భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-14 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 301 - 350 301. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ లలో విస్తరించిన గంగా మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. మధ్య గంగా మైదానాలు C. దిగువ గంగా మైదానాలు D. ఏదీ కాదు 302. మధ్య గంగా మైదానలలోని ఉత్తరగంగ లో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. మిథిలా మరియు మగథ D. కోసి మరియు అంగ 303. గంగా మైదాన ప్రాంతములోని దక్షిణగంగలో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. అంగ మరియు మిథిలా D. ఏదీ కాదు 304. భారతదేశంలోని ఉత్తరాన డార్జిలింగ్ పర్వత పాదాల నుండి, దక్షిణాన బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. దిగువ గంగా మైదానాలు C. మధ్య గంగా మైదానాలు D. ఏదీ కాదు 305. దిగువ గంగా మైదానాలు ఏ ఏ మైదాన భాగాలను కలిగి ఉన్నాయి? A. బరీండ్ మైదానం B. సుందర్ బన్స్ C. a మరియు b D. ఏదీ కాదు 306. గంగా మైదాన ప్రాంతాలలో 30 మీటర్ల ఎత్తు వరకు మట్టితో నిక్షిపితమై దిబ్బలుగా మారిన ఈ ప్రాంతాన్ని ఏమంటారు? A. ఖోల్స్ B. చొస్ C. దెయిన్స్ D. బార్కాన్స్ 307. గంగా మైదానంలో ఉన్న ఒండ్రు పొరలను ఏ నేలలుగా విభజించారు? A. భంగర్ మరియు టెరాయ్ B. భంగర్ మరియు బాబర్ C. భంగర్ మరియు ఖాదర్ D. టెరాయ్ మరియు ఖాదర్ 308. బ్రహ్మపుత్ర మైదానాలు దాని ఉపనదులైన లోహిత్ మరియు సెసిర నదుల ఒండ్రు మట్టి నిక్షేపాలతో ఏ లోయలో ఏర్పడినవి? A. బీహార్ లోయలో B. అస్సాం లోయలో C. పశ్చిమ బెంగాల్ లోయలో D. ఉత్తరాఖండ్ లోయలో 309. బ్రహ్మపుత్ర మైదానాల మొత్తం వైశాల్యం ఎంత? A. 50,274 చ.కి.మీ B. 60,254 చ.కి.మీ C. 56.274 చ.కి.మీ D. 65,254 చ.కి.మీ 310. బ్రహ్మపుత్ర మైదానాలు ఏ మైదాన రకానికి చెందినవి? A. చిత్తడి మైదాన B. క్రమ క్షియ మైదాన C. పగుళ్ళ మైదాన D. పైవన్నీ 311. బ్రహ్మపుత్ర మైదానాలు ఎంత పొడవు మరియు వెడల్పును కలిగి ఉన్నాయి? A. 720 కి.మీ మరియు 80 కి.మీ B. 520 కి.మీ మరియు 80 కి.మీ C. 720 కి.మీ మరియు 90 కి.మీ D. 520 కి.మీ మరియు 90 కి.మీ 312. ప్రపంచంలోనే అతి పెద్ద నది ద్వీపం ఏది? A. జంభూ ద్వీపం B. మజూలీ ద్వీపం C. అండమాన్ ద్వీపం D. ఏదీ కాదు 313. ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం అయిన మజూలీ ద్వీపం ఏ ప్రాంత మైదానాల నదులతో ఏర్పరచబడినది? A. గంగా మైదానాల B. బహ్మపుత్ర మైదానాల C. సింధూ మైదానాల D. ఏదీ కాదు 314. మజూలీ ద్వీపం యొక్క వైశాల్యం ఎన్ని చ.కి.మీ? A. 905 చ.కి.మీ B. 942 చ.కి.మీ C. 936 చ.కి.మీ D. 929 చ.కి.మీ 315. బృహత్ మైదానం అలహాబాద్ (గంగా) వద్ద ఎక్కువ వెడల్పుగా ఎన్ని కి.మీ ఉండి అస్సాం దగ్గర(బ్రహ్మపుత్ర) చాలా సన్నగా ఉంటుంది? A. 300 కి.మీ B. 220 కి.మీ C. 280 కి.మీ D. 240 కి.మీ 316. భారతదేశం లోని అతి పెద్ద నైసర్గిక స్వరూపం ఏది? A. తీర మైదానాలు B. హిమాలయాలు C. ద్వీపకల్ప పీఠ భూములు D. కనుమలు 317. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన పీఠభూమి ఏది? A. ద్వీపకల్ప పీఠభూమి B. డెల్టా పీఠభూమి C. బాగల్ పీఠభూమి D. ఏదీ కాదు 318. ద్వీపకల్ప పీఠభూమి యొక్క వైశాల్యం ఎన్ని చదరపు కిలో మీటర్లు? A. 12 లక్షల చ.కి.మీ B. 15 లక్షల చ.కి.మీ C. 16 లక్షల చ.కి.మీ D. 18 లక్షల చ.కి.మీ 319. హిమాలయా పర్వతాలతో పోలిస్తే ద్వీపకల్ప పీఠభూముల వయస్సు ఎంత ఎక్కువగా ఉంటుంది? A. 500 మిలియన్ సంవత్సరాలు B. 550 మిలియన్ సంవత్సరాలు C. 600 మిలియన్ సంవత్సరాలు D. 650 మిలియన్ సంవత్సరాలు 320. దక్కన్ పీఠభూమి తూర్పు పైపునకు వాలి ఉండడము వలన పశ్చిమ కనుమలలో పుట్టిన అనేక నదులు తూర్పుగా ప్రవహిస్తూ ఏ సముద్రములో కలుస్తున్నాయి? A. మధ్య దరా సముద్రం B. ఎర్ర సముద్రం C. బంగాళాఖాతము D. హిందూ మహా సముద్రం 321. ద్వీపకల్ప పీఠభూమి అని ఏ భూమిని పేర్కొంటారు? A. క్రమ క్ష్యయ భూమి B. కవచ భూమి C. చిత్తడి భూమి D. ఏదీ కాదు 322. ద్వీపకల్ప పీఠభూమి ఏ కాలానికి చెందినది? A. టెర్షియరి కాలానికి B. ప్రీ కేంబ్రియన్ కాలానికి C. ఓలగోసిన్ కాలానికి D. పాస్ట్ ప్లీయోసిన్ కాలానికి 323. ద్వీపకల్ప పీఠభూములు ఏ ఆకృతిని కలిగి ఉంటాయి? A. త్రికోణ ఆకృతి B. చతుర్బూజ ఆకృతి C. పంచీ కృత ఆకృతి D. ఏదీ కాదు 324. ద్వీపకల్ప పీఠభూములు ఏ అంశాలతో ఏర్పడి ఉన్నాయి? A. అగ్నిమాయ శిలలతో B. రూపాంతర ప్రాప్తి శిలలతో C. ఆర్కియన్ నైస్ శిస్ట్ లతో D. పైవన్నీ 325. దీపకల్ప పీఠభూమి ప్రాంతంలో భూకంప ప్రక్రియ చాలా అరుదుగా సంభవించడానికి గల కారణం ఏమిటి? A. భౌమ్యాచలనాలకు గురికాకపోవటం వలన B. త్రికోణ ఆకృతి వలన C. రూపాంతర ప్రాప్తి శిలలతో కూడి ఉండటం వలన D. పైవన్నీ 326. పగులు లోయ ద్వారా ప్రవహించే నర్మదా నది ద్వీపకల్ప భూభాగాన్ని ఎన్ని అసమాన భాగాలుగా విభజిస్తుంది? A. 3 B. 2 C. 4 D. 5 327. భారతదేశానికి దక్షిణంగా ఉన్న ద్వీపకల్ప భూభాగాన్ని ఏమంటారు? A. దక్కన్ పీఠభూమి B. మాల్వా పీఠభూమి C. బాగల్ ఖండ్ పీఠభూమి D. షిల్లాంగ్ పీఠభూమి 328. ప్రపంచంలో కెల్లా అతి పురాతనమైన ముడత పర్వతాలు ఏవి? A. ఆరావళి పర్వతాలు B. పాద్య పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 329. ఆరావళి పర్వతాలు ఏ శిలలను కలిగి ఉన్నాయి? A. అగ్నిమాయ శిలలను B. రూపాంతర శిలలను C. ఆర్కియన్ నైస్ శిలలను D. పైవన్నీ 330. ఆరావళి పర్వతాలు భారతదేశానికి పశ్చిమోత్తర భాగాన దాదాపు ఎన్ని కి.మీ విస్తరించి ఉన్నాయి? A. 500 కి.మీ B. 700 కి.మీ C. 800 కి.మీ D. 900 కి.మీ 331. భారతదేశంలోని ఆరావళి పర్వత శ్రేణులలో అత్యున్నతమైన శిఖరం ఏది? A. గురు శిఖర్ B. హర్షినాథ్ శిఖర్ C. రహనాథ్ పూర్ శిఖర్ D. ఏదీ కాదు 332. ఆరావళి పర్వతాలలోని అత్యున్నతమైన గురు శిఖర్ యొక్క ఎత్తు ఎన్ని మీటర్లు? A. 1522 మీ B. 1622 మీ C. 1722 మీ D. 1822 మీ 333. భారత దేశంలో ఉత్తర గుజరాత్ నుండి రాజస్థాన్ మీదుగా దక్షిణ ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? A. వింధ్య B. ఆరావళి C. సాత్పురా D. సహ్యాద్రి 334. ఆరావళి శిఖరాలలో ని వేసవి విడిది ప్రాంతం ఏది? A. డల్హౌసి B. మౌంట్ అబూ C. కులూ D. కాంగ్రా 335. ఆరావళి పర్వతాలలో ప్రసిద్ధ దేవాలయం అయిన దిల్వారా దేవాలయం ఏ మతస్తులది? A. బౌద్ధ B. జైన C. హిందూ D. అరబ్ 336. ఆరావళి పర్వతాలలో ముఖ్యమైన శిఖరాలు ఏవి? A. ఖో శిఖరం B. రహనాథ్ పూర్ శిఖరం C. హర్షి నాథ్ శిఖరం D. పైవన్నీ 337. హల్దీఘాట్, పిప్లీ ఘాట్,దివైర్ మరియు బార్ అను కనుమలు ఏ పర్వతాలలో కలవు? A. వింధ్య పర్వతాలు B. ఆరావళి పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. ఏదీ కాదు 338. గుజరాత్ లోని జోబార్ నుండి బీహార్ లోని ససారం వరకు1050 కి.మీ పొడవుతో విస్తరించిన పర్వతాలు ఏవి? A. వింధ్య పర్వతాలు B. ఆరావళి పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 339. వింధ్య పర్వతాలు ప్రధానంగా భారతదేశంలో ఏ ప్రదేశంలో ఉన్నాయి? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. మధ్యప్రదేశ్ D. బీహార్ 340. వింధ్య పర్వతాలు ఏ నదుల మధ్య వ్యాపించి ఉన్నాయి? A. నర్మదా-గంగా నదుల B. నర్మదా-తపతి నదుల C. నర్మదా-సోన్ నదుల D. నర్మదా-సింధూ నదుల 341. వింధ్య పర్వత శిఖరాలు సగటున ఎంత నుండి ఎంత వరకు ఎత్తును కలిగి ఉంటాయి? A. 600-1000 మీటర్ల ఎత్తు B. 700-1000 మీటర్ల ఎత్తు C. 600-1100 మీటర్ల ఎత్తు D. 700-1100 మీటర్ల ఎత్తు 342. ఆరావళి పర్వతాలు శిథిలమై వాటి శిథిలాల నిక్షేపాలతో ఏ పర్వత పంక్తి ఏర్పడినది ? A. వింధ్య పర్వత B. సాత్పురా పర్వత C. సహ్యాద్రి పర్వత D. పైవన్ని 343. ఏ రాయికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కావడం వలన నర్మదా నదిని "మారు బల్ " నది అని పిలుస్తారు? A. ఇసుక రాయి B. సున్నపు రాయి C. పాల రాయి D. నల్ల రాయి 344. వింధ్య పర్వత శ్రేణులలో వింధ్యన్ వ్యవస్థకు చెందిన ఎటువంటి శిలలను కలిగి ఉన్నాయి? A. ఇసుక రాళ్ళు B. క్వార్డ్ జ్ లు C. సున్నపు రాయి D. పైవన్నీ 345. భారతదేశంలో వింధ్య పర్వతాలను తూర్పున ఏమని పిలుస్తారు? A. అవశిష్ట పర్వతాలు B. కైమూర్ శ్రేణులు C. మైకాల్ శ్రేణులు D. ఏదీ కాదు 346. మహారాష్ట్ర లోని రత్నపూర్ నుండి మధ్యప్రదేశ్ లోని అమరక౦టక్ వరకు విస్తరించిన పర్వతాలు ఏవి? A. వింధ్యా పర్వతాలు B. సాత్పురా పర్వతాలు C. ఆరావళి పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 347. సాత్పురా పర్వతాలు ఏ శిలా విన్యాసం వల్ల ఏర్పడినవి? A. క్వర్డ్ జ్ శిలా B. ఆర్కియన్ నైస్ శిలా C. రూపాంతర శిల D. భ్రంశోద్ధిత శీలం 348. వింధ్య పర్వతాలు ఏ యుగానికి చెందినది? A. ఫ్రీకేంబ్రియాన్ B. టెర్షియర్ C. ఓలోగోసిన్ D. మధ్య మియోసిన్ 349. సాత్పురా పర్వతాల యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు? A. 950 కి.