మృత్తికలు | Geography | MCQ | Part-31 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 1 - 50 1. శిలలు శైధిల్యము చెందగా ఏర్పడే అంత్య పదార్థమును ఏమంటారు? A. బండరాళ్లు B. మృత్తికలు C. చెట్లు D. ఏది కాదు 2. మృత్తికలోని లక్షణాలు వేటి పై ఆధారపడి ఉంటాయి? A. ఆధార శిలలు B. జంతువులు C. గాలి D. నీరు 3. మృత్తిక ఏర్పాటును గురించి తెలియ చేసే ప్రక్రియను ఏమంటారు? A. హరైజన్స్ B. బెడ్ రాక్ C. హ్యూమస్ D. పేడోజెనిసిస్ 4. శిలలు శైథిల్యము మరియు వికోశీకరణం చెందటం వల్ల ఏమి ఏర్పడుతుంది? A. ఖనిజ పదార్థం B. లవణాలు C. తేమ D. ఉష్ణం 5. క్రింది వాటిలో భారత్ లో విస్తరించిన మృత్తిక లేవి? A. ఒండ్రు నేలలు B. నల్లరేడి మృత్తికలు C. లాట రైట్ మృత్తికలు D. పైవన్ని 6. కింది వాటిలో మృత్తికలు ఏర్పడటానికి కావలసిన అనుకూల పరిస్థితులెవి? A. క్రిమి కీటకాదులు B. వర్షపాతం.ఉష్ణోగ్రత C. సహజ ఉద్బిజ సంపద D. పైవన్ని 7. వ్యవసాయ ఉత్పత్తి దేని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది? A. సారవంతమైన నేలలు B. ఎరువులు C. క్రిమి కిట కాదులు D. ఏది కాదు 8. క్రింది వాటిలో నేలలు కలిగి ఉండే ప్రదార్థాలు ఏవి? A. కర్భన,అకర్భన పదార్థాలు B. తేమ C. గాలి D. పైవన్ని 9. అకర్భన పదార్థాలలో ప్రధానంగా ఉండేది? A. ఖనిజాలు B. లవణాలు C. సూక్ష్మ జీవులు D. శిలలు 10. అకర్భన పదార్థాల ఖనిజాల్లో ఉండే ప్రధాన పదార్థాలు ఏవి? A. కాల్షియం కార్బనేట్ B. సిలికేట్ C. సిలికా D. పైవన్ని 11. మృత్తికలో చిన్న చిన్న స్పటికాల రూపంలో ఉండే అకర్భన ఖనిజ పదార్థం ఏది? A. ఐరన్ B. సోడియం C. కాల్షియం D. సిలికా 12. సిలికా ప్రధానంగా ఏ మృత్తికలో ఉంటుంది? A. ఇసుక B. ఎడారి నేలలు C. సేంద్రీయ నేలలు D. పైవన్ని 13. సిలికా దేని వలన ఏర్పడుతుంది? A. మొక్కల శైథిల్యం B. శిలల యొక్క శైథిల్యం C. జంతువుల యొక్క శైథిల్యం D. క్రిమి కీట కాదుల శైథిల్యం 14. క్లే వేటి మిశ్రమంతో కూడుకున్నది? A. కాల్షియం కార్బనేట్ B. సిలికేట్ C. పాస్పరస్ D. పైవన్ని 15. క్రింది వాటిలో మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగ పడేది? A. మాంగనీస్ B. సిలికా C. కాల్షియం D. పాస్పరస్ 16. నేలల యొక్క సారవంతాన్ని దేని ద్వారా తెలుసుకోవచ్చు? A. అకర్బన పదార్థాలు B. కర్బన పదార్థాలు C. ఆధారశీల D. ఏది కాదు 17. కర్బన పదార్థాలు ఎలా ఏర్పడతాయి? A. వృక్షాలు కుళ్లిపోయి విఘటనం చెందడం వల్ల B. జంతువులు కుళ్లిపోయి విఘటనం చెందడం వల్ల C. a మరియు b D. శిలలు శిథిలమవటం వల్ల 18. కర్బన సంబంధ పదార్థాలను ఏమని పిలుస్తారు? A. హ్యూమస్ B. స్వాభావిక ఎరువు C. సొలమ్ D. a మరియు b 19. ఒక ప్రాంతంలోని మృత్తికల ఉపరితలం నుంచి దిగువనకు వెళ్లే కొద్దీ ఉండే పొరల క్రమాన్ని ఏమంటారు? A. మృత్తికల పార్శ్వ రేఖాకృతి B. మృత్తికల దీర్ఘ రేఖాకృతి C. a మరియు b D. ఉప మృత్తిక 20. మృత్తికల పార్శ్వ రేఖాకృతిలో ఎలా ఉంటాయి? A. వేర్వేరు పొరలు B. వేర్వేరు భౌతిక,రసాయనిక ధర్మాలు C. చిన్న జన్యుపరమైన సంబంధాలు D. పైవన్ని 21. ఆధార శిలలపై స్థితిని పొందే పొరలన్నింటినే సమిష్టిగా ఏమంటారు? A. హ్యూమస్ B. సొలమ్ C. సిలికా D. క్లే 22. మృత్తికల దీర్ఘ రేఖాకృతి ఎన్ని ప్రధాన పొరలను కలిగి ఉంటుంది? A. రెండు B. మూడు C. నాలుగు D. ఐదు 