భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-10 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 251 - 300 251. బృహత్ మైదానాలలోని భంగర్ నేలలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? A. బీహార్ B. పశ్చిమ బెంగాల్ C. ఉత్తరాఖండ్ D. ఉత్తర ప్రదేశ్ 252. గంగానది పరివాహక ప్రాంతములలో ఎగువ గంగ, యమున దోయబ్ లలో ప్రధానంగా కనిపించే నేలలు ఏవి? A. రే/కల్లార్/ఉసర్ నేలలు B. భుర్ నేలలు C. భంగర్ నేలలు D. ఖాదర్ నేలలు 253. గంగా, సింధూ మైదాన ప్రాంతాన్ని ప్రాంతీయంగా ఎన్ని ప్రధాన భాగాలుగా విభజించడం జరిగింది? A. 4 B. 5 C. 6 D. 3 254. ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఒకప్పటి సరస్వతి నది,దాని ఉప నదులచే తీసుకు రాబడిన అవక్షేపాలతో ఏర్పడిన మైదానాలు ఏవి? A. పంజాబ్-హర్యానా మైదానాలు B. రాజాస్థాన్ మైదానాలు C. సింధు మైదానాలు D. బ్రహ్మ పుత్ర మైదానాలు 255. భారతదేశంలోని రాజస్థాన్ మైదానాలు ఎన్ని లక్షల చ. కి. మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి? A. 1.25 లక్షల చ. కి. మీ B. 1.50 లక్షల చ. కి. మీ C. 1.75 లక్షల చ. కి. మీ D. 1.85 లక్షల చ. కి. మీ 256. రాజస్థాన్ మైదాన పశ్చిమ ప్రాంతంలో శుష్క శీతోషణస్థితి గల ప్రాంతాన్ని ఏమంటారు? A. మరుస్థలి B. భగర్ C. త్రియాన్ D. రోహి 257. పాత ఒండ్రు మట్టి కలిగి సారవంతంగా ఉండి, వ్యవసాయ అభివృద్ధికి నిలయంగా ఉన్న నేలలు ఏవి? A. భంగర్ నేలలు B. ఖాదర్ నేలలు C. టెరాయ్ నేలలు D. ఏదీ కాదు 258. వ్యవసాయ అభివృద్ధికి నిలయంగా ఉన్న భంగర్ నేలలలో ప్రధానంగా ఉండే పదార్థం ఏది? A. ఇసుక B. సీల్డ్ C. బురద D. క్లే 259. భంగర్ నేలలు ఏ పదార్థంతో కూడినప్పుడు వీటిని "కంకర్" అని పిలుస్తారు? A. కార్బోనైట్స్ B. బైకార్బోనైట్స్ C. కాల్ కెరియస్ కాంక్రీషన్స్ D. ఏదీ కాదు 260. ఉత్తరప్రదేశ్, హర్యానా లో పొడి వాతావరణ ప్రాంతాలలో కనిపించే లవణ నేలలు ఏవి? A. రే/కల్లార్/ఉసర్ B. భంగర్ నేలలు C. భుర్ నేలలు D. పైవన్నీ 261. రే/కల్లార్/ఉసర్ నేలలు ఏ లవణాలతో కూడిన చవుడు, లవణీయత, స్ఫటికీయ భూభాగాలు గా ఉన్నాయి? A. కార్బోనైట్స్ B. బైకార్బోనైట్స్ C. a మరియు b D. ఏదీ కాదు 262. గాలి వీచినప్పుడు వచ్చే ఇసుక చేత ఏర్పడిన నేలలను ఏమంటారు? A. భుర్ నేలలు B. ఉసర్ నేలలు C. కల్లార్ నేలలు D. బెట్ నేలలు 263. థార్ ఎడారి (మరుస్థలి) ప్రాంతంలో పవన నిక్షేపన చర్య వల్ల ఏర్పడిన ఇసుక దిబ్బలను ఏమంటారు? A. బార్కాన్స్ B. దెయిన్స్ C. సైఫ్ లు D. ఏదీ కాదు 264. రాజస్థాన్ థార్ ఎడారి (మరుస్థలి) లోని ఇసుక దిబ్బలలోని అర్ధచంద్రాకృతిలను మరియు కత్తి ఆకారంలో ఉన్న వాటిని ఏమని పిలువడం జరుగుతుంది? A. బార్కాన్స్ మరియు సైఫ్ లు B. దెయిన్స్ మరియు సైఫ్ లు C. బార్కాన్స్ మరియు దెయిన్స్ D. ఏదీ కాదు 265. మరుస్థలి (థార్ ఎడారి)కి తూర్పుగా ఆరావళి పర్వతాల వెంట విస్తరించి ఉన్న అర్థ శుష్క శీతోషణస్థితి గల చదునైన భూభాగ ప్రాంతం ఏది? A. రాజస్థాన్ త్రియాన్ B. రాజస్థాన్ బగర్ C. రాజస్థాన్ థార్ D. రాజస్థాన్ రోహి 266. రాజస్థాన్ బగర్ ప్రాంతంలో గల ఉప్పు నీటి సరస్సులను ఏమని అంటారు? A. ప్లయాలు (లేదా) దాండియాలు B. త్రియాన్ లు C. థాన్ లు