మీ B. 900 కి.మీ C. 970 కి.మీ D. 990 కి.మీ 350. సాత్పురా పర్వతాలు ఏ నదుల మధ్య వ్యాపించి ఉన్నాయి? A. నర్మదా-సోన్ నదుల B. సోన్-తపతి నదుల C. నర్మదా-తపతి నదుల D. నర్మదా-గంగా నదుల 351. లావా తో ఏర్పడిన మరియు రేడియల్ నదీ పరీవాహక వ్యవస్థ తో ఏర్పడిన పర్వతాలు ఏవి? A. ఆరావళి పర్వతాలు B. వింధ్య పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. ఏదీ కాదు 352. సాత్పురా పర్వత శ్రేణిలో భాగామైన ఏయే కొండలు మహారాష్ట్ర లో కలవు? A. రాజ్ పిప్ లా కొండలు B. పంచ్ మరి కొండలు C. సర్గూజా కొండలు D. పైవన్నీ 353. సాత్పురా పర్వతాల దక్షిణ భాగాన్ని ఏ కొండ అని పిలుస్తారు? A. గర్విల్ ఘర్ కొండ B. రాజ్ పిప్ లా కొండ C. పంచ్ మరి కొండ D. సర్గూజా కొండ 354. సాత్పురా పర్వతాలు నిర్మాణ పరంగా విభజించబడిన భాగాలు ఏవి? A. రాజ్ పిప్ లా కొండలు B. మహాదేవ కొండలు C. మైకాల్ కొండలు D. పైవన్నీ 355. సాత్పురా పర్వతాలలో క్వార్టే ట్ మరియు పింక్ శాండ్ స్టోన్ లు కలిగిన కొండలు ఏవి ? A. మహాదేవ కొండలు B. మైకాల్ కొండలు C. రాజ్ పిప్ లా కొండలు D. పంచ్ మరి కొండలు 356. సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరము ఏది? A. అస్టాంబ దోన్ గర్ B. గిర్నార్ C. దూప్ ఘర్ D. ఏదీ కాదు 357. భారతదేశంలో తూర్పున విస్తరించి.గోండ్వానా,ఆర్కియన్ మరియు నైస్ లతో ఏర్పడిన కొండలు ఏవి? A. రాజ్ పిప్ లా కొండలు B. మహాదేవ కొండలు C. మైకాల్ కొండలు D. అజంతా కొండలు 358. సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరము అయిన దూప్ ఘర్ శిఖర ఎత్తు ఎంత? A. 1350 మీ B. 1450 మీ C. 1380 మీ D. 1480 మీ 359. సాత్పురా పర్వతాలలో రెండవ ఎత్తైన శిఖరం ఏది? A. దూప్ ఘర్ B. అస్టాంబ దోన్ గర్ C. గిర్నార్ D. ఏదీ కాదు 360. సాత్పురా పర్వతాలు గల మధ్యప్రదేశ్ లోని మహాదేవ కొండల్లో వేసవి విడిది ప్రాంతం ఏది? A. వాటర్ షెడ్ B. పంచ్ మారి C. మౌంట్ అబూ D. గిర్నార్ 361. మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వతాలలో ప్రముఖ జలపాతం ఏది? A. దృవతార B. ఎంజిల్ C. సోన్ D. ఏదీ కాదు 362. సాత్పురా పర్వతాలకు పశ్చిమ భాగంలో సమాతరంగా ఉన్న వివిధ శ్రేణులలో ఉన్న ట్రాప్ లను ఏమంటారు? A. మైకాల్ ట్రాప్ లు B. దక్కన్ ట్రాప్ లు C. రాజ్ పిప్ లా ట్రాప్ లు D. అజంతా ట్రాప్ లు 363. ఉత్తర దక్షిణ భారతదేశములకు సరిహద్దుగా ఏ పర్వతాలున్నాయి? A. ఆరావళి పర్వతాలు B. వింధ్య సాత్పురా పర్వతాలు C. సహ్యాద్రి పర్వతాలు D. పైవన్నీ 364. వింధ్య, సాత్పూర పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది? A. నర్మదా B. తపతి C. గంగా D. ఏదీ కాదు 365. నర్మదా మరియు తపతీ నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఏవి? A. వింధ్య B. సాత్పూరా C. ఆరావళి D. ఏదీ కాదు 366. సాత్పూరా, అజంతా కొండ మధ్య ప్రవహిస్తున్న నది ఏది? A. నర్మదా B. తపతి C. గంగా D. ఏదీ కాదు 367. తపతి మరియు పెన్ గంగా నదుల మధ్య విస్తరించి ఉన్న కొండలు ఏవి? A. మహదేవ కొండలు B. మైకాల్ కొండలు C. అజంతా కొండలు D. రాజ్ పిప్ లా కొండలు 368. సాత్పూరా పర్వత శ్రేణులలోని రాజ్ మహల్ కొండలు ఏ రాష్ట్రంలో కలవు? A. మధ్యప్రదేశ్ B. మహారాష్ట్ర C. జార్ఖండ్ D. బీహార్ 369. మధ్యప్రదేశ్ లోని పన్నా కొండలు దేనికి ప్రసిద్ధి చెందాయి? A. పింక్ శాండ్ స్టోన్ కి B. వజ్రాలకి C. పగడాలకి D. బంగారానికి 370. అజంతా మరియు బాలఘాట్ శ్రేణులు ఏ రాష్ట్రంలో కలవు? A. గుజరాత్ B. మధ్యప్రదేశ్ C. జార్ఖండ్ D. మహారాష్ట్ర 371. మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ మధ్య గల పీఠభూమి