భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-11 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 301 - 350 301. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ లలో విస్తరించిన గంగా మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. మధ్య గంగా మైదానాలు C. దిగువ గంగా మైదానాలు D. ఏదీ కాదు 302. మధ్య గంగా మైదానలలోని ఉత్తరగంగ లో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. మిథిలా మరియు మగథ D. కోసి మరియు అంగ 303. గంగా మైదాన ప్రాంతములోని దక్షిణగంగలో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. అంగ మరియు మిథిలా D. ఏదీ కాదు 304. భారతదేశంలోని ఉత్తరాన డార్జిలింగ్ పర్వత పాదాల నుండి, దక్షిణాన బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. దిగువ గంగా మైదానాలు C. మధ్య గంగా మైదానాలు D. ఏదీ కాదు 305. దిగువ గంగా మైదానాలు ఏ ఏ మైదాన భాగాలను కలిగి ఉన్నాయి? A. బరీండ్ మైదానం B. సుందర్ బన్స్ C. a మరియు b D. ఏదీ కాదు 306. గంగా మైదాన ప్రాంతాలలో 30 మీటర్ల ఎత్తు వరకు మట్టితో నిక్షిపితమై దిబ్బలుగా మారిన ఈ ప్రాంతాన్ని ఏమంటారు? A. ఖోల్స్ B. చొస్ C. దెయిన్స్ D. బార్కాన్స్ 307. గంగా మైదానంలో ఉన్న ఒండ్రు పొరలను ఏ నేలలుగా విభజించారు? A. భంగర్ మరియు టెరాయ్ B. భంగర్ మరియు బాబర్ C. భంగర్ మరియు ఖాదర్ D. టెరాయ్ మరియు ఖాదర్ 308. బ్రహ్మపుత్ర మైదానాలు దాని ఉపనదులైన లోహిత్ మరియు సెసిర నదుల ఒండ్రు మట్టి నిక్షేపాలతో ఏ లోయలో ఏర్పడినవి? A. బీహార్ లోయలో B. అస్సాం లోయలో C. పశ్చిమ బెంగాల్ లోయలో D. ఉత్తరాఖండ్ లోయలో 309. బ్రహ్మపుత్ర మైదానాల మొత్తం వైశాల్యం ఎంత? A. 50,274 చ.కి.మీ B. 60,254 చ.కి.మీ C. 56.274 చ.కి.మీ D. 65,254 చ.కి.మీ 310. బ్రహ్మపుత్ర మైదానాలు ఏ మైదాన రకానికి చెందినవి? A. చిత్తడి మైదాన B. క్రమ క్షియ మైదాన C. పగుళ్ళ మైదాన D. పైవన్నీ 311. బ్రహ్మపుత్ర మైదానాలు ఎంత పొడవు మరియు వెడల్పును కలిగి ఉన్నాయి? A. 720 కి.మీ మరియు 80 కి.మీ B. 520 కి.మీ మరియు 80 కి.మీ C. 720 కి.మీ మరియు 90 కి.మీ D. 520 కి.మీ మరియు 90 కి.మీ 312. ప్రపంచంలోనే అతి పెద్ద నది ద్వీపం ఏది? A. జంభూ ద్వీపం B. మజూలీ ద్వీపం C. అండమాన్ ద్వీపం D. ఏదీ కాదు 313. ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం అయిన మజూలీ ద్వీపం ఏ ప్రాంత మైదానాల నదులతో ఏర్పరచబడినది? A. గంగా మైదానాల B. బహ్మపుత్ర మైదానాల C. సింధూ మైదానాల D. ఏదీ కాదు 314. మజూలీ ద్వీపం యొక్క వైశాల్యం ఎన్ని చ.కి.మీ? A. 905 చ.కి.మీ B. 942 చ.కి.మీ C. 936 చ.కి.మీ D. 929 చ.కి.మీ 315. బృహత్ మైదానం అలహాబాద్ (గంగా) వద్ద ఎక్కువ వెడల్పుగా ఎన్ని కి.మీ ఉండి అస్సాం దగ్గర(బ్రహ్మపుత్ర) చాలా సన్నగా ఉంటుంది? A. 300 కి.మీ B. 220 కి.మీ C. 280 కి.మీ D. 240 కి.మీ 316. భారతదేశం లోని అతి పెద్ద నైసర్గిక స్వరూపం ఏది? A. తీర మైదానాలు B. హిమాలయాలు C. ద్వీపకల్ప పీఠ భూములు D. కనుమలు 317. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన పీఠభూమి ఏది? A. ద్వీపకల్ప పీఠభూమి B. డెల్టా పీఠభూమి C. బాగల్ పీఠభూమి D. ఏదీ కాదు 318. ద్వీపకల్ప పీఠభూమి యొక్క వైశాల్యం ఎన్ని చదరపు కిలో మీటర్లు? A. 12 లక్షల చ.కి.మీ B. 15 లక్షల చ.కి.మీ C. 16 లక్షల చ.కి.మీ D. 18 లక్షల చ.కి.మీ 319. హిమాలయా పర్వతాలతో పోలిస్తే ద్వీపకల్ప పీఠభూముల వయస్సు ఎంత ఎక్కువగా ఉంటుంది? A. 500 మిలియన్ సంవత్సరాలు B. 550 మిలియన్ సంవత్సరాలు C. 600 మిలియన్ సంవత్సరాలు D. 650 మిలియన్ సంవత్సరాలు 320. దక్కన్ పీఠభూమి తూర్పు పైపునకు వాలి ఉండడము వలన పశ్చిమ కనుమలలో పుట్టిన అనేక నదులు తూర్పుగా ప్రవహిస్తూ ఏ సముద్రములో కలుస్తున్నాయి? A. మధ్య దరా సముద్రం B. ఎర్ర సముద్రం C. బంగాళాఖాతము D. హిందూ మహా సముద్రం 321. ద్వీపకల్ప పీఠభూమి అని ఏ భూమిని పేర్కొంటారు? A. క్రమ క్ష్యయ భూమి B. కవచ భూమి C. చిత్తడి భూమి D. ఏదీ కాదు 322. ద్వీపకల్ప పీఠభూమి ఏ కాలానికి చెందినది? A. టెర్షియరి కాలానికి B. ప్రీ కేంబ్రియన్ కాలానికి C. ఓలగోసిన్ కాలానికి D. పాస్ట్ ప్లీయోసిన్ కాలానికి 323. ద్వీపకల్ప పీఠభూములు ఏ ఆకృతిని కలిగి ఉంటాయి? A. త్రికోణ ఆకృతి B. చతుర్బూజ ఆకృతి C. పంచీ కృత ఆకృతి D. ఏదీ కాదు 324. ద్వీపకల్ప పీఠభూములు ఏ అంశాలతో ఏర్పడి ఉన్నాయి? A. అగ్నిమాయ శిలలతో B. రూపాంతర ప్రాప్తి శిలలతో C. ఆర్కియన్ నైస్ శిస్ట్ లతో D. పైవన్నీ 325. దీపకల్ప పీఠభూమి ప్రాంతంలో భూకంప ప్రక్రియ చాలా అరుదుగా సంభవించడానికి గల కారణం ఏమిటి? A. భౌమ్యాచలనాలకు గురికాకపోవటం వలన B. త్రికోణ ఆకృతి వలన C. రూపాంతర ప్రాప్తి శిలలతో కూడి ఉండటం వలన D. పైవన్నీ 326. పగులు లోయ ద్వారా ప్రవహించే నర్మదా నది ద్వీపకల్ప భూభాగాన్ని ఎన్ని అసమాన భాగాలుగా విభజిస్తుంది? A. 3 B. 2 C. 4 D. 5 327. భారతదేశానికి దక్షిణంగా ఉన్న ద్వీపకల్ప భూభాగాన్ని ఏమంటారు? A. దక్కన్ పీఠభూమి B. మాల్వా పీఠభూమి C. బాగల్ ఖండ్ పీఠభూమి D. షిల్లాంగ్ పీఠభూమి 328. ప్రపంచంలో కెల్లా అతి పురాతనమైన ముడత పర్వతాలు ఏవి? A. ఆరావళి పర్వతాలు B. పాద్య పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 329. ఆరావళి పర్వతాలు ఏ శిలలను కలిగి ఉన్నాయి? A. అగ్నిమాయ శిలలను B. రూపాంతర శిలలను C. ఆర్కియన్ నైస్ శిలలను D. పైవన్నీ 330. ఆరావళి పర్వతాలు భారతదేశానికి పశ్చిమోత్తర భాగాన దాదాపు ఎన్ని కి.మీ విస్తరించి ఉన్నాయి? A. 500 కి.మీ B. 700 కి.మీ C. 800 కి.మీ D. 900 కి.మీ 331. భారతదేశంలోని ఆరావళి పర్వత శ్రేణులలో అత్యున్నతమైన శిఖరం ఏది? A. గురు శిఖర్ B. హర్షినాథ్ శిఖర్ C. రహనాథ్ పూర్ శిఖర్ D. ఏదీ కాదు 332. ఆరావళి పర్వతాలలోని అత్యున్నతమైన గురు శిఖర్ యొక్క ఎత్తు ఎన్ని మీటర్లు? A. 1522 మీ B. 1622 మీ C. 1722 మీ D. 1822 మీ 333. భారత దేశంలో ఉత్తర గుజరాత్ నుండి రాజస్థాన్ మీదుగా దక్షిణ ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి? A. వింధ్య B. ఆరావళి C. సాత్పురా D. సహ్యాద్రి 334. ఆరావళి