D. ఏవీ కాదు 267. రాజస్థాన్ మైదానాలలోని ఉప్పు నీటి సరస్సులు ఏవి? A. సాంబార్ B. దిద్వాన C. ప్లయా D. పైవన్నీ 268. రాజస్థాన్ మైదానాలలోని ప్రధాన భూస్వరూపాలలో కదిలే ఇసుక దిబ్బలు అని వేటిని అంటారు? A. రోహి B. థాల్ C. త్రియాన్ D. ప్లయా 269. రాజస్థాన్ లోని ఆరావళీ పర్వతాల వద్ద ఉన్న సారవంతమైన నేలలు ఏవి? A. రోహి B. థాల్ C. త్రియాన్ D. ప్లయా 270. త్రియాన్, రోహి, థాల్ మరియు ప్లయా అను ప్రధాన భూ స్వరూపాలు ఏ మైదానాలకు చెందినవి? A. పంజాబ్ మైదానాలకు B. హర్యానా మైదానాలకు C. రాజస్థాన్ మైదానాలకు D. గంగా మైదానాలకు 271. పంజాబ్ మరియు హర్యానా మైదానాలు ఎన్ని కి. మీటర్లు విస్తరించి ఉన్నాయి? A. 300 కి.మీ B. 400 కి.మీ C. 650 కి.మీ D. 750 కి.మీ 272. సింధూ నది నుండి రాణ్ ఆఫ్ కచ్ ఉత్తరభాగం వరకు విస్తరించి ఉన్న మైదానాలు ఏవి? A. రాజాస్థాన్ మైదానాలు B. బ్రహ్మ పుత్ర మైదానాలు C. పంజాబ్-హర్యానా మైదానాలు D. ఏవీ కాదు 273. పంజాబ్ మరియు హర్యానా మైదానాలు ఎన్ని చదరపు కిలోమీటర్ల భూభాగం వరకు విస్తరించి ఉన్నాయి? A. 1.75 లక్షల చ.కి.మీ B. 1.65 లక్షల చ.కి.మీ C. 1.25 లక్షల చ.కి.మీ D. 1.50 లక్షల చ.కి.మీ 274. పంజాబ్ - హర్యానా మైదానాలు ఏయే ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నాయి? A. ఆరావళి పర్వతాల నుండి ఢిల్లీ వరకు B. ఆరావళి పర్వతాల నుండి హర్యానా వరకు C. పంజాబ్ నుండి ఢిల్లీ వరకు D. ఏదీ కాదు 275. భారతదేశంలో లో పంచ నదులు ప్రవహించే మైదానాలు ఏవి? (Land of five rivers) A. రాజస్థాన్ మైదానాలు B. పంజాబ్-హర్యానా మైదానాలు C. గంగా మైదానాలు D. బ్రహ్మ పుత్ర మైదానాలు 276. రావి, బియాస్, జీలం,చీనాబ్ మరియు సట్లెజ్ అను నదుల పరివాహక వ్యవస్థ క్రింద ఉన్న మైదానాలు ఏవి? A. గంగా-సింధూ మైదానాలు B. రాజస్థాన్ మైదానాలు C. బ్రహ్మపుత్ర మైదానాలు D. పంజాబ్-హర్యానా మైదానాలు 277. ఒకదానితో ఒకటి సమాంతరంగా ఒకే దిశలో ప్రవహించే రెండు నదుల మధ్య గల సారవంతమైన మైదానాలను ఏమని పిలుస్తారు? A. దొలబ్ B. త్రియాన్ C. రోహి D. థాల్ 278. సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఎన్ని దోఆబ్ లు కలవు? A. 3 B. 4 C. 5 D. 8 279. పంజాబ్-హర్యానా మైదానాలలో ని నదీ పరివాహక ప్రాంతంలో గల దోఆబ్ (అంతర్వేది) ఏ స్వరూపాన్ని కలిగి ఉంటుంది? A. ఏకీకృత నిక్షేప స్వరూపం B. ద్వికృత నిక్షేప స్వరూపం C. రోహి కృత నిక్షేప స్వరూపం D. ప్లయా నిక్షేప స్వరూపం 280. భారతదేశంలోని పంజాబ్- హర్యానా మైదానాలలోని బియాస్-రావి నదుల మధ్య ఉన్న దోఆబ్ కు గల పేరు ఏమిటి? A. రైచనా దోఆబ్ B. భారీ దోఆబ్ C. బిస్త దోఆబ్ D. ఛాజ్ దోఆబ్ 281. పంజాబ్-హర్యానా మైదానాలలోని సింధ్ సాగర్ దోఆబ్ ఏ నదుల మధ్య కలదు? A. బియాస్-సట్లెజ్ నదుల మధ్య B. జీలం-చీనాబ్ నదుల మధ్య C. జీలం చీనాబ్ మరియు సింధూ నదుల మధ్య D. రావి-సింధూ నదుల మధ్య 282. పంజాబ్ లోని శివాలిక్ పర్వతాల పాదాల వద్ద ఏర్పడే చిన్న చిన్న నీటిగుంతలను ఏమంటారు? A. త్రియాన్ B. మార్గ్ C. చొస్ D. రోహి 283. పంజాబ్ ప్రాంతములో పర్వత పాద మైదానము గులక రాళ్ళతో కూడిన ఇసుక నేలలను ఏమంటారు? A. ఖాదర్ నేలలు B. బాబర్ నేలలు C. భంగర్ నేలలు D. టెరాయి నేలలు 284. సింధు