానాలు ఎంత శాతం గా పేర్కొనబడినది? A. 10.70% B. 18.60% C. 27.70% D. 43% 9. cso అంచనాల ప్రకారం భారతదేశంలోని నైసర్గిక స్వరూపంలో పర్వతాలు ఎంత శాతం గా పేర్కొనబడినది? A. 10.70% B. 15.70% C. 20.70% D. ఏది కాదు 10. భారతదేశంలోని ఉన్నత మైదానాలలో ఏ మైదానాలు బృహత్ మైదానాలుగా పిలువబడతాయి? A. గంగా మైదానాలు B. సింధు మైదానాలు C. బ్రహ్మపుత్ర మైదానాలు D. పైవన్నీ 11. భారతదేశం లో హిమాలయాల యొక్క పొడవు ఎన్ని కి.మీ ? A. 1,200 కి.మీ B. 2,000 కి.మీ C. 2400 కి.మీ D. 2,600 కి.మీ 12. భారతదేశం లో హిమాలయాలు ఏర్పడుటకు గల కారణం ఏది? A. యురేషియాన్ పలక క్రిందికి మరియు ఇండియన్ పలక ఉత్తర దిశకు జరుగుట వలన B. యురేషియాన్ పలక మరియు ఇండియన్ పలక సముద్ర భూపటలానికి దగ్గరగా రావటం వలన C. యురేషియాన్ పలక మరియు ఇండియన్ పలక ఎదురెదురుగా రావటం వలన D. ఏది కాదు 13. 30-60 మిలియన్ సంవత్సరాల క్రితం యురేషియన్ ఫలకా ,ఇండియా ఫలక ఏ సముద్ర భూపటాలానికి దగ్గరగా రావడంతో పగుళ్లు ,మూడుతలు ఏర్పడటం ఆరంభించాయి? A. ఎర్ర సముద్రం B. టేథిస్ సముద్రం C. నీలి సముద్రం D. మధ్యదార సముద్రం 14. టేథిస్ మహాసముద్రం ఉన్న ప్రాంతంలో గల భూస్వరూపాలను ఏమంటారు? A. దీప కల్ప పీఠ భూములు B. హిమాలయాలు C. మైదానాలు D. పైవన్నీ 15. ప్రపంచంలో ఉన్న ముడుత పర్వతాల్లో కెల్లా చివరగా భారతదేశంలో ఏర్పడిన ముడత పర్వతాలకు గల పేరు ఏమిటి? A. అతి తరుణ ముడత పర్వతాలు B. నవీన ముడత పర్వతాలు C. a మరియు b D. ఏది కాదు 16. భారత భూపటలములో విరూపకాల వల్ల ఏర్పడి, అర్ధచంద్రాకారంలో ఉన్న పర్వతాలు ఏవి? A. ఆరావళి పర్వతాలు B. వింధ్య పర్వతాలు C. హిమాలయ పర్వతాలు D. కాంచన పర్వతాలు 17. హిమాలయ పర్వతాల యొక్క వయస్సు ఏ యుగానికి చెందినది? A. ఓలగోసిన్ యుగం B. టెర్షియరి యుగం C. వియోసిన్ యుగం D. పాస్ట్ ప్లియోసిన్ యుగం 18. భారత భూపటలములో అవక్షేప శిలల తో ఏర్పడిన పర్వతాలు ఏవి? A. ఆరావళి B. వింధ్య C. కాంచన D. హిమాలయాలు 19. హిమాలయాల యొక్క సగటు వెడల్పు ఎంత? A. 150-450 కి.మీ B. 150-350 కి.మీ C. 150-500 కి.మీ D. 150-600 కి.మీ 20. హిమాలయాల పర్వతాల విస్తీర్ణం ఎన్ని చ.కి.మీటర్లు? A. 5 లక్షల చ.కి.మీటర్లు B. 5.50 లక్షల చ.కి.మీటర్లు C. 4.50 లక్షల చ.కి.మీటర్లు D. 6 లక్షల చ.కి.