భారతదేశ శీతోష్ణస్థితి | Geography | MCQ | Part-18 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 51 - 100 51. వేసవి కాలంలో వీచే స్థానిక పవనాలను ఏమని అంటారు? A. ఎలినినో గాలులు B. లూ గాలులు C. లా గాలులు D. ఏది కాదు 52. ఇసుక తుఫానులు ఏ ప్రాంతంలో వీస్తాయి? A. హర్యానా B. మధ్యప్రదేశ్ C. బెంగాల్ D. మహారాష్ట్ర 53. కేరళ మరియు పశ్చిమ తీర ప్రాంతాలలో వర్షాకాలానికి ముందు కొన్ని వర్షపు జల్లులు పడతాయి .వీటిని ఏమని పిలుస్తారు? A. శాంపిన్ షవర్స్ B. యాంగో షవర్స్ C. మ్యాంగో షవర్స్ D. షింగో షవర్స్ 54. కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో పడే జల్లులు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయి? A. పత్తి B. వరి C. గోధుమ D. కాఫీ 55. ట్రోపో ఆవరణంలో 12 నుండి 13 కి.మీ ఎత్తులో 150 కి.మీ/ని వేగంతో వీచే గాలులను ఏమని అంటారు ? A. మాంగో షవర్స్ B. జెట్ స్ట్రీమ్ C. కాల్ బై శాఖి D. ఎలినినో 56. తూర్పు జెట్ స్ట్రీమ్ ఉత్తర భారత దేశంలో ఎన్ని మిల్లీ బార్ ల పీడనం తో వీస్తాయి ? A. 100 మిల్లీ బార్ B. 120 మిల్లీ బార్ C. 150 మిల్లీ బార్ D. 180 మిల్లీ బార్ 57. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం గల రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. తమిళనాడు C. ఒరిస్సా D. పంజాబ్ 58. తమిళనాడు రాష్ట్రములో అత్యల్ప వర్షపాతం కురవడానికి గల కారణం ఏమిటి? A. బంగాళ ఖాతం నుంచి వీచే ఈశాన్య ఋతు పవనాలకి తమిళనాడు తీర ప్రాంతం సమాంతరంగా ఉండటమే B. బంగాళ ఖాతం నుంచి వీచే వాయువ్య ఋతు పవనాలకి తమిళనాడు తీర ప్రాంతం సమాంతరంగా ఉండటమే C. బంగాళ ఖాతం నుంచి వీచే నైరుతి ఋతు పవనాలకి తమిళనాడు తీర ప్రాంతం సమాంతరంగా ఉండటమే D. ఏది కాదు 59. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటగానే కొరియాలిసిస్ ప్రభావం వలన అవి తమ దిశను కుడివైపు మార్చుకుని భారతదేశంలోకి నైరుతి దిశ నుంచి ఈ పవనాలు ప్రవేశిస్తాయి. అందువల్ల ఈ పవనాలను ఏమని అంటారు? A. నైరుతి ఋతు పవనాలు B. ఈశాన్య ఋతు పవనాలు C. వాయువ్య ఋతు పవనాలు D. ఏది కాదు 60. నైరుతి ఋతుపవనాలుగా మార్పు చెందే పవనాలు ఏవి? A. ఈశాన్య వ్యాపార పవనాలు B. వాయువ్య వ్యాపార పవనాలు C. నైరుతి వ్యాపార పవనాలు D. ఆగ్నేయ వ్యాపార పవనాలు 61. భారతదేశంలోకి తొలిసారిగా ప్రవేశించే ఋతుపవనాలు ఏవి? A. ఆగ్నేయ ఋతుపవనాలు B. ఈశాన్య ఋతుపవనాలు C. వాయువ్య ఋతుపవనాలు D. బంగాళ ఖాతాపు శాఖ ఋతుపవనాలు 62. అరేబియా నుంచి వీచే ఋతుపవనాలు మొదటగా ఏ రాష్ట్రం లోకి ప్రవేశిస్తాయి? A. కేరళ B. మహారాష్ట్ర C. కర్ణాటక D. తమిళనాడు 63. బంగాళఖాతపు శాఖ పవనాలు మొట్టమొదట ఏ ప్రాంతం లోకి ప్రవేశిస్తాయి? A. మయన్మార్ B. థాయ్ లాండ్ C. అండమాన్ నికోబార్ దీవులు D. తమిళనాడు 64. నైరుతి ఋతుపవనాల కాలంలో సహ్యాద్రి పర్వతాలలో ఎక్కువ వర్షపాతం ఏ తీరప్రాంతంలో కురుస్తుంది ? A. తూర్పు తీర