ఏది? A. కథియావార్ పీఠభూమి B. బుందేల్ ఖండ్ పీఠభూమి C. బాగల్ ఖండ్ పీఠభూమి D. షిల్లాంగ్ పీఠభూమి 372. మాల్వా గ్యాప్ ద్వీపకల్ప పీఠభూమి నుండి వేరు చేయబడిన షిల్లాంగ్ పీఠభూమి ఎక్కడ కలదు? A. అరుణాచల్ ప్రదేశ్ B. ఉత్తరాఖండ్ C. మేఘాలయ D. ఉత్తరాంచల్ 373. రూర్ ఆఫ్ ఇండియా అని పేరు గాంచిన పీటభూమి ఏది? A. ఛోటా నాగపూర్ పీఠభూమి B. మాల్వా పీఠభూమి C. కథియావార పీఠభూమి D. షిల్లాంగ్ పీఠభూమి 374. రూప్ ఆఫ్ ఇండియా అని పేరు గాంచిన ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ ప్రాంతములలో కలదు? A. జార్ఖండ్ B. ఛత్తీస్ ఘడ్ C. పశ్చిమబెంగాల్ D. పైవన్నీ 375. చంబల్ ,బెట్వా మరియు పర్వతీ నదులు ఏ పీఠభూమి పరివాహక ప్రాంతములో ప్రవహిస్తున్నాయి? A. కథియవార పీఠభూమి B. మాల్వా పీఠభూమి C. షిల్లాంగ్ పీఠభూమి D. ఏదీకాదు 376. మధ్య ప్రదేశ్ లోని చంబల్ నదీలోయ ప్రాంతంలో చంబల్ నదీ క్రమక్షయం వల్ల ఏర్పడిన భూములు ఏవి? A. కందర భూములు B. దక్కన్ భూములు C. థాల్ భూములు D. ఏదీ కాదు 377. మహారాష్ట్ర,గుజరాత్ మరియు ఉత్తర కర్ణాటక మధ్య ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు? A. అజంతా శ్రేణులు B. దక్కన్ నాపలు C. బాల ఘాట్ నాపలు D. పైవన్నీ 378. మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఉత్తర కర్ణాటక లోని దక్కన్ నాపలు ఏ శిలలచే ఏర్పడినవి A. బసాల్ట్ శిలలు B. రూపాంతర శిలలు C. ఆర్కియన్ నైన్ శిలలు D. గోండ్వాన శిలలు 379. భారతదేశంలోని మాల్వా పీఠభూమి ఏ రాష్ట్రంలో కలదు? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. మధ్యప్రదేశ్ D. ఒడిశా 380. బొనాయ్ , కియోంజార్ మరియు మయూర్ భంజ్ అను కొండలు ఏ రాష్ట్రములో కలవు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. మధ్యప్రదేశ్ D. ఒడిశా 381. భారతదేశంలోని సహ్యాద్రి పర్వతాలకు మరొక పేరు ఏమిటి? A. పశ్చిమ కనుమలు B. దక్షిణ కనుమలు C. కందర భూములు D. ఏదీకాదు 382. తపతి నది లోయకు దక్షిణముగా మహారాష్ట్రలో ఖాందేష్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పర్వతాలను ఏమంటారు? A. వింధ్య పర్వతాలు B. సాత్పురా పర్వతాలు C. సహ్యాద్రి పర్వతాలు D. ఆరావళి పర్వతాలు 383. పశ్చిమ కనుమలు ఏ సముద్రం వైపు నిట్రమైన వాలును కలిగి, పీఠభూమి వైపు మెట్ల మాదిరిగా వాలుని కలిగి ఉంటాయి? A. బంగాళాఖాతం B. అరేబియా సముద్రం C. హిందూ మహాసముద్రం D. ఏది కాదు 384. పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం వైపు వాలుని కలిగి, పీఠభూమి వైపు మెట్ల మాదిరిగా ఉన్న నైసర్గిక స్వరూపాన్ని ఏమని పిలుస్తారు? A. ట్రిపియన్ నైసర్గిక స్వరూపం B. టేర్షియర్ నైసర్గిక స్వరూపం C. త్రిపియన్ నైసర్గిక స్వరూపం D. ఏది కాదు 385. పశ్చిమ కనుమలు (లేదా) సహ్యాద్రి పర్వతాల పొడవు ఎన్ని కిలోమీటర్లు? A. 1500 కి.మీ B. 1550 కి.మీ C. 1600 కి.మీ D. 1650 కి.మీ 386. పశ్చిమ కనుమల ఎత్తు సరాసరి ఎన్ని మీటర్ల ఖండ పర్వతమును కలిగి ఉంది? A. 1200 మీ B. 1400 మీ C. 1600 మీ D. 1800 మీ 387. ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న రెండు నదీవ్యవస్థల మధ్య గల ఎత్తైన భూభాగాన్ని ఏమంటారు? A. క్రమక్షయం B. వాటర్ షెడ్ C. వాలు D. ఏదీకాదు 388. ద్వీపకల్ప భారతదేశానికి వాస్తవిక వాటర్ షెడ్ గా ఉన్న పర్వతాలు ఏవి? A. కాంచన పర్వతాలు B. వింధ్య పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 389. సహ్యాద్రి పర్వతాలను తమిళనాడులో ఏమని పిలుస్తారు? A. అన్నమలై కొండలు B. కార్డమమ్ కొండలు C. నీలగిరి కొండలు D. కందర కొండలు 390. పశ్చిమ కనుమలలోని వివిధ ఎత్తులలో గల ప్రధానమైన శిఖరాలు ఏ ప్రాంతములో విస్తరించి ఉన్నాయి? A. మహారాష్ట్ర B. కర్ణాటక C. తమిళనాడు D. పైవన్నీ 391. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? A. నీలగిరి B. అనైముడి C. కార్డమమ్ D. ఏదీకాదు 392. దీపకల్ప పీఠభూమి ప్రాంతములో ఎత్తైన శిఖరం ఏది? A. నీలగిరి B. కార్డమమ్ C. అనైముడి D. దొడ బెట్ట 393. పశ్చిమ కనుమలలో గల ఎత్తైన మరియు రెండు శాఖలుగా చీలిన అనైముడి శిఖరము ఏ ప్రాంతములో కలదు? A. తమిళనాడు B. కేరళ C. కర్ణాటక D. మహారాష్ట్ర 394. పాల్ ఘాట్ కనుమలోని ఎత్తైన శిఖరము అయిన అనైముడి పర్వతం యొక్క ఎత్తు ఎంత? A. 2695 మీ B. 2600 మీ C. 2690 మీ D. 2665 మీ 395. అనైముడి శిఖరములో గల రెండు శాఖలలో, ఒకటి తమిళనాడులో విస్తరించిన పళనీ కొండలో వేసవి విడిది ప్రాంతం ఏది? A. ఊటీ B. కొడైకెనాల్ C. మౌంట్ అబూ D. ఏదీకాదు 396. అనైముడి శిఖరం రెండో శాఖ విస్తరించిన కొండలను కన్యాకుమారిలో ఏమని పిలుస్తారు A. కార్డమమ్ కొండలు B. యాలకుల కొండలు C. ఇలై మలై కొండలు D. పైవన్నీ 397. దక్షిణ భారతదేశంలోనే అన్నింటికంటే ఎక్కువగా విస్తరించి ఉన్న శ్రేణి ఏది? A. కార్డమమ్ శ్రేణి B. అనైముడి శ్రేణి C. నీలగిరి శ్రేణి D. ఏదీకాదు 398. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము ఏది? A. అనైముడి B. కుద్రే ముఖ్ C. పుష్పగిరి D. బ్రహ్మిగిరి 399. ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని "క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్"అని అంటారు? A. సిమ్లా B. శ్రీ నగర్ C. ఊటీ D. అరకు 400. నీలగిరి శ్రేణులలో ప్రముఖ జలపాతం ఏది? A. పొన్నేరి జలపాతం B. జోగ్ జలపాతం C. కలహట్టి జలపాతం D. ఏది కాదు 401. నీలగిరుల్లో నివసించే గిరిజన తెగలు ఏవి? A. తోడాలు B. బడగాలు C. కోటాలు D. పైవన్నీ తెగలు 402. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము అయిన "అనైముడి" ఎత్తు ఎంత? A. 2695 మీ B. 3308 మీ C. 2638 మీ D. 2528 మీ 403. ద్వీపకల్వ పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది? A. దొడబెట్ట B. సాల్ హర్ C. పావుల్ మలై D. అనైముడి 404. కేరళలోని పాలక్కాడ్ ను తమిళనాడులో కొయంబత్తూర్ ను కలుపు కనుమ ఏది? A. పాల్ ఘాట్ B. థాల ఘాట్ C. బోర్ ఘాట్ లు D. షెన్ కోట్ 405. పశ్చిమ కనుమలు ఏ శిలలతో ఏర్పడివున్నాయి? A. లావా శిలల B. గ్రానైట్ శిలలు C. సున్నపు రాయి శిలలు D. a మరియు b 406. భారతదేశం లో ఎత్తైన జలపాతం ఏది? A. జోగ్ జలపాతం B. కల హట్టి జలపాతం C. కుంచికల్ D. నోహ్ కాలికాయ్ జలపాతం 407. జోగ్ జలపాతం ఏ నది పై కలదు? A. పెన్నా నది B. కృష్ణ నది C. కావేరి నది D. శరావతీ నది 408. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? A. మహేంద్ర గిరి B. ఆరోయా కొండ C. జింద గడ కొండ D. గాలి కొండ 409. మాలియా శ్రేణులలో ఎత్తైన శిఖరం ఏది? A. బ్రహ్మ గిరి B. మహేంద్ర గిరి C. పుష్ప గిరి D. గాలి కొండ 410. తూర్పు కనుమలలో ఉత్తర భాగాన ఉన్న కొండలు ఏవి? A. సింహా చలం B. యారాడ కొండలు C. మహేంద్ర గిరులు D. పైవన్నీ 411. ఈ క్రింది వాటిలో తమిళనాడు కొండలు ఏవి? A. ఆర్కాట్ గింజ B. జువాది C. పంచమలై D. పైవన్నీ 412. ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలిగించడం లో కీలక పాత్ర వహించే కొండలు ఏవి? A. షెవరాయ్ కొండలు B. జువాది కొండలు C. గొండుమలై కొండలు D. ఆర్కాట్ గింజ కొండలు 413. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ లో గల శిఖరాలు ఏవి? A. సరామతి B. అనైముడి C. జిందగడ కొండ D. గురు శిఖర్ 414. ఆరావళి మరియు వింధ్య పర్వతాల మధ్య ఉన్న పీఠభూమి ఏది? A. బుందేల్ ఖండ్ పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. బాగల్ ఖండ్ పీఠభూమి D. దక్కన్ పీఠభూమి 415. భారతదేశంలో గల "మాళ్వా పీఠభూమి"వైశాల్యం ఎంత? A. 15000 చ.కి.మీ B. 2500 చ.కి.మీ C. 35000 చ.కి.మీ D. 6200 చ.కి.మీ 416. మాళ్వాపీఠభూమిలో గల ఏ నదులు అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి? A. నర్మద B. తపతి C. మహి D. పైవన్నీ 417. మాళ్వా పీఠభూమి లో తూర్పు వైపుకు పోయి యమునా నది లో కలుయు నది ఏది? A. చంబల్ B. బెట్వా C. తపతి D. a మరియు b 418. ఈ క్రింది వాటిలో కఠినమైనటువంటి కవచ భూ భాగం ఏది? A. దక్కన్ పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. బుందేల్ ఖండ్ పీఠభూమి D. బాగల్ ఖండ్ పీఠభూమి 419. భారతదేశం లోని "పన్నా వజ్రపు గనులు"ఏ పీఠభూమిలో కలవు? A. బాగల్ ఖండ్ పీఠభూమి B. దక్కన్ పీఠభూమి C. మాళ్వా పీఠభూమి D. బుందేల్ ఖండ్ పీఠభూమి 420. భారతదేశం లో ఉత్తరాన సాత్పురా నుండి దక్షిణాన నీలగిరి కొండలలోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పీఠభూమి ఏది? A. దక్కన్ పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. బుందేల్ పీఠభూమి D. పైవన్నీ 421. భారతదేశం లోని దక్కన్ పీఠభూమి యొక్క విస్తీర్ణం ఎంత? A. 5 లక్షల చ.