భారతదేశ శీతోష్ణస్థితి | Geography | MCQ | Part-17 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 1 - 50 1. ఒకరోజు లో ఉష్ణోగ్రత, వర్షపాతము , పీడనము మొదలైన భౌతిక అంశాలలో కలిగేటువంటి మార్పులకు సంబంధించినది ఏమిటి? A. శీతోష్ణస్థితి B. వాతావరణం C. సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి D. వాతావరణ పీడనం 2. శీతోష్ణస్థితి భూమి మీద అన్ని ప్రాంతాలలో ఎలా ఉంటుంది? A. ఒకే మాదిరిగా ఉండదు B. ఒకే మాదిరిగా ఉంటుంది C. ఋతువును బట్టి మారుతుంది D. ఋతువును బట్టి మారదు 3. వాతావరణ పరిస్థతులకు సంబంధించిన అంశాలను దీర్ఘకాలంగా లెక్కించి వాటి యొక్క సరాసరి సగటు ను ఏమని పేర్కొంటారు? A. శీతోష్ణస్థితి B. వాతావరణ పీడనం C. సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి D. సమ ఉష్ణోగ్రత పీడనం 4. శీతోష్ణస్థితి లో మార్పులు సంభవించడానికి సుమారు ఎంతకాలం పడుతుంది? A. 20 సంవత్సరాలు B. 30 సంవత్సరాలు C. 40 సంవత్సరాలు D. 50 సంవత్సరాలు 5. శీతోష్ణస్థితి ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? A. మెటీ రోలాజీ B. క్లైమాటాలాజీ C. జెట్ స్ట్రీమ్ D. ఏదీ కాదు 6. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? A. జెట్ స్ట్రీమ్ B. క్లైమోటాలాజీ C. మెటీరోలాజీ D. ఏదీ కాదు 7. దేశంలో వాతావరణ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు? A. తమిళనాడు B. మహారాష్ట్ర C. ముంబాయి D. కలకత్తా 8. దేశంలో వాతావరణ పరిశోధన కేంద్రాన్ని కలకత్తాలో స్థాపించి ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడికి మార్చారు? A. పూణే B. ముంబాయి C. చెన్నై D. ఢిల్లీ 9. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ? A. జనవరి 21 B. నవంబర్ 13 C. డిసెంబర్ 27 D. మార్చి 23 10. భారతదేశ శీతోష్ణస్థితి ని అత్యంత ప్రభావితం చేసే అంశం ఏది ? A. ఎలినినో B. అల్పపీడనం C. కర్కటరేఖ D. లానినో 11. ఈ క్రింది వాటిలో భారతదేశ శీతోష్ణస్థితి ని ప్రభావితం చేయని అంశాలు ఏవి? A. జెట్ స్ట్రీమ్ లు B. ఎలినినో C. దక్షిణ డోలనము D. పైవన్నీ 12. భారతదేశంలో రెండు విభిన్నమైనటువంటి శీతోష్ణస్థితి మండలాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? A. కర్కట రేఖ భారతదేశం నిలువు గుండా పోవడం B. మకరరేఖ భారతదేశం అడ్డం గుండా పోవడం C. కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా పోవడం D. ఏదీ కాదు 13. భారతదేశంలో వివిధ ప్రదేశాలలో వివిధ శీతోష్ణ మండలాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? A. నిమ్నోన్నతాలలో ఉండే భేదాల వల్ల B. నిమ్నోన్నతాలలో భేదాలు లేకపోవడం వల్ల C. సమ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల D. పైవన్నీ 14. భారతదేశపు శీతోష్ణస్థితిని ఏమని చెప్పవచ్చును? A. ఋతుపవన శీతోష్ణస్థితి B. ఉష్ణ మండల సమ శీతోష్ణస్థితి C. ఉష్ణ మండల ఋతువపవన శీతోష్ణస్థితి D. ఏదీ కాదు 15. భారతదేశంలో సంవత్సర కాలాన్ని ఎన్ని ఋతువులు గా విభజించారు? A. 3 ఋతువులు B. 4 ఋతువులు C. 6 ఋతువులు D. 8 ఋతువులు 16. భారతదేశంలో సాంప్రదాయబద్ధమైన వసంత ఋతవు తెలుగు నెలల (భారతదేశ క్యాలెండర్) ప్రకారము ఎప్పుడు వస్తుంది? A. చైత్ర-వైశాఖం B. శ్రావణం-భద్రా పదం C. మార్గ శిరం-పుష్యం D. మాఘం-ఫాల్గుణం 17. భారతదేశంలో సాంప్రదాయబద్ధమైన గ్రీష్మ ఋతవు తెలుగు నెలల (భారతదేశ క్యాలెండర్) ప్రకారము ఎప్పుడు వస్తుంది? A. చైత్ర-వైశాఖం B. శ్రవణం-భాద్ర పదం C. జ్యేష్ట్యం -ఆషాడం D. మాఘం-ఫాల్గుణం 18. భారతదేశంలో సాంప్రదాయబద్ధమైన గ్రీష్మ ఋతవు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో వస్తుంది? A. మార్చి-ఏప్రిల్ B. మే-జూన్ C. జులై-ఆగస్ట్ D. నవంబర్-డిసెంబర్ 19. భారతదేశంలో సాంప్రదాయబద్ధమైన హేమంత ఋతవు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో వస్తుంది? A. మార్చి-ఏప్రిల్ B. జులై-ఆగస్ట్ C. నవంబర్-డిసెంబర్ D. జనవరి-ఫిబ్రవరి 20. భారతదేశంలో సాంప్రదాయబద్ధమైన తెలుగు నెలల క్యాలెండర్ ప్రకారం శ్రావణం-భాద్రపదం మాసంలో వచ్చే ఋతువు ఏది? A. వర్ష ఋతువు B. గ్రీష్మ ఋతువు C. హేమంత ఋతువు D. శరద్ ఋతువు 21. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి - ఫిబ్రవరి నెలలో వచ్చే ఋతువు ఏది? A. వసంత ఋతువు B. గ్రీష్మ ఋతువు C. హేమంత ఋతువు D. శిశిర ఋతువు 22. భారతదేశంలో ఆశ్వీయజం-కార్తీకం మాసంలో వచ్చే ఋతువు ఏది? A. శిశిర ఋతువు B. గ్రీష్మ ఋతువు C. శరద్ ఋతువు D. వర్ష ఋతువు 23. భారతదేశంలో వర్షపాతం వేటి వలన సంభవిస్తాయి? A. అల్ప పిదనము B. అధిక పిదనము C. ఋతు పవనాలు D. సమ శీతోష్ణస్థితి 24. ఋతుపవనాలు అంటే ఏమిటి? A. ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్ధిష్ట వైపుకి వీచే పవనాలు B. ఒక నిర్ణీత కాలంలో ఒక ప్రాంతం వైపుకి వీచే పవనాలు C. ఒక నిర్ణీత కాలంలో అన్ని వైపుల కి వీచే పవనాలు D. ఏది కాదు 25. ఋతుపవనాలను కనుగొన్నది ఎవరు? A. సుల్తానులు B. అరబ్బులు C. యూరోపియన్లు D. గ్రీకులు 26. మాన్ సూన్ ను ఏమని పిలుస్తారు? A. ఎలినినో B. జెట్ స్ట్రీమ్ C. లానినో D. ఋతుపవనాలు 27. హేలీ, నైరుతి ఋతుపవనాలను భారత ఉపఖండంలో కి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల మూలంగా ఏర్పడిందని తెలియజేసే సిద్ధాంతం ఏది? A. జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం B. థర్మల్ సిద్ధాంతం C. ప్లాన్ సిద్ధాంతం D. టిబెటన్ సిద్ధాంతం 28. భూమధ్యరేఖ అల్పపీడన మండలం, సూర్యుడి గమనం వలన కర్కటక రేఖ వద్దకు స్థానభ్రంశం చెంది నైరుతి ఋతుపవనాలను ఆకర్షిస్తుందని తెలియజేసే సిద్ధాంతం ఏది? A. ప్లాన్ సిద్ధాంతం B. టిబెటన్ సిద్ధాంతం C. థర్మల్ సిద్ధాంతం D. జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం 29. భారతదేశంలో హిమాలయాల ప్రభావము ప్రముఖంగా దేని మీద కనిపిస్తుంది? A. వాతావరణం B. శీతోష్ణస్థితి C. వర్షపాతం D. స్థానిక పవనాలు 30. దేశం యొక్క శీతోష్ణస్థితి ప్రధానంగా వేటి మీద ఆధారపడి అధ్యయనం చేయడం జరిగింది ? A. ఉష్ణోగ్రత B. వర్షపాతం C. వాతావరణ పీడనం మరియు పవనాల దిశ D. పైవన్నీ 31. ఉష్ణోగ్రతని ప్రభావితం చేసే అంశాలు ఏవి? A. అక్షాంశాలు B. ఎత్తు C. ఉర్ద్వ ముఖ ప్రసరణ D. పైవన్నీ 32. ఉష్ణోగ్రతలు సాధారణంగా వేసవి కాలంలో దక్షిణం నుండి ఉత్తరానికి పోయే కొలది ఏమౌతాయి? A. పెరుగుతుంది B. తగ్గుతుంది C. మామూలుగా ఉంటుంది D. నిర్ధిష్టంగా ఉంటుంది 33. భారతదేశంలో సౌర తాపం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? A. జనవరి 01 నుండి ఫిబ్రవరి 22 B. డిసెంబర్ 02 నుండి జనవరి 15 C. మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 D. నవంబర్ 13 నుండి డిసెంబర్ 27 34. భారతదేశంలో సౌర తాపం ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి? A. దక్షిణరార్థ గోళములో సూర్య కిరణాలు నిలువుగా పడటం B. దక్షిణరార్థ గోళములో సూర్య కిరణాలు అడ్డంగా పడటం C. ఉత్తరార్థ గోళములో సూర్య కిరణాలు అడ్డంగా పడటం D. ఉత్తరార్థ గోళములో సూర్య కిరణాలు నిలువుగా పడటం 35. ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రత రేటు ఏమవుతుంది ? A. తగ్గుతుంది B. పెరుగుతుంది C. నిర్దేష్టంగా ఉంటుంది D. ఏది కాదు 36. శీతాకాలంలో వాయువ్య దిశలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి వీటినే ఏమని పిలుస్తారు? A. పశ్చిమ తుఫానులు B. ఆయన రేఖా తుఫానులు C. పశ్చిమ కల్లోలాలు D. ఉర్ద్వ ముఖ ప్రసరణ 37. భారతదేశం వాతావరణ పరిశోధన వారు వేటిని ఆధారంగా చేసుకుని మనదేశంలో నాలుగు కాలాలను గుర్తించారు? A. ఋతుపవనాలు B. ఉష్ణోగ్రత C. వర్ష పాఠం D. ఋతుపవనాలు మరియు ఉష్ణోగ్రత 38. శీతాకాలంలో ఆకాశం మేఘ రహితంగా ఉండి నిర్మలమైన వాతావరణం ఉష్ణోగ్రతలు మరియు ఆర్ద్రతలు తక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి? A. సూర్యుడు ఉత్తరార్థ గోళములో ప్రకాశిస్తూ ఉండటమే B. సూర్యుడు మశ్చిమర్థ గోళములో ప్రకాశిస్తూ ఉండటమే C. సూర్యుడు దక్షిణార్థ గోళములో ప్రకాశిస్తూ ఉండటమే D. ఏది కాదు 39. శీతాకాలంలో దేశంలో ఉష్ణోగ్రత ఉత్తరం నుండి దక్షిణానికి పోయే కొలది ఏమవుతుంది? A. పెరుగుతుంది B. తగ్గుతుంది C. నిమ్నంగా ఉంటుంది D. ఏది కాదు 40. శీతాకాలంలో చెన్నై ,కాలికట్ సగటు ఉష్ణోగ్రత ఎంత? A. 20 డిగ్రీ సెంటి గ్రేడ్ B. 25 డిగ్రీ సెంటి గ్రేడ్ C. 40 డిగ్రీ సెంటి గ్రేడ్ D. 50 డిగ్రీ సెంటి గ్రేడ్ 41. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత ఎంత? A. 0 డిగ్రీ-5 డిగ్రీ సెంటి గ్రేడ్ B. 10 డిగ్రీ-15 డిగ్రీ సెంటి గ్రేడ్ C. 20 డిగ్రీ-25 డిగ్రీ సెంటి గ్రేడ్ D. 25 డిగ్రీ-30 డిగ్రీ సెంటి గ్రేడ్ 42. హిమాలయ ప్రాంతాలలో ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉండి మంచు కురుస్తుంది .దీనినే ఏమని పిలుస్తారు? A. త్రేజ్ B. వ్రిజ్ C. హేజ్ D. క్రిజ్ 43. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఏ నెలలో జరుగుతుంది? A. నవంబర్ B. డిసెంబర్ C. జనవరి D. ఫిబ్రవరి 44. శీతాకాలంలో పశ్చిమ అలజడుల వలన కురిసిన వర్షం ఏ పంటకు ఉపయోగ కారిగా ఉంటుంది? A. జొన్న B. మొక్క జొన్న C. గోధుమ D. వరి 45. శీతాకాలంలో ఏ ప్రాంతాలలో వర్షం ఎక్కువగా కురుస్తుంది? A. మహారాష్ట్ర.కోస్తా B. తమిళనాడు మరియు కోస్తా C. ముంబాయి ,తమిళనాడు D. చెన్నై,ముంబాయి 46. తమిళనాడులో శీతాకాలంలో కురిసే వర్షం మీద ఆధారపడి రబీ కాలంలో ఏ పంటలు పండించడం జరుగుతుంది? A. వరి B. గోధుమ C. మొక్క జొన్న D. పత్తి 47. మధ్యధరా సముద్ర ప్రాంతము నుండి వీచే సముద్ర పవనాలను ఏమని అంటారు? A. సముద్ర ఋతు పవనాలు B. పశ్చిమ అలజడులు C. పశ్చిమ కల్లోలాలు D. ఏది కాదు 48. పశ్చిమ పవనాలా కారణం వలన ఏర్పడిన ప్రవాహాన్ని ఏమని అంటారు? A. జెట్ట్ స్ట్రీమ్ B. లానినో C. ఎలినినో D. వాకర్ సర్క్యులేషన్ 49. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత ఏ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది? A. మహారాష్ట B. రాజాస్థాన్ C. ఒరిస్సా D. తమిళనాడు 50. ఈ క్రింది వాటిలో ఖండాంతర్గత ప్రాంతాలు ఏవి? A. బార్మేర్ B. ఢిల్లీ C. కాన్ పూర్ D. పైవన్నీ You Have total Answer the questions Prev 1 2 3 4 Next