ప్రాంతం B. దక్షిణ తీర ప్రాంతం C. ఉత్తర తీర ప్రాంతం D. పశ్చిమ తీర ప్రాంతం 65. భారతదేశంలో నైరుతి ఋతుపవనాల కారణంగా కురిసే వర్షపాతం శాతం ఎంత? A. 10 % నుండి 20 % B. 30 % నుండి 40 % C. 60 % నుండి 70 % D. 80 % నుండి 90 % 66. దేశంలో ఖరీఫ్ సాగు పూర్తిగా వేటి మీద ఆధారపడి ఉంటుంది? A. ఈశాన్య ఋతుపవనాలు B. వాయువ్య ఋతుపవనాలు C. నైరుతి ఋతుపవనాలు D. ఆగ్నేయ వ్యాపార పవనాలు 67. ఈశాన్య ఋతుపవనాల వలన భారతదేశంలో అధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? A. ఒరిస్సా B. పంజాబ్ C. కలకత్తా D. తమిళనాడు 68. ఈశాన్య ఋతుపవనాల వలన భారతదేశంలో అధిక వర్షపాతం కు సహకరించే కొండలు ఏవి? A. షెవ రాయ్ B. కాశీ కొండ C. హీవ రాయ్ D. ఏది కాదు 69. ఈశాన్య ఋతుపవనాల కాలంలో తుఫాన్ లకు గురి అయ్యే ప్రాంతం ఏది? A. తమిళనాడు B. ఒరిస్సా C. బీహార్ D. కేరళ 70. భారతదేశ సరాసరి వర్షపాతం ఎంత? A. 90 సెం.మీ B. 100 సెం.మీ C. 105 సెం.మీ D. 118 సెం.మీ 71. వర్షపాతాన్ని కొలిచే సాధనం ఏమిటి? A. రైన్ గేజ్ B. వాటర్ గేజ్ C. స్ట్రీమ్ గేజ్ D. బారో మీటర్ 72. సమ వర్షపాత రేఖలను ఏమని పిలుస్తారు? A. ఐసో బార్స్ B. ఐసో చైమ్ C. ఐసో నెఫ్ D. ఐసో హైట్స్ 73. దేశంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే ప్రాంతం ఏది? A. జయంతి B. కాశీ C. మాసిం డ్రామ్ D. లౌషియా 74. భారతదేశంలో వర్షపాతం అతి తక్కువగా ఉన్న ప్రాంతం ఏది? A. జై సల్మీర్ B. గారో C. మాసిం డ్రామ్ D. కాశీ 75. వేసవి కాలంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం ఏది? A. ఒరిస్సా B. అస్సాం C. బీహార్ D. తమిళనాడు 76. నిమ్నోన్నత వర్షపాతం అని దేనికి పేరు కలదు? A. సంవాహన వర్షపాతం B. చక్రవాత వర్షపాతం C. పర్వతీయ వర్షపాతం D. పవన వర్షపాతం 77. నైరుతి ఋతుపవనాలు మొదట ఏ ప్రాంతంలో ప్రవేశిస్తాయి? A. తమిళనాడు B. కేరళ C. అండమాన్ నికోబార్ దీవులు D. మహారాష్ట్ర 78. భారత ఋతు పవన వ్యవస్థ పై ప్రభావితం చేసే అంశాలు ఏవి? A. జెట్ స్ట్రీమ్ B. ఎలినినో C. లానినో D. పైవన్నీ 79. ఎలినినో అనే పదాన్ని మొదట సారిగా ఉపయోగించినది ఎవరు? A. రాబర్ట్ బేబి B. క్రిప్ట్ బేబి C. హెస్ట్ హివింగ్ D. క్రెస్ట్ బేబి 80. ఎల్ నినో అనగా అర్థం ఏమిటి? A. విస్తరణ B. పశ్చిమ కల్లోలాలు C. ఊర్ద్వ ముఖ ప్రసరణ D. బాల క్రీస్తు 81. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా యొక్క తీర ప్రాంతంలో అనూహ్యంగా సముద్ర నీటి ఉష్ణోగ్రత 80 డిగ్రీ ఫారన్ హీట్ కంటే మించి పోవడం వల్ల దీనిని ఏమని పిలుస్తారు? A. జెట్ స్ట్రీమ్ B. లానినో C. ఎలినినో D. వాకర్ సర్క్యులేషన్ 82. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం గ్లోబల్ వార్మింగ్ ను ప్రభావితం చేసే అంశం ఏది? A. లానినో B. ఎలినినో C. దక్షిణ డోలనము D. అల్ప పీడనము 83. లానినో, ఎలినినో కి" ధ్రుగ్ విషయం" ,దీనికి గల కారణం ఏమిటి? A. వర్షపాత విస్తరణ B. పరివర్త నీయ కాలం C. దక్షిణ డోలనము D. హంబొల్డ్ శీతల ప్రవాహం 84. లానినో దేని వలన ఏర్పడుతుంది? A. వర్షపాత విస్తరణ B. దక్షిణ డోలనము C. పరివర్తనియ కాలం D. హంబొల్డ్ శీతల ప్రవాహం 85. పెరు తీరములో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి అధిక పీడన పరిస్థితులు ఏర్పడితే దానిని ఏమని అంటారు? A. ఎలినినో B. లేనినో C. దక్షిణ డోలనము D. అల్ప పీడనము 86. అంతర ఆయన రేఖ అభిసరణ మండలం వేసవికాలంలో ఉత్తరార్ధ గోళంలో ఎన్ని డిగ్రీల అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది? A. 15 డిగ్రీల B. 20 డిగ్రీల C. 25 డిగ్రీల D. 30 డిగ్రీల 87. ఉత్తర భారత దేశంలో నైరుతి ఋతుపవనాలు వెనుదిరిగిపోవడం వల్ల అత్యంత వేడిగా ఉండే ప్రాంతంగా ఏర్పడితే దీనినే ఏమని అంటారు? A. ఎలినినో B. లేనినో C. అక్టోబర్ వేడి D. దక్షిణ డోలనము 88. పసిఫిక్ మహాసముద్రం నుండి హిందూ మహా సముద్రంలో కి పవనాలు దక్షిణ ప్రాంతంలో అటు ఇటు స్థానంతర గమనం చెందడాన్ని ఏమని అంటారు? A. ఉత్తర డోలనం B. ఉత్తర స్థానంతర గమనం C. దక్షిణ డోలనం D. దక్షిణ స్థానంతర గమనం 89. దక్షిణ డోలనం జరిగేటప్పుడు ఎలినినో ఏర్పడితే దానిని ఏమని అంటారు? A. ఎలినినో ప్రభావం B. లేనినో ప్రభావం C. ఎల్సో ప్రభావం D. ఎల్సో డోలనం 90. వాకర్ సర్కులేషన్ ను మొట్ట మొదటగా గుర్తించినది ఎవరు? A. రాబర్ట్ వాకర్ B. క్రిస్ట్ బేబి C. సర్ రాబర్ట్ హుక్ D. సర్ గిల్ బర్ట్ వాకర్ 91. ఒకే సమయములో భూకంపం సంభవించిన ప్రాంతాలను ఏమని పిలుస్తారు? A. హోమో సేసిమల్స్ B. ఐసో హైట్స్ C. ఐసో బార్స్ D. ఐసో చైమ్ 92. ఒకే సమయములో పిడుగులు పడిన ప్రాంతాలను ఏమని పిలుస్తారు? A. ఐసో హైప్స్ B. ఐసో బ్రాంట్స్ C. ఐసో థేర్స్ D. ఐసో నిఫ్ 93. సమ వాతావరణ పీడనంలోని మార్పును ఏమని పిలుస్తారు? A. ఐసో థెర్స్ B. ఐసో టాచ్ C. ఐసో బార్స్ D. ఐసో నిథ్ 94. సమ భూకంప తీవ్రతను తెలిపే రేఖలను ఏమని పిలుస్తారు? A. ఐసో సెసిమల్స్ B. ఐసో హెల్స్ C. ఐసో థేర్స్ D. ఐసో హైట్స్ 95. సముద్రపు లోతును తెలిపే రేఖలను ఏమని పిలుస్తారు? A. ఐసో చైమ్ B. ఐసో బాత్స్ C. ఐసోజియో థేర్మ్స్ D. ఐసో సెసిమల్స్ 96. భూమి పొరలలోని ఉష్ణోగ్రతను తెలిపే రేఖను ఏమని పిలుస్తారు? A. ఐసో జియో థేర్మ్స్ B. ఐసో థేర్స్ C. ఐసో హైట్స్ D. ఐసో నెఫ్ 97. సముద్రంలో లవణ శాతం ను తెలిపే రేఖను ఏమని పిలుస్తారు? A. ఐసో నిఫ్ B. ఐసో హలైన్స్ C. ఐసో బ్రాంట్స్ D. ఐసో థేర్స్ 98. భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతం ఏది? A. మాసిం డ్రామ్ B. లౌషియా C. గారో D. బార్మేర్ 99. భారతదేశంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతం ఏది? A. బార్మేర్ B. గారో C. డ్రాస్ D. మాసిం డ్రాస్ 100. భారతదేశంలో అధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఏది? A. మాసిన్ రామ్ B. లౌషియా C. గారో D. కాశీ You Have total Answer the questions Prev 1 2 3 4 Next