కి.మీ B. 10 లక్షల చ.కి.మీ C. 2 లక్షల చ.కి.మీ D. 16 లక్షల చ.కి.మీ 422. మహారాష్ట్ర ఒకే రాష్ట్రం లో విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? A. సాత్పురా పర్వతాలు B. అజంతా పర్వతాలు C. వింధ్య పర్వతాలు D. a మరియు c 423. కర్ణాటక పీఠభూమి ఏ శిలలకు ప్రసిద్ది? A. గ్రానైట్ శిలలకు B. లావా శిలలకు C. సున్నపురాతి శిలలకు D. ఇసుక శిలలకు 424. ఏ పీఠభూమిలో పర్వతాలతో కూడిన పశ్చిమ భాగాన్ని "మల్నాడు పీఠభూమి" అంటారు ? A. తెలంగాణ పీఠభూమి B. కర్ణాటక పీఠభూమి C. ఛోటానాగపూర్ పీఠభూమి D. మహారాష్ట్ర పీఠభూమి 425. కర్ణాటక పీఠభూమి లో ఎత్తైన శిఖరం ఏది? A. మూలాన్ ఘిరి B. మహేంద్ర గిరి C. పుష్ప గిరి D. గాలి కొండ 426. కర్ణాటక పీఠభూమి లో గల ప్రముఖ కొండలు ఏవి? A. మడకశిర కొండలు B. వెలి కొండలు C. బాబు బూదాన్ D. సింహాచలం కొండలు 427. కర్ణాటక పీఠభూమిలో గల "మూలాన్ ఘిరి"శిఖరం ఎత్తు ఎంత? A. 1923 మీటర్లు B. 3200 మీటర్లు C. 2000 మీటర్లు D. 1539 మీటర్లు 428. కర్ణాటక పీఠభూమిలో గల రెండవ ఎత్తైన శిఖరం ఏది? A. మూలాన్ ఘిరి B. కుద్రే ముఖ్ C. పావుల్ మలై D. బ్రహ్మిగిరి 429. కర్ణాటక మైదాన్ పీఠభూమి లో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు? A. తేయాకు B. మొక్కజొన్న C. కాఫీ D. పొగాకు 430. ఆర్కియాన్ గ్రానైట్ మరియు నైస్ శిలలచే ఏర్పడిన పీఠభూమి ఏది? A. మహారాష్ట్ర పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. ఛోటానాగపూర్ పీఠభూమి D. తెలంగాణ పీఠభూమి 431. ఈ క్రింది వాటిలో ఏ పీఠభూమి "ఖనిజములకు" పుట్టినిల్లు? A. ఛోటానాగపూర్ పీఠభూమి B. దక్కన్ పీఠభూమి C. మాళ్వా పీఠభూమి D. తెలంగాణ పీఠభూమి 432. రూల్ ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని పిలుస్తారు? A. కర్కాటక పీఠభూమి B. మహారాష్ట్ర పీఠభూమి C. ఛోటానాగపూర్ పీఠభూమి D. బాగల్ ఖండ్ పీఠభూమి 433. రాజస్థాన్ లో ఉన్న పీఠభూమి ఏది? A. షిల్లాంగ్ పీఠభూమి B. బస్తర్ పీఠభూమి C. భోరట్ పీఠభూమి D. బుందేల్ ఖండ్ పీఠభూమి 434. థార్ ఎడారిలో కనిపించే ప్రముఖ పర్వతాలు ఏవి? A. వింధ్య పర్వతాలు B. సాత్పురా పర్వతాలు C. ఆరావళి పర్వతాలు D. ముడుత పర్వతాలు 435. థార్ ఎడారిలో ఉన్న ప్రముఖ జన పదాలు ఏవి? A. జోథ్ పూర్ B. జైనల్మీర్ C. బికనీర్ D. పైవన్నీ 436. భారత ప్రభుత్వం ఎడారి నేలల పరిశోధన ప్రాంతాన్ని ఎక్కడ స్థాపించారు? A. ఉదయ్ పూర్ లో B. జోథ్ పూర్ లో C. ఛండీ ఘర్ లో D. నాగ్ పూర్ లో 437. థార్ ఎడారి వైశాల్యం ఎంత? A. దాదాపు 2 లక్షల చదరపు కిలో మీటర్లు B. దాదాపు 4 లక్షల చదరపు కిలో మీటర్లు C. దాదాపు 1 లక్షల చదరపు కిలో మీటర్లు D. దాదాపు 50 వేల చదరపు కిలో మీటర్లు 438. థార్ ఎడారిలో కనిపించే ప్రముఖ సరస్సుల నగరం ఏది? A. జోథ్ పూర్ B. జైసల్మీర్ C. ఉదయ్ పూర్ D. బికనీర్ 439. భారతదేశం లో అతి పెద్ద అంతర్భూభాగ సరస్సు ఏది? A. లూనీ B. సాంబార్ సరస్సు C. చిలుక D. ప్లయా సరస్సు 440. థార్ ఎడారి లోని ఏ నదిలో ఎగువ భాగం లో నీరు తియ్యగా ఉండి దిగువ భాగం లో ఉప్పు గా ఉంటాయి? A. లూనీ నది B. ప్లయా నది C. సట్లేజ్ నదులు D. శరావతి నది 441. రాణా ఆఫ్ కచ్ ఎక్కడ ఉండి ? A. రాజస్థాన్ B. బీహార్ C. గుజరాత్ D. పంజాబ్ 442. భారతదేశం లో అత్యధిక తీర రేఖ ఉన్న ప్రాంతాలు ఏవి? A. అండమాన్ నికోబార్ దీవులు B. గుజరాత్ C. ఆంధ్రప్రదేశ్ D. పైవన్నీ 443. భారతదేశంలో గల తూర్పు తీర మైదానాలు పొడవు ఎంత? A. 1100 కి.మీ B. 1500 కి.మీ C. 2500 కి.మీ D. 750 కి.