మైదానములో ఎండిపోయిన నదుల ప్రవాహ గుంతలలో ఏర్పడిన సరస్సులను ఏమంటారు? A. థారోస్ B. థాండ్స్ C. చొస్ D. థాల్ 285. సింధు మైదానాల భూస్వరూపాలలో ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులను ఏమంటారు? A. థారోస్ B. థాండ్స్ C. చొస్ D. థాల్ 286. గంగా మైదాన ప్రాంతం ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నది? A. యమునా నది నుండి సింధూ నది ముఖ ద్వారం వరకు B. యమునా నది నుండి గంగా నది ముఖ ద్వారం వరకు C. గంగా మరియు సింధూ నదుల ముఖ ద్వారం వరకు గల D. ఏదీ కాదు 287. గంగా మైదానాలు ఏ యే ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి? A. ఉత్తరప్రదేశ్ B. బీహార్ C. బెంగాల్ D. పైవన్నీ 288. భారత దేశములోకెల్లా అతి పెద్ద మైదానము ఏది? A. సింధూ మైదానం B. పంజాబ్-హర్యానా మైదానం C. గంగా మైదానం D. బ్రహ్మపుత్ర మైదానం 289. గంగా మైదానాల వైశాల్యం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు? A. 3.54 లక్షల చదరపు కిలోమీటర్లు B. 3.56 లక్షల చదరపు కిలోమీటర్లు C. 3.57 లక్షల చదరపు కిలోమీటర్లు D. 3.59 లక్షల చదరపు కిలోమీటర్లు 290. గంగా మైదానాల పరివాహక ప్రాంతము భారతదేశంలో ఎన్నవ వంతు వైశాల్యమును కలిగి ఉంటుంది? A. 1/2 వంతు B. 1/4 వంతు C. 1/5 వంతు D. 1/3 వంతు 291. భారతదేశంలోని సట్లెజ్ మైదానాల్ని గంగా మైదానంతో వేరు చేసే నది ఏది? A. గంగానది B. యమునా నది C. సింధూ నది D. జీలం నది 292. యమునా,కోసి,గండక్,ఘాఘ్ర మరియు సోన్ అను ఉపనదులు ఏ మైదానాల ఉపనదులుగా ప్రవహిస్తున్నాయి? A. సింధూ మైదానాల B. బ్రహ్మపుత్ర మైదానాల C. రాజస్థాన్ మైదానాల D. గంగా మైదానాల 293. భారతదేశంలోని గంగా మైదానాలను ఎన్ని విభాగాలుగా విభజించడం జరిగింది? A. 5 B. 3 C. 4 D. 2 294. భారత దేశంలోని ఉన్నత గంగా మైదానాలు ఏవి? A. గంగా-యమున దోయబ్ B. రోహిల్ ఖండ్ మైదానం C. అవద్ మైదానాలు D. పైవన్నీ 295. ఉన్నత గంగా మైదానాలలోని అవద్ మైదానాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది? A. కోసి నది B. గండక్ నది C. ఘగ్గర్ నది D. ఘాఘ్ర నది 296. గంగా మైదాన ప్రాంతాలలోని అవద్ మైదానాలు వేటిని ఎక్కువగా కలిగి ఉంటాయి? A. కోల్ భూ భాగాన్ని B. బ్యాడ్ లాండ్స్ ని C. a మరియు b D. చొస్ 297. ఉన్నత గంగా మైదానాలలోని బంగర్ మరియు ఖాదర్ మద్య గల భూభాగాన్ని ఏమంటారు? A. కోల్ B. ఖోల్స్ C. డెల్టా D. చొస్ 298. ఉన్నత గంగా మైదానాలు ఏ ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి? A. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ B. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తారాంచల్ C. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ D. ఉత్తరాంచల్ మరియు బీహార్ 299. భారతదేశంలో ఉత్తర గంగా మరియు దక్షిణ గంగా అని విభజింపబడిన గంగా మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. మధ్య గంగా మైదానాలు C. దిగువ గంగా మైదానాలు D. ఏదీ కాదు 300. భారతదేశంలోని మద్య గంగా మైదానాలు ఎక్కువగా ఏ నిల్వలను కలిగి ఉన్నాయి? A. భంగర్ నిల్వలు B. ఖాదర్ నిల్వలు C. టెరాయి నిల్వలు D. బాబర్ నిల్వలు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next