భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-6 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 51 - 100 51. గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని పేరు పొందిన పీర్ పంజల్ శ్రేణి ఏ హిమాలయాలకు చెందింది? A. హిమాద్రి హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు/హిమాచల్ C. బాహ్య హిమాలయాలు/శి వాలిక్ D. ట్రాన్స్ హిమాలయాలు 52. హిమాచల్/నిమ్న హిమాలయాలలోని పీర్ పంజల్ శ్రేణిలో సుమారుగా ఎంత ఎత్తులో అనేక సారవంతమైన మైదానాలు విస్తరించి ఉన్నాయి? A. 1500 మీటర్లు B. 1600 మీటర్లు C. 1700 మీటర్లు D. 1800 మీటర్లు 53. నిమ్న హిమాలయాలలోని పీర్ పంజల్ శ్రేణిలో విస్తరించి ఉన్న సారవంతమైన మైదానాలను ఏమని పిలుస్తారు? A. కారెవాస్ B. కులూ C. డెస్పాంగ్ D. ఆక్సాయ్ 54. నిమ్న హిమాలయాలలోని దౌల్ దార్ శ్రేణి ఎక్కడ కలదు? A. ఉత్తర ఖండ్ B. జమ్మూ కాశ్మీర్ C. హిమాచల్ ప్రదేశ్ D. అరుణాచల్ ప్రదేశ్ 55. నిమ్న హిమాలయా లలో దౌల్ దర్ శ్రేణి లోని వేసవి విడిది ప్రాంతం ఏది? A. కులూ B. కాంగ్రా C. డల్హౌసి D. సిమ్లా 56. నిమ్న హిమాలయాలలో నాగటిబ్బా మరియు ముస్సోరి శ్రేణుల గల ప్రాంతం ఏది? A. ఉత్తర ఖండ్ B. నేపాల్ C. హిమాచల్ ప్రదేశ్ D. జమ్మూ కాశ్మీర్ 57. నిమ్న హిమాలయాలలోని ఏ పర్వత శ్రేణి నేపాల్ లో కలదు? A. నాగ టిబ్బా B. ముస్సోరి C. మహా భారత్ D. దౌల్ దర్ 58. పీర్ పంజల్ శ్రేణికి మరియు హిమాద్రి శ్రేణికి మధ్యన ఉన్న ప్రాంతం ఏది? A. జమ్మూ కాశ్మీర్ B. హిమాచల్ ప్రదేశ్ C. అరుణాచల్ ప్రదేశ్ D. ఉత్తర ఖండ్ 59. భారతదేశంలోని ముఖ్యమైన వేసవి విడుదలు సిమ్లా, కులూ, కాంగా, ధర్మశాల, డల్హౌసి ఏ ప్రాంతానికి చెందినవి? A. ఉత్తర ఖండ్ B. పశ్చిమ బెంగాల్ C. హిమాచల్ ప్రదేశ్ D. జమ్మూ కాశ్మీర్ 60. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ కి చెందిన ముఖ్యమైన వేసవి విడుదుల ప్రాంతాలు ఏవి? A. చైల్ B. కలిం పాంగ్ C. డార్జీలింగ్ D. పైవన్నీ 61. హిమాచల్ /నిమ్న హిమాలయాల యొక్క వాలుల వెంబడి ఉన్న గడ్డి ప్రాంతాలను కాశ్మీర్ లో ఏమని పిలుస్తారు? A. మోర్గ్ B. బగ్ యాల్ C. పేయార్ D. ఏదీ కాదు 62. హిమాచల్ /నిమ్న హిమాలయాల యొక్క వాలుల వెంబడి ఉన్న గడ్డి ప్రాంతాలను బగ్ యాల్ మరియు పేయార్ అను పేర్లతో ఏ ప్రాంతం లో పిలుస్తారు? A. హిమాచల్ ప్రదేశ్ B. ఉత్తర ఖండ్ C. ఉత్తరాంచల్ D. జమ్మూ కాశ్మీర్ 63. హిమాద్రి మరియు హిమాచల్ శ్రేణుల మధ్య గల లోయలకు గల పేరు ఏమిటి? A. కాశ్మీర్ లోయలు B. కంగ్రా లోయలు C. కుట లోయలు D. పైవన్నీ 64. హిమాద్రి మరియు హిమాచల్ శ్రేణుల మధ్య గల కాంగ్రా లోయ మరియు కులు లోయలు ఏ ప్రాంతం లో కలవు? A. జమ్మూ కాశ్మీర్ B. హిమాచల్ ప్రదేశ్ C. ఉత్తరా ఖండ్ D. ఉత్తరాంచల్ 65. హిమాద్రి శ్రేణికి హిమాచల్ కు మధ్య గల లోతైన లోయల్లో ఉండే సన్నని రహదారులను ఏమని పిలుస్తారు? A. కాంగ్రా B. మోర్గ్ C. మార్గ్ D. కులు 66. హిమాద్రి శ్రేణికి హిమాచల్ కు మధ్య గల లోయల్లో ఉండే సన్నని రహదారి "గుల్మార్గ్" ఏ ప్రాంతంలో కలదు? A. హిమాచల్ ప్రదేశ్ B. ఉత్తరాంచల్ C. జమ్మూ కాశ్మీర్ D. ఉత్తరాఖండ్ 67. నిమ్న హిమాలయాలలోని మంచినీటి సరస్సు లకు గల పేరు ఏమిటి? A. నైని టాల్ B. భీమా టాల్ C. మహా భారత D. పైవన్నీ 68. నిమ్న హిమాలయాలలోని మహాభారత పర్వతం ఏ ప్రాంతంలో ఉంది? A. నేపాల్ B. భూటాన్ C. ఇండియా D. టిబెట్ 69. నిమ్న హిమాలయాలకు దక్షిణంగా ఏర్పడిన పర్వతాలు ఏవి? A. శివాలిక్/బాహ్య హిమాలయాలు B. ట్రాన్స్ హిమాలయాలు C. హిమాద్రి హిమాలయాలు D. ఏవి కావు 70. శీవాలిక్/బాహ్య హిమాలయాలు ఏ కాలంలో ఏర్పడ్డాయి? A. టెర్షియరి కాలం B. పాస్ట్ ప్లీయోసిన్ కాలం C. వియోసిన్ కాలం D. ఓలగోసిన్ కాలం 71. బాహ్య హిమాలయాల యొక్క సగటు ఎత్తు ఎన్ని మీటర్లు? A. 1000 మీటర్లు B. 1500 మీటర్లు C. 1800 మీటర్లు D. 1900 మీటర్లు 72. శివాలిక్/బాహ్య హిమాలయాల సగటు వెడల్పు ఎంత? A. 50 కి.మీ B. 100 కి.మీ C. 25 కి.మీ D. 35 కి.మీ 73. పాకిస్తాన్ లోని పొట్వార్ పీఠభూమి నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని "ది హంగ్ గార్జ్" వరకు విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? A. హిమాద్రి హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు C. బాహ్య హిమాలయాలు D. ట్రాన్స్ హిమాలయాలు 74. పర్వత పాద ప్రాంతాలు అని ఏ హిమాలయాలకు గల పేరు? A. హిమాద్రి/ఉన్నత హిమాలయాలు B. హిమాచల్/నిమ్న హిమాలయాలు C. శివాలిక్/బాహ్య హిమాలయాలు D. ట్రాన్స్ హిమాలయాలు 75. శివాలిక్/బాహ్య హిమాలయాలలో భూకంపాలు అధికంగా సంభవించుటకు గల కారణం ఏమిటి? A. అతి తక్కువ ఎత్తు ఉండటం వలన B. అత్యంత తక్కువ వయస్సు కలిగి ఉండటం వలన C. అతి తక్కువ కలిగి ఉండటం వలన D. పైవన్నీ 76. భూకంపాలు అధికంగా సంభవించే హిమాలయాలు ఏవి? A. హిమాద్రి B. నిమ్న C. బాహ్య D. ఏదీ కాదు 77. భారతదేశంలో అత్యంత తక్కువ ఎత్తు గల హిమాలయ పర్వతాలు ఏవి? A. హిమాద్రి హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు C. ట్రాన్స్ హిమాలయాలు D. బాహ్య హిమాలయాలు 78. బాహ్య హిమాలయాలైన శివాలిక్ శ్రేణులను ఉత్తరాఖండ్ లో ఏమని పిలుస్తారు? A. జమ్మూ కొండలు B. దుద్వా కొండలు C. చూరియా కొండలు D. మరియా కొండలు 79. బాహ్య హిమాలయాలైన శివాలిక్ శ్రేణులను చూరియా మరియు మరియా కొండలుగా ఏ ప్రాంతంలో పిలుస్తారు? A. భూటాన్ B. పాకిస్తాన్ C. నేపాల్ D. ఏదీ కాదు 80. భారతదేశంలో అబార్, డాప్లా, యిరి, మిరి మరియు మిష్మి కొండలు అని ఏ శ్రేణులను పిలుస్తారు? A. హిమాద్రి శ్రేణులను B. శివాలిక్ శ్రేణులను C. పీర్ పంజల్ శ్రేణులను D. కారకోరం శ్రేణులను 81. శివాలిక్ శ్రేణులను అబార్, డాప్లా, యిరి, మిరి మరియు మిష్మి కొండలుగా ఏ ప్రాంతంలో పిలుస్తారు? A. నేపాల్ B. భూటాన్ C. అరుణాచల్ ప్రదేశ్ D. జమ్మూ కాశ్మీర్ 82. శివాలిక్ శ్రేణులకు మరియు హిమాచల్ శ్రేణులకు మధ్య ఉత్తరాన సన్నని లోయా ప్రాంతానికి గల పేరు ఏమిటి? A. మార్గ్ B. డూన్స్ C. ఛోస్ D. మోర్గ్ 83. శివాలిక్ మరియు హిమాచల్ శ్రేణుల మధ్య ఏర్పడిన డూన్స్ లకు ఉత్తరాంచల్ లో గల పేరు ఏమిటి? A. డెహ్రడూన్ B. చౌకంబా డూన్ C. ప్లాటీ డూన్ D. పైవన్నీ 84. కోట్లీ మరియు ఉదంపూర్ డూన్స్ లు ఏ ప్రాంతంలో ఉన్నాయి? A. ఉత్తరాంచల్ B. జమ్మూ కాశ్మీర్ C. హిమాచల్ ప్రదేశ్ D. ఉత్తరాఖండ్ 85. హిమాలయాలలోని మానవ నివాసాలతో అభివృద్ధి చెందిన లోయ ప్రాంతాలు ఏవి? A. డెహ్రాడూన్ B. ఉద్దయ్ పూర్ C. కోట్లీ లోయలు D. పైవన్నీ 86. మధ్య మయోసిన్ మరియు ప్లిస్ట్రోసిన్ కాలంలో జరిగిన నవీన హిమాలయ ఉద్దరణ ప్రాంతాలు ఏవి? A. మార్గ్ B. డూన్స్ C. ఛోస్ D. ఏదీ కాదు 87. శివాలిక్/బాహ్య హిమాలయాలలోని చిన్న నీటి పాయలకు గల పేరు ఏమిటి? A. మార్గ్ B. ఛోస్ C. నైని టాల్ D. భీమా టాల్ 88. కలపకు పుట్టినిల్లు (Ment for wood) అని పిలువబడే హిమాలయాలు ఏవి? A. హిమాద్రి B. నిమ్న C. శివాలిక్ D. ట్రాన్స్ 89. ఏ హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఆయన రేఖ తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు కలవు? A. హిమాద్రి/ఉన్నత హిమాలయాల B. బాహ్య /శివాలిక్ హిమాలయాల C. హిమాచల్/నిమ్న హిమాలయాల D. ట్రాన్స్ హిమాలయాల 90. భారతదేశంలో ఉత్తరంగా జమ్ము కాశ్మీర్, టిబెట్ భూ భాగంలో విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? A. హిమాద్రి హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు C. శివాలిక్ హిమాలయాలు D. బాహ్య హిమాలయాలు 91. భారత్ లో అత్యంత ఉత్తర సరిహద్దుగా విస్తరించి ఉన్న ట్రాన్స్ హిమాలయ శ్రేణులు ఏవి? A. కారకోరం శ్రేణులు B. లడక్ శ్రేణులు C. జస్కార్ శ్రేణులు D. పీర్ పంజల్ శ్రేణులు 92. హిమాలయాలలోని ఏ పర్వతాలను "ఆసియా ఖండం యొక్క వెన్నెముక గా" (Back Bone of Asia) పేర్కొంటారు? A. కారకోరం పర్వతాలు B. లడక్ పర్వతాలు C. జస్కార్ పర్వతాలు D. హిమాద్రి పర్వతాలు 93. భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? A. పామిర్ పీఠభూమి B. జస్కార్ పీఠభూమి C. లడక్ పీఠభూమి D. ఏదీ కాదు 94. కృష్ణగిరి పర్వతాలు అని హిమాలయాలలోని ఏ పర్వతాలకు పేరు? A. హిమాద్రి పర్వతాలు B. కారకోరం పర్వతాలు C. శివాలిక్ పర్వతాలు D. హిమాచల్ పర్వతాలు 95. ట్రాన్స్ హిమాలయాలలోని కారకోరం శ్రేణిలోని ఎత్తైన శిఖరాన్ని ఏమని పిలుస్తారు? A. గాడ్విన్ ఆస్టిన్ (కృష్ణ గిరి) B. కామెట్ C. నంగ ప్రభాత్ D. ఏదీ కాదు 96. భారత్ లోని ఎత్తైన శిఖరం అయిన కృష్ణగిరి (గాడ్విన్ ఆస్టిన్ )యొక్క ఎత్తు ఎంత? A. 8511 మీటర్లు B. 8550 మీటర్లు C. 8611 మీటర్లు D. 8632 మీటర్లు 97. ప్రపంచంలోని 2 వ ఎత్తైన శిఖరం ఏది? A. గాడ్విన్ ఆస్టిన్(కృష్ణ గిరి శిఖరం) B. శివాలిక్ శిఖరం C. కామెట్ శిఖరం D. నంగ ప్రభాత్ శిఖరం 98. ప్రపంచంలోని 2 వ ఎత్తైన కృష్ణగిరి శిఖరమును చైనాలో ఏమని పిలుస్తారు? A. K2 B. క్వాగార్ C. చాగోరి D. ఏదీ కాదు 99. ప్రపంచంలోని 2 వ ఎత్తైన కృష్ణగిరి శిఖరమును చాగోరి అని ఏ ప్రాంతంలో పిలువబడుచున్నది? A. చైనా B. నేపాల్ C. భూటాన్ D. పాకిస్తాన్ 100. భారత్ లో ఎత్తైన కృష్ణగిరి శిఖరము నకు గల మరో పేరు ఏమిటి? A. క్వాగార్ B. చాగోరి C. K2 D. ఏదీ కాదు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next