మీ 444. కావేరి డెల్టా ఏ మైదానం లో ఉంది? A. తమిళనాడు మైదానం B. ఆంధ్ర మైదానం C. ఉత్కళ మైదానం D. వంగ తీరం 445. ఆంధ్ర మైదానం లో ఉన్న ముఖ్యమైన సరస్సులు ఏవి? A. కొల్లేరు B. పులికాట్ C. సాంబార్ D. a మరియు b 446. "సర్కార్ తీరం" అని ఏ మైదానాన్ని పిలుస్తారు? A. వంగతీర మైదానం B. ఆంధ్ర మైదానం C. కోంకణ్ మైదానం D. మలబార్ మైదానం 447. ఉత్కళ మైదానం లో గల ప్రముఖ సరస్సు ఏది? A. పులికాట్ సరస్సు B. కొల్లేరు సరస్సు C. చిలిక సరస్సు D. సాంబార్ సరస్సు 448. భారతదేశం లో బరంపురం నుండి సుందర్ బన్స్ వరకు వ్యాపించి ఉన్న మైదానం ఏది? A. ఉత్కళ మైదానం B. ఆంధ్ర మైదానం C. తమిళనాడు మైదానం D. కెనరా మైదానం 449. కాంతి తీర మైదానం అని ఏ మైదానాన్ని పిలుస్తారు? A. వంగ తీరం B. కథియావార్ తీర మైదానం C. మలబార్ తీర మైదానం D. కొంకన్ తీర మైదానం 450. రామక్రిష్ణ ,మంగిన పూడి మరియు సూర్య లంక అను బీచ్ లు ఏ ప్రాంతంలో కలవు? A. ఒరిస్సా B. తమిళనాడు C. పశ్చిమ బెంగాల్ D. ఆంధ్రప్రదేశ్ 451. మహా నది అను డెల్టా ఏ ప్రాంతం లో ఉంది? A. కేరళ B. రాజస్థాన్ C. ఉత్తరప్రదేశ్ D. ఒరిస్సా 452. గంగా డెల్టా ఏ రాష్ట్రం లో ఉంది? A. ఆంధ్రప్రదేశ్ B. మధ్యప్రదేశ్ C. ఉత్తరప్రదేశ్ D. పశ్చిమబెంగాల్ 453. సుందన్ బన్స్ నుండి గంగానది ముఖద్వారం వరకు విస్తరించి ఉన్న తీర మైదానం ఏది? A. వంగ తీర మైదానం B. కోరమాండల్ తీర మైదానం C. సర్కార తీర మైదానం D. ఉత్కళ్ మైదానం 454. పురి అను బీచ్ ఏ రాష్ట్రం లో కలదు? A. తమిళనాడు B. కేరళ C. ఒరిస్సా D. అస్సాం 455. ఆంధ్రప్రదేశ్ లో గల దీవులు ఏవి? A. న్యూ మూర్ దీవులు B. శ్రీ హరి కోట దీవులు C. లక్ష దీవులు D. అండమాన్ దీవులు 456. మెరినా బీచ్ ఎక్కడ ఉంది? A. తమిళనాడు B. కర్ణాటక C. అరుణాచల్ ప్రదేశ్ D. కేరళ 457. తూర్పు తీరమైదానం లో గల "పులికాట్" అను ఉప్పు నీటి సరస్సు ఏ ప్రాంతం లో కలదు? A. ఆంధ్రప్రదేశ్ B. తమిళనాడు C. పంజాబ్ D. a మరియు b 458. గుజరాత్ నుండి డామన్ వరకు విస్తరించి ఉన్న తీర మైదానం ఏది? A. కథియావార్ మైదానం B. కొంకన్ మైదానం C. కెనరా మైదానం D. మలబార్ మైదానం 459. వాస్కోడిగామా బీచ్ ఏ తీర మైదానం లో ఉంది? A. వంగ తీర మైదానం B. సర్కార్ తీర మైదానం C. కోరమాండల్ తీర మైదానం D. కొంకన్ మైదానం 460. ఏ తీర మైదానం "కయ్యలకు ప్రసిద్ది? A. కర్ణాటక మైదానం B. ఉత్కళ్ మైదానం C. పశ్చిమ బెంగాల్ మైదానం D. తమిళనాడు మైదానం 461. లాగున్స్ అనగా నేమి? A. ముందుకు వచ్చిన జలాలు B. వెనుకకు వచ్చిన జలాలు C. పాయాలు గా చీలిన జలాలు D. పైవన్నీ 462. ఏ మైదానం లో వెనుకకు వచ్చిన జలాలను "కాయల్స్ "లేదా "లాగున్స్" అని పిలుస్తారు? A. గుజరాత్ మైదానం B. కేరళ మైదానం C. తమిళనాడు మైదానం D. ఆంధ్ర మైదానం 463. డామన్ నుండి గోవా వరకు 500 కి.మీ విస్తరించి ఉన్న మైదానం ఏది? A. కొంకన్ మైదానం B. మలబార్ మైదానం C. కైత్వార్ మైదానం D. కెనరా మైదానం 464. దక్షిణ కన్నానూర్ నుండి కేప్ కేమరూన్ వరకు 500 కిలో మీటర్లు విస్తరించి ఉన్న మైదానం ఏది? A. కేరళ మైదానం B. ఆంధ్ర మైదానం C. గుజరాత్ మైదానం D. తమిళనాడు మైదానం 465. ఏ సరస్సులో ప్రతి సంవత్సరం "ఓనం " పండుగను నిర్వహిస్తారు? A. చిలిక సరస్సు B. పులికాట్ సరస్సు C. వెంబనాడ్ సరస్సు D. సాంబార్ సరస్సు 466. జూహూ బీచ్ ఎక్కడ ఉంది? A. గోవా B. కర్ణాటక C. మహారాష్ట్ర D. గుజరాత్ 467. గల్ఫ్ ఆఫ్ కచ్ మరియు గల్ఫ్ ఆఫ్ కంబాట్ ల మధ్య ఉన్న ద్వీపకల్పం ఏది? A. కథియావార్ ద్వీపకల్పం B. ఖోండ లైట్ ద్వీపకల్పం C. చార్నో కైట్ ద్వీపకల్పం D. కొచ్చిన్ ద్వీపకల్పం 468. కథియావార్ ద్వీపకల్పం ఎక్కడ ఉంది? A. బీహార్ B. పంజాబ్ C. అస్సాం D. గుజరాత్ 469. మోన జైట్ నిక్షేపాలు ప్రధానంగా ఏ తీర ప్రాంతంలో లభ్యమవుతున్నాయి? A. కేరళ B. గోవా C. తమిళనాడు D. పశ్చిమ బెంగాల్ 470. ఆంధ్రప్రదేశ్ లోని తీర మైదానం లో ప్రధానంగా ఏ ఖనిజం లభ్యమవుతుంది? A. ఇల్మనైట్ B. మోనజైట్ C. జిప్సమ్ D. సున్నపురాయి 471. పెట్రోలియం మరియు సహజ వాయువు నిక్షేపాలు ప్రధానంగా ఏ ప్రాంతం లో విస్తరించి ఉన్నాయి? A. గుజరాత్ B. ఆంధ్ర ప్రదేశ్ C. తమిళనాడు మరియు మహారాష్ట్ర D. పైవన్నీ 472. భారతదేశం లో ఎత్తైన పర్వత శ్రేణి ఏది? A. లడఖ్ శ్రేణి B. కారకొరం శ్రేణి C. దౌల్ దర్ శ్రేణి D. ఆరావళి శ్రేణి 473. భారతదేశం లో ఎత్తైన శిఖరం ఏది? A. కాంచన్ గంగా B. గురు శిఖరం C. గాడ్విన్ ఆస్టిన్ D. నంగా పర్బత్ 474. గాడ్విన్ ఆస్టిన్ (కె2) శిఖరం ఎత్తు ఎంత? A. 