మీటర్లు 21. భారత భూపటలములో పశ్చిమాన నంగ ప్రభాత్ నుండి తూర్పున నాంఛాబారువ వరకు విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? A. ఆరావళి పర్వతాలు B. సహాద్రి పర్వతాలు C. హిమాలయ పర్వతాలు D. కాంచన పర్వతాలు 22. భారతదేశంలో హిమాలయాలను ఉత్తరాన జమ్మూ & కాశ్మీర్ నుండి దక్షిణాన అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్ని ముడత పర్వత శ్రేణులు గా విభజించారు? A. 5 B. 4 C. 3 D. 6 23. భారతదేశంలో ఉన్నత హిమాలయాలు గా పిలువబడే పర్వతాలు ఏవి? A. హిమాద్రి హిమాలయాలు B. బాహ్య హిమాలయాలు C. నిమ్న హిమాలయాలు D. ట్రాన్స్ హిమాలయాలు 24. హిమాద్రి హిమాలయాలలో హిమాద్రి శ్రేణి ఏ యుగంలో ఏర్పడినది? A. టెర్షియరి యుగం B. ఓలగోసిన్ యుగం C. మిమోసిన్ యుగం D. పాస్ట్ ప్లీయోసిన్ యుగం 25. ఉన్నతమైన హిమాలయాలలో హిమాద్రి శ్రేణులను ఏమని పిలుస్తారు? A. బహిరగిరి శ్రేణులు B. పీర్ పంజల్ శ్రేణులు C. దౌల్ దర్ శ్రేణులు D. కారకోరం శ్రేణులు 26. భారతదేశంలోని ఉన్నత హిమాలయాలు అయిన హిమాద్రి శ్రేణుల సగటు ఎత్తు ఎంత? A. 6500 మీటర్లు B. 6600 మీటర్లు C. 6100 మీటర్లు D. 6700 మీటర్లు 27. హిమాద్రి హిమాలయాల సగటు వెడల్పు ఎన్ని కిలోమీటర్లు? A. 25 కి.మీ B. 50 కి.మీ C. 35 కి.మీ D. 55 కి.మీ 28. ఆర్కీయాన్ కు చెందిన గ్రానైట్, నీస్ మరియు సిస్ట్ లతో కూడి ఉన్న హిమాలయాలు ఏవి? A. నిమ్న హిమాలయాలు B. బాహ్య హిమాలయాలు C. హిమాద్రి హిమాలయాలు D. ట్రాన్స్ హిమాలయాలు 29. హిమాద్రి హిమాలయాలు అరుణాచల్ ప్రదేశ్ వద్ద వంపు తిరిగి ఏ శ్రేణిగా పిలువబడుతున్నాయి? A. బహిరగిరి శ్రేణులు B. పాట్కాయ్ భమ్ శ్రేణులు C. దౌల్ దర్ శ్రేణులు D. పీర్ పంజల్ శ్రేణులు 30. అరుణాచలప్రదేశ్ వద్ద వంపు తిరిగి పాట్కాయ్ భమ్ శ్రేణిగా పిలువబడుతున్న హిమాలయాలు ఏవి? A. హిమాద్రి హిమాలయాలు B. ట్రాన్స్ హిమాలయాలు C. నిమ్న హిమాలయాలు D. ఏవీ కాదు 31. మయన్మార్ లో అరకాన్ యోమా పర్వతాలు అని ఏ హిమాలయాలను పిలుస్తారు? A. ట్రాన్స్ హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు C. బాహ్యా హిమాలయాలు D. హిమాద్రి హిమాలయాలు 32. హిమాద్రి హిమాలయాలను ఏ ప్రాంతంలో అరకాన్ యోమా పర్వతాలు అని పిలుస్తారు? A. అరుణాచల్ ప్రదేశ్ B. జమ్మూ & కాశ్మీర్ C. మయన్మార్ D. ఏదీ కాదు 33. ప్రపంచంలో కెల్లా ఎత్తైన పర్వతాలు ఏవి? A. హిమాద్రి హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు C. భాహ్య హిమాలయాలు D. ట్రాన్స్ హిమాలయాలు 34. హిమాలయాలలోని ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి చెందిన పర్వతశ్రేణి ఏది? A. పీర్ పంజల్ శ్రేణి B. హిమాద్రి శ్రేణి C. దౌల్ దర్ శ్రేణి D. హిమాచల్ శ్రేణి 35. ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఏది? A. కాంచన్ జంగ్ B. దవళగిరి C. ఎవరెస్ట్ D. నంగ ప్రభాత్ 36. ప్రపంచంలో కెల్లా ఎత్తైన పర్వతం ఎవరెస్టు శిఖరం యొక్క ఎత్తు ఎన్ని మీటర్లు? A. 8598 మీటర్లు B. 8850 మీటర్లు C. 8481 మీటర్లు D. 8172 మీటర్లు 37. ఎవరెస్ట్ పర్వతం యొక్క పూర్వ నామం ఏమిటి? A. సాగర మాత B. జోంగ్ మా C. Peak - XV D. కోమో లుంగ్మా 38. హిమాలయాలలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ లో ఏమని పిలుస్తారు? A. కోమా లుంగ్మా B. జోంగ్ మా C. సాగర మాత D. ఏదీ కాదు 39. హిమాలయాలలో ఎత్తయిన ఎవరెస్టు శిఖరం,జోంగ్ మా అని ఏ ప్రాంతంలో పిలువబడుతున్నది? A. చైనా B. టిబెట్ C. నేపాల్ D. అరుణాచల్ ప్రదేశ్ 40. చైనాలో ఎవరెస్ట్ శిఖరమునకు గల పేరు ఏమిటి? A. జోంగ్ మా B. సాగరమాత C. కోమో లుంగ్మా D. హిమాద్రి 41. హిమాద్రి హిమాలయాలకు దక్షిణాన ఉన్న పర్వతాలు ఏవి? A. నిమ్న హిమాలయాలు B. బాహ్య హిమాలయాలు C. ట్రాన్స్ నిమ్న హిమాలయాలు D. ఏదీ కాదు 42. హిమాచల్ / నిమ్న హిమాలయాలు ఏ యుగంలో ఏర్పడ్డాయి? A. మధ్య మియోసిన్ యుగం B. పాస్ట్ ప్లీయోసిన్ యుగం C. ఓలగోసిన్ యుగం D. ఏదీ కాదు 43. భారతదేశంలోని హిమాచల్/నిమ్న హిమాలయాల యొక్క సగటు ఎత్తు ఎన్ని కి.మీటర్లు? A. 4,000 మీటర్లు B. 4500 మీటర్లు C. 5000 మీటర్లు D. 5,500 మీటర్లు 44. నిమ్న హిమాలయాల సగటు వెడల్పు ఎంత? A. 60-70 కి.మీ B. 70-80 కి.మీ C. 60-80 కి.మీ D. 60-90 కి.మీ 45. భారతదేశంలో పొడవైన పర్వత శ్రేణులుగా ప్రసిద్ధి చెందిన హిమాలయా పర్వత శ్రేణులు ఏవి? A. హిమాద్రి B. నిమ్న C. బాహ్య D. ట్రాన్స్ 46. భారతదేశంలో సతత హరిత మరియు శృంగాకార వృక్ష సంపద కలిగి ఉన్న హిమాలయ పర్వతాలు ఏవి? A. హిమాద్రి హిమాలయాలు B. ట్రాన్స్ హిమాలయాలు C. నిమ్న హిమాలయాలు D. బాహ్య హిమాలయాలు 47. భారతదేశంలోని హిమాచల్ పర్వత శ్రేణిలో పొడవైనది ఏది? A. పీర్ పంజల్ శ్రేణి B. దౌల్ దర్ శ్రేణి C. హిమాద్రి శ్రేణి D. ఏదీ కాదు 48. హిమాలయాలలో పొడవైన పీర్ పంజల్ శ్రేణి ఎక్కడ కలదు? A. హిమాచల్ ప్రదేశ్ B. అరుణాచల్ ప్రదేశ్ C. జమ్మూ & కాశ్మీర్ D. మయన్మార్ 49. హిమాచల్/నిమ్న హిమాలయాలలోని పీర్ పంజల్ శ్రేణి లో గల కనుమ పేరు ఏమిటి? A. బనిహాల్ కనుమ B. డే బసీ కనుమ C. లిపు లేక్ కనుమ D. బారాచల కనుమ 50. గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని పేరుగాంచిన బనిహల్ కనుమ ఏ పర్వత శ్రేణిలో కలదు? A. పీర్ పంజల్ శ్రేణి B. దౌల్ దర్ శ్రేణి C. హిమాద్రి శ్రేణి D. కారకోరం శ్రేణి You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next