More Questions | Chemistry | MCQ | Part -15 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 50 201. థైరాయిడ్ హార్మోన్ను నియంత్రించే పదార్థం ఏది ? A. సల్ఫర్ B. అయోడిన్ C. ఫాస్ఫరస్ D. క్లోరిన్ 202. కింది వాటిలో దేనికి యాంటీ సెప్టిక్ ధర్మం ఉంటుంది? A. బ్రోమిన్ B. అయోడిన్ C. ఫ్లోరిన్ D. సల్ఫర్ 203. నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది ? A. ఫ్లోరిన్ B. క్లోరిన్ C. బ్రోమిన్ D. ఆక్సిజన్ 204. విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) ఘాటైన వాసనరావడానికి.. అది విడుదల చేసే ఏ వాయువు కారణం ? A. క్లోరిన్ B. ఫ్లోరిన్ C. ఆక్సిజన్ D. హైడ్రోజన్ 205. గాజు పై డిజైన్లు వేయడానికి (ఎచ్చింగ్) ఉపయోగపడే పదార్థం ? A. హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం B. హైడ్రోక్లోరిక్ ఆమ్లం C. నైట్రికామ్లం D. పైవన్నీ 206. మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి ఉదరం లో ఉత్పత్తయ్యే హైడ్రోక్లోరికామ్లం ముఖ్యమైంది. ఆహారంలో ఏ పదార్థం లోపిస్తే ఈ ఆమ్లం ఉత్పత్తి కష్టమవుతుంది ? A. చక్కెర B. టేబుల్ సాల్ట్ C. నూనెలు D. ప్రోటీన్లు 207. దంతక్షయాన్ని నిరోధించడానికి కనీస మోతాదు లో (1.5 ppm) ఉండాల్సిన పదార్థం ? A. క్లోరైడ్ B. అయోడైడ్ C. ఫ్లోరైడ్ D. సోడియం 208. ఫ్లోరైడ్ గాఢత 3 ppm (3 mg/L) కంటే ఎక్కువైతే ఏ వ్యాధి వస్తుంది? A. కలరా B. గాయిటర్ C. ఫ్లోరోసిస్ D. మినిమేటా 209. నూలు, కలపగుజ్జును విరంజనం చేయడానికి ఉపయో గించే పదార్థం ఏది? A. క్లోరిన్ B. ఫ్లోరిన్ C. అయోడిన్ D. సల్ఫర్ 210. కింది వాటిలో రేడియోధార్మిక హాలోజన్ ఏది ? A. క్లోరిన్ B. ఫ్లోరిన్ C. బ్రోమిన్ D. ఆస్టటీన్ 211. కింది వాటిలో క్లోరిన్ అనుఘటకంగా ఉన్న విషస్వభావం కలిగిన వాయువు ఏది ? A. ఫాస్ జీన్ B. బాష్పవాయువు C. మస్టర్డ్ వాయువు D. పైవన్నీ 212. టెఫ్లాన్ అనే పదార్థం దేని పాలిమర్ ? A. ఇథిలీన్ B. ప్రొపిలీన్ C. టెట్రా ఫ్లోరో ఇథిలీన్ D. టెట్రా క్లోరో ఇథిలీన్ 213. హరిత గృహ ప్రభావానికి కారణమైన ప్రస్తుతం నిషేధించిన .. క్లోరోఫ్లోరో కార్బన్లను వేటిలో ప్రధానంగా వినియోగించారు? A. రిఫ్రిజిరేటర్లు B. టెలివిజన్లు C. ఫ్లోరోసెంట్ ట్యూబులు D. ఫిలమెంట్ బల్బులు 214. క్లోరోఫ్లోరో కార్బన్ సాధారణ నామం ? A. LPG B. ఫ్రియాన్లు C. టెఫ్లాన్ D. గ్లాస్ 215. ఫొటోగ్రాఫిక్ ప్లేట్లలో ఉపయోగించే హాలైడ్ ఏది? A. సోడియం హాలైడ్ B. సిల్వర్ హాలైడ్ C. పొటాషియం హాలైడ్ D. కాల్సియం హాలైడ్ 216. నియోప్రీన్ రబ్బరు యొక్క మోనోమర్ ఏది ? A. వినైల్ క్లోరైడ్ B. ఎసిటలీన్ C. క్లోరోఫ్రీన్ D. క్లోరోక్వీన్ 217. జంతువుల జీర్ణక్రియలో పాల్గొని విసర్జితం కాకుండా కొవ్వులో ఉండిపోతుందనే కారణంతో నిషేధించిన ప్రసిద్ధ క్రిమిసంహారిణి DDT ఏ హాలోజన్ యొక్క ఉత్పన్నం? A. ఫ్లోరిన్ B. క్లోరిన్ C. బ్రోమిన్ D. అయోడిన్ 