శిఖరాలలో ని వేసవి విడిది ప్రాంతం ఏది? A. డల్హౌసి B. మౌంట్ అబూ C. కులూ D. కాంగ్రా 335. ఆరావళి పర్వతాలలో ప్రసిద్ధ దేవాలయం అయిన దిల్వారా దేవాలయం ఏ మతస్తులది? A. బౌద్ధ B. జైన C. హిందూ D. అరబ్ 336. ఆరావళి పర్వతాలలో ముఖ్యమైన శిఖరాలు ఏవి? A. ఖో శిఖరం B. రహనాథ్ పూర్ శిఖరం C. హర్షి నాథ్ శిఖరం D. పైవన్నీ 337. హల్దీఘాట్, పిప్లీ ఘాట్,దివైర్ మరియు బార్ అను కనుమలు ఏ పర్వతాలలో కలవు? A. వింధ్య పర్వతాలు B. ఆరావళి పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. ఏదీ కాదు 338. గుజరాత్ లోని జోబార్ నుండి బీహార్ లోని ససారం వరకు1050 కి.మీ పొడవుతో విస్తరించిన పర్వతాలు ఏవి? A. వింధ్య పర్వతాలు B. ఆరావళి పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 339. వింధ్య పర్వతాలు ప్రధానంగా భారతదేశంలో ఏ ప్రదేశంలో ఉన్నాయి? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. మధ్యప్రదేశ్ D. బీహార్ 340. వింధ్య పర్వతాలు ఏ నదుల మధ్య వ్యాపించి ఉన్నాయి? A. నర్మదా-గంగా నదుల B. నర్మదా-తపతి నదుల C. నర్మదా-సోన్ నదుల D. నర్మదా-సింధూ నదుల 341. వింధ్య పర్వత శిఖరాలు సగటున ఎంత నుండి ఎంత వరకు ఎత్తును కలిగి ఉంటాయి? A. 600-1000 మీటర్ల ఎత్తు B. 700-1000 మీటర్ల ఎత్తు C. 600-1100 మీటర్ల ఎత్తు D. 700-1100 మీటర్ల ఎత్తు 342. ఆరావళి పర్వతాలు శిథిలమై వాటి శిథిలాల నిక్షేపాలతో ఏ పర్వత పంక్తి ఏర్పడినది ? A. వింధ్య పర్వత B. సాత్పురా పర్వత C. సహ్యాద్రి పర్వత D. పైవన్ని 343. ఏ రాయికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కావడం వలన నర్మదా నదిని "మారు బల్ " నది అని పిలుస్తారు? A. ఇసుక రాయి B. సున్నపు రాయి C. పాల రాయి D. నల్ల రాయి 344. వింధ్య పర్వత శ్రేణులలో వింధ్యన్ వ్యవస్థకు చెందిన ఎటువంటి శిలలను కలిగి ఉన్నాయి? A. ఇసుక రాళ్ళు B. క్వార్డ్ జ్ లు C. సున్నపు రాయి D. పైవన్నీ 345. భారతదేశంలో వింధ్య పర్వతాలను తూర్పున ఏమని పిలుస్తారు? A. అవశిష్ట పర్వతాలు B. కైమూర్ శ్రేణులు C. మైకాల్ శ్రేణులు D. ఏదీ కాదు 346. మహారాష్ట్ర లోని రత్నపూర్ నుండి మధ్యప్రదేశ్ లోని అమరక౦టక్ వరకు విస్తరించిన పర్వతాలు ఏవి? A. వింధ్యా పర్వతాలు B. సాత్పురా పర్వతాలు C. ఆరావళి పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 347. సాత్పురా పర్వతాలు ఏ శిలా విన్యాసం వల్ల ఏర్పడినవి? A. క్వర్డ్ జ్ శిలా B. ఆర్కియన్ నైస్ శిలా C. రూపాంతర శిల D. భ్రంశోద్ధిత శీలం 348. వింధ్య పర్వతాలు ఏ యుగానికి చెందినది? A. ఫ్రీకేంబ్రియాన్ B. టెర్షియర్ C. ఓలోగోసిన్ D. మధ్య మియోసిన్ 349. సాత్పురా పర్వతాల యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు? A. 950 కి.మీ B. 900 కి.మీ C. 970 కి.మీ D. 990 కి.మీ 350. సాత్పురా పర్వతాలు ఏ నదుల మధ్య వ్యాపించి ఉన్నాయి? A. నర్మదా-సోన్ నదుల B. సోన్-తపతి నదుల C. నర్మదా-తపతి నదుల D. నర్మదా-గంగా నదుల You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next