8611 మీటర్లు B. 5800 మీటర్లు C. 8200 మీటర్లు D. 8126 మీటర్లు 475. భారతదేశం లో ఉన్న హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఏది? A. నంగా పర్బత్ B. కాంచన్ గంగా C. గాడ్విన్ ఆస్టిన్ D. ధూప్ గర్ 476. కాంచన్ గంగా ఏ ప్రాంతం లో కలదు? A. జమ్మూ కాశ్మీర్ B. అస్సాం C. సిక్కిం D. మేఘాలయ 477. పశ్చిమ కనుమలలో(కర్నాటకలో) గల శిఖరం ఏది? A. మలయ గిరి B. మహేంద్ర గిరి C. బ్రహ్మగిరి D. పుష్పగిరి 478. మహారాష్ట్ర లో గల పర్వతాలు ఏవి? A. సహ్యాద్రి పర్వతాలు B. పళనీ కొండలు C. హరిశ్చంద్ర పర్వతాలు D. a మరియు c 479. అన్నామలై & యాలకుల కొండలు ఏ ప్రాంతం లో కలవు? A. తమిళనాడు B. కేరళ C. త్రిపుర D. సిక్కిం 480. నీలగిరి కొండలు ఏ రాష్ట్రం లో ఉన్నాయి? A. తమిళనాడు B. బీహార్ C. పశ్చిమ బెంగాల్ D. కేరళ 481. ముంబాయి మరియు నాసిక్ లను కలుపు కనుమ ఏది? A. బోర్ ఘాట్ B. థాల్ ఘాట్ C. పాల్ ఘాట్ D. షెన్ కోట్ 482. వేసవి విడిది ఉదక మండలం(ఊటీ) ఏ కొండలలో ఉంది? A. పళని కొండలు B. నీలగిరి కొండలు C. జయంతి కొండలు D. మిజో కొండలు 483. భారతదేశం లో గల ఎత్తైన శిఖరం(కె2) ఏ శ్రేణులలో కలదు? A. కారకొరమ్ శ్రేణులు B. పూర్వాంచల్ శ్రేణులు C. లడఖ్ శ్రేణులు D. ఆరావళి శ్రేణులు 484. భారతదేశం లో కందర భూములను కలిగి ఉన్న పీఠభూమి ఏది? A. దక్కన్ పీఠభూమి B. మాళ్వా పీఠభూమి C. బుందేల్ ఖండ్ పీఠభూమి D. ఛోటా నాగాపూర్ పీఠభూమి 485. భారతదేశం లోని బుందేల్ ఖండ్ పీఠభూమిలో ప్రవహించే ముఖ్యమైన నది ఏది? A. యమున B. పెన్నా C. నర్మదా D. తపతి 486. ఏ ప్రాంతాన్ని ఛత్తీస్ ఘడ్ మైదాన ప్రాంతాలని పిలుస్తారు? A. మహానది హరివణం B. కందర భూములు C. దండకారణ్యం D. పైవన్నీ ప్రాంతాలు 487. భారత దేశ 2వ మిసైల్స్ లాచింగ్ పాడ్ ఏ దీవి లో ఉంది? A. అండమాన్ దీవులు B. వీలర్ దీవి C. లక్ష దీవి D. గ్రేట్ నికోబార్ దీవి 488. భారత దేశ మొదటి మిసైల్స్ లాచింగ్ పాడ్ ఏ దీవి లో ఉంది? A. ఒడిశా లోని ఛాందీ పూర్ లో B. గుజరాత్ లోని జార్ఖండ్ C. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ హరి కోటలో D. మహారాష్ట్ర లోని ముంబాయి లో 489. భారత ఉప ఖండము ఎన్ని డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది? A. 8 డిగ్రీల B. 6 డిగ్రీల C. 12 డిగ్రీల D. 15 డిగ్రీల 490. భారత ఉప ఖండము లో అత్యధిక వర్షపాతం ఏ ప్రాంతం లో ఉంటుంది? A. మాసిన్ రామ్ B. చిరపుంజి C. జకోబాద్ D. a మరియు b 491. భారత ఉప ఖండం లో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత? A. 52.20 సెం.గ్రే B. 60.32 సెం.గ్రే C. 35.30 సెం.గ్రే D. 40 డిగ్రీల సెం.గ్రే 492. భారత ఉప ఖండం లో అత్యల్ప ఉష్ణోగ్రత ఏ ప్రాంతం లో కలదు? A. మేఘాలయ లోని చిరపుంజి B. పాకిస్తాన్ లోని జకోబాద్ C. జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ కొండల్లో D. మేఘాలయ లోని మాసిన్ రామ్ 493. ఆసియా ఖండం లో అత్యంత పెద్ద దేశం ఏది? A. భారతదేశం B. మాల్దీవులు C. శ్రీలంక D. నేపాల్ 494. కొండలు మరియు పీఠభూములు లేని పూర్తి మైదాన ప్రాంతం ఏది? A. బంగ్లాదేశ్ B. శ్రీలంక C. భూటాన్ D. నేపాల్ 495. భారత ఉప ఖండం లో అతి ప్రాచీన భూ భాగాలు ఏవి? A. తీర మైదానాలు B. పీఠ భూములు C. ఎడారి ప్రాంతాలు D. పల్లపు ప్రాంతాలు 496. ఆసియా ఖండం లో అతి చిన్న దేశం ఏది? A. నేపాల్ B. బంగ్లాదేశ్ C. శ్రీలంక D. మాల్దీవులు 497. రాజస్థాన్ లో అతి తక్కువ వర్షపాతం ఉండటం వల్ల రాజస్థాన్ ను ఏమని పిలుస్తారు? A. మరుస్తలి B. బార్కన్ లు C. రోహి D. డిసర్ట్ 498. గంగా మైదానాల పరివాహక ప్రాంతము భారతదేశంలో ఎన్నవ వంతు వైశాల్యమును కలిగి ఉంటుంది? A. 1/2 వంతు B. 1/4 వంతు C. 1/5 వంతు D. 1/3 వంతు 499. భారతదేశంలోని సట్లెజ్ మైదానాల్ని గంగా మైదానంతో వేరు చేసే నది ఏది? A. గంగానది B. యమునా నది C. సింధూ నది D. జీలం నది 500. యమునా,కోసి,గండక్,ఘాఘ్ర మరియు సోన్ అను ఉపనదులు ఏ మైదానాల ఉపనదులుగా ప్రవహిస్తున్నాయి? A. సింధూ మైదానాల B. బ్రహ్మపుత్ర మైదానాల C. రాజస్థాన్ మైదానాల D. గంగా మైదానాల You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next