218. లోహ క్షయాన్ని నిరోధించే ప్లాస్టిక్ లేదా నాన్ స్టిక్ వంట పాత్రలకు ఏ పదార్థంతో కోటింగ్ చేస్తారు ? A. పాలిస్టెరీన్ B. రబ్బరు C. టెరిలీన్ D. టెఫ్లాన్ 219. భారీ పరిశ్రమల్లో గ్రాఫైట్ తో పాటు కందెనగా ఉపయోగించే పదార్థం ఏది ? A. గ్రీజు B. బయోడీజిల్ C. టెఫ్లాన్ D. డాల్డా 220. సోడియం క్లోరైడ్ జలద్రావణాన్ని ఏమంటారు? A. బ్రౌన్ ద్రావణం B. క్లోరిన్ జలం C. కాస్టిక్ సోడా ద్రావణం D. కటిన జలం 221. ద్రవరూపంలో ఉండే అలోహం ఏది ? A. క్లోరిన్ B. పాదరసం C. హీలియం D. బ్రోమిన్ 222. నీటికి కొద్ది మోతాదులో క్లోరిన్ ను కలిపితే, అది ? A. నీటిని శుద్ధి చేస్తుంది B. బ్యాక్టీరియాను చంపుతుంది C. తాగడానికి సురక్షితమైంది D. పైవన్నీ 223. క్లోరిన్ విరంజనకారిగా ఎప్పుడు పనిచేస్తుంది? A. పొడిగాలి సమక్షంలో B. తేమ ఉన్నప్పుడు C. సూర్యరశ్మి సమక్షంలో D. స్వచ్ఛమైన ఆక్సిజన్ సమక్షంలో 224. క్లోరిన్, క్లోరిన్ డై ఆక్సైడ్ల మిశ్రమం విరంజన కారిగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు? A. బ్లీచింగ్ పౌడర్ B. వాషింగ్ పౌడర్ C. యూక్లోరిన్ D. డై క్లోరిన్ 225. కింది వాటిలో క్లోరిన్ విరంజన ధర్మానికి కారణ మైంది ఏది? A. ఆక్సీకరణం B. క్షయకరణం C. క్లోరినేషన్ D. హైడ్రోజినేషన్ 226. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో U 235 ఐసోటోప్ ను ఉపయోగించి పరమాణు బాంబు తయారీలో.. యురేనియం సంగ్రహణకు ఉపయోగించిన హాలోజన్ ఏది? A. ఫ్లోరిన్ B. క్లోరిన్ C. బ్రోమిన్ D. అయోడిన్ 227. క్రిమిసంహారిణిగా ఉపయోగించే బ్రోమిన్ సమ్మేళనం ఏది? A. మిథైల్ బ్రోమైడ్ B. బ్రోమో బెంజీన్ C. ఇథైల్ బ్రోమైడ్ D. పిన సైల్ బ్రోమైడ్ 228. ఓజోన్ పొర క్షీణతకు కారణమైన హాలో హైడ్రో కార్బన్లు ఏవి ? A. క్లోరోఫ్లోరో కార్బన్లు B. బ్రోమో అయడో హైడ్రోకార్బన్లు C. పాలి బ్రోమో హైడ్రోకార్బన్లు D. పాలి అయడో హైడ్రోకార్బన్లు 229. కింది వాటిలో రెయిన్ కోట్ల తయారీలో ఉపయోగించేది ఏది ? A. బేకలైట్ B. పాలిస్టెరీన్ C. పాలివినైల్ క్లోరైడ్ D. టెఫ్లాన్ 230. కర్రబొమ్మలకు రంగు వేయడానికి వాడే 'మొసాయిక్ గోల్డ్ లో ఉండే పదార్థం ? A. గోల్డ్ B. స్టానిక్ క్లోరైడ్ C. ప్లాటినం D. సిల్వర్ క్లోరైడ్ 231. పంటి ఎనామిల్ గట్టితనానికి కారణమైన 'హైడ్రాక్సీ ఎపటైట్'ను ఫ్లోరైడ్ మరింత గట్టితనం ఉన్న పదార్థంగా మారుస్తుంది. ఆ పదార్థం ఏది ? A. ఫ్లోరపటైట్ B. కాల్షియం ఫ్లోరైడ్ C. మెగ్నీషియం ఫ్లోరైడ్ D. ఫ్లోరాల్ 232. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్థుల ఆహారంలో అధికంగా ఉండాల్సిన పదార్థం? A. సోడియం B. పొటాషియం C. కాల్షియం D. మెగ్నీషియం 233. షాపింగ్ నిమిత్తం వాడే క్యారీ బ్యాగుల తయారీ లో వినియోగించే పదార్థం? A. స్టైరీన్ B. ఇథిలీన్ C. వినైల్ క్లోరైడ్ D. ఫీనాల్ 234. సాధారణ గాలిలో ఉండని వాయువు ఏది? A. ఆక్సిజన్ B. నైట్రోజన్ C. హీలియం D. క్లోరిన్ 235. పదార్థ నాలుగో స్థితిని ఏమంటారు? A. ఘన B. ద్రవ C. ప్లాస్మా D. ద్రవ స్పటిక 236. కింది వాటిలో ఉత్పతనం (ఘన స్థితి నుంచి ద్రవంగా మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారడం) చెందే గుణం లేని పదార్థం ఏది? A. టేబుల్ సాల్ట్ B. కర్పూరం C. డ్రై ఐస్ D. అయోడిన్ 237. పెట్రోలు ఉన్న డబ్బాకు మూత లేకుంటే ఏమవుతుంది? A. ఉత్పతనం చెందుతుంది B. బాష్పీభవనం చెందుతుంది C. ఘనీభవిస్తుంది D. పేలిపోతుంది 238. పూరి గుడిసె, పెంకుటిళ్లలో చిన్న రంధ్రం ద్వారా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి మార్గం మెరుస్తూ కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న ధర్మం ఏది? A. కాంతి పరావర్తనం B. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం C. టిండాల్ ప్రభావం D. కాంతి ఉష్ణియ ప్రభావం 239. నీరు,కొవ్వు అనేవి సాధారణంగా ఒకదానిలో మరొకటి కలవని విరుద్ధ ధర్మాలున్న పదార్థాలు, కానీ పాల లాంటి కొల్లాయిలో నీటిలో కొవ్వు కణాలు విస్తరించి ఉంటాయి. అయితే పాలలో వీటిని కలిపి ఉంచేది ఏది? A. కెసిన్ అనే ఎమల్సీకరణ కారకం B. రైబోఫ్లేవిన్ అనే ఎమల్సీకరణ కారకం C. కెసిన్ అనే ఆక్సీకరణ కారకం D. కెరొటిన్ అనే వర్ణద్రవ్యం 240. స్వచ్ఛమైన స్థితిలో ఒకే రకమైన పరమాణువు లను కలిగి ఉండేది ? A. పదార్థం B. అణువు C. మూలకం D. సమ్మేళనం 241. కింది వాటిలో జర్మన్ సిల్వర్ లో ఉండని లోహం ఏది? A. కాపర్ B. జింక్ C. నికెల్ D. సిల్వర్ 242. గాజు అనేది ఒక ? A. స్ఫటికం B. అతి శీతల ద్రవం C. సాధారణ ద్రవం D. ప్లాస్మా 243. ఒకేపరమాణు సంఖ్య కలిగి, వేర్వేరు ద్రవ్యరాశులున్న కేంద్రకాలను ఏమంటారు? A. సమస్థానీయాలు B. ఐసోబార్లు C. ఐసోటోనులు D. ఐసోడయఫర్లు 244. ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటి పై జింక్ లాంటి చురుకైన లోహాలతో పూత పూయడాన్ని ఏమంటారు ? A. ఎన్నీలింగ్ B. బ్లోయింగ్ C. గాల్వనైజేషన్ D. ఎలక్ట్రోప్లేటింగ్ 245. నీరు ద్రవ స్థితిలో ఉండటానికి కారణమైన బంధం ఏది? A. అయానిక బంధం B. సమయోజనీయ బంధం C. అంతరణుక హైడ్రోజన్ బంధాలు D. లోహ బంధాలు 246. ఏ లోహ అయాన్ల కారణంగా నీటికి కాఠిన్యత ఏర్పడుతుంది? A. సోడియం మరియు లిథియం B. కాల్షియం మరియు సోడియం C. కాల్షియం మరియు మెగ్నీషియం D. సోడియం మరియు పొటాషియం 247. వాతావరణ పరిశీలనలో వాడే బెలూన్లలో నింపడానికి ఉపయోగించే వాయువు ఏది ? A. హీలియం B. నియాన్ C. ఆక్సిజన్ D. ఫ్లోరిన్ 248. అమ్మోనియా తయారీకి కావాల్సిన ప్రధాన వాయువు ఏది ? A. ఆక్సిజన్ B. నైట్రోజన్ C. క్లోరిన్ D. హీలియం 249. న్యూట్రాన్లు లేని కేంద్రకం ఏది? A. హీలియం B. హైడ్రోజన్ C. నైట్రోజన్ D. ఫ్లోరిన్ 250. టీవీ రిమోట్లలో ఉండే చిన్న బల్బు ఒక..? A. పరారుణ కిరనం B. అతినీలలోహిత కిరనం C. గామా కిరనం D. X ray కిరనం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next