23. మృత్తికల దీర్ఘ రేఖాకృతి పైన పొరను ఏమంటారు? A. ఉప మృత్తిక B. ఇసుక నేల C. ఉపరితల మృత్తిక D. ఆధార శిల 24. మృత్తికల దీర్ఘ రేఖాకృతి మధ్య పొరను ఏమంటారు? A. క్లే నేల B. ఉపరితల మృత్తిక C. ఉప మృత్తిక D. ఆధార శిల 25. మృత్తికల దీర్ఘ రేఖాకృతి క్రింది పొరను ఏమంటారు? A. ఉపరితల మృత్తిక B. ఆధార శిల C. ఉప మృత్తిక D. క్లే నేల 26. క్రింది వాటిలో ఇసుక నేలల లక్షణాలేవి? A. నీటిని ఇంకే స్వభావాన్ని కలిగి ఉంటాయి B. 60% ఇసుకని;10% క్లే ని కలిగి ఉంటాయి C. ఎరువులను ఉపయోగించవలసి ఉంటుంది D. పైవన్ని 27. క్లే నేలలో ఎంత శాతం క్లే ఉంటుంది? A. 10 శాతం B. 20 శాతం C. 50 శాతం D. 60 శాతం 28. క్రింది వాటిలో క్లే నేలల లక్షణాలేవి? A. తేమను నిల్వ ఉంచుకునే లక్షణాన్ని కలిగి ఉంది జిగటగా ఉంటాయి B. ఇసుక మరియు చాక్ ను కలిపి సారవంతం పెంచవచ్చు C. a మరియు b D. నీటిని నిల్వ ఉంచుకునే స్వభావం 29. క్రింది వాటిలో ఇసుక మరియు క్లే మిశ్రమంల యొక్క నిష్పత్తి తగిన విధంగా ఉంటే ఎక్కువ సారవంతాన్ని కలిగి ఉండే నేలలు ఏవి? A. క్లే నేలలు B. లూమ్ నేలలు C. ఇసుక నేలలు D. పైవన్ని 30. మృత్తికల తో సంబంధం లేకుండా మొక్కలను పెంచుటను ఏమంటారు? A. హైడ్రో ఫొనిక్స్ B. పెడాలజీ C. హైడ్రో ఫైటా D. వృక్ష శాస్త్రం 31. నేలల పుట్టుకను అధ్యయనం చేయు శాస్త్రం? A. పెడాలజీ B. పేడోజెనిసిస్ C. వైరాలజీ D. పురాజీవ శాస్త్రం 32. తటస్థ నేలలు యొక్క PH విలువ? A. 5.0 నుండి 6.5 B. 6.5 నుండి 7.5 C. 5.5 నుండి 6.0 D. 6.0 నుండి 7.5 33. ప్రపంచంలో మృత్తికా శాస్త్రకారులు మృత్తికలను ఎన్ని రకాలుగా విభజించారు? A. 2 రకాలు B. 3 రకాలు C. 4 రకాలు D. 5 రకాలు 34. ఏ మృత్తికలను ఇన్- సిటూ నేలలు అని అంటారు? A. మండల మృత్తికలు B. అంతర్ మండల మృత్తికలు C. మండల రహిత మృత్తికలు D. టామ్ నేలలు 35. మాతృ శిలల మీదనే ఏర్పడి చాలా కాలం అచ్చటనే వృద్ధి చెందే మృత్తికలు ఏవి? A. మండల రహిత మృత్తికలు B. అంతర్ మండల మృత్తికలు C. మండల మృత్తికలు D. ఇసుక నేలలు 36. క్రింది వాటిలో మండల మృత్తికలు ఏవి? A. టండ్రా మృత్తికలు B. ఎర్ర నేలలు C. క్షార నేలలు D. పైవన్ని 37. పరివాహం చాలా తక్కువగా గల పరిస్థితులలో ద్రావణీకరణ లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే మృత్తికలు? A. మండల రహిత మృత్తికలు B. అంతర్ మండల మృత్తికలు C. మండల మృత్తికలు D. క్లే నేలలు 38. క్రింది వాటిలో అంతర్ మండల మృత్తికలకు ఉదాహరణలు? A. లవణ మృత్తికలు B. కాల్ కెరియన్ మృత్తికలు C. a మరియు b D. ఇసుక నేలలు 39. శైథిల్యము చెందిన శిలలు అంత్య పదార్థాలు రవాణా చేయబడి నిక్షేపితమైనపుడు ఏర్పడే మృత్తికలు? A. మండల రహిత మృత్తికలు B. మండల మృత్తికలు C. లూమ్ నేలలు D. అంతర్ మండల మృత్తికలు 40. క్రింది వాటిలో మండల రహిత మృత్తికలకు ఉదాహరణలు? A. ఒండ్రు మృత్తికలు B. వాయు జనిత మృత్తికలు C. a మరియు b D. క్లే నేలలు 41. భూవిజ్ఞాన శాస్త్రరీత్యా భారతదేశంలోని నేలను విస్తారంగా ఎన్ని ప్రధానమైన సమూహాలుగా విభజించవచ్చు? A. 2 సమూహాలు B. 3 సమూహాలు C. 4 సమూహాలు D. 5 సమూహాలు 42. భూవిజ్ఞాన శాస్త్రరిత్యా భారతదేశంలోని నేలలు క్రింది వాటిలో ఏవి? A. ఉత్తర భారతదేశంలోని నేలలు B. ద్వీపకల్ప భారతదేశంలోని నేలలు C. a మరియు b D. మండల మృత్తికలు 43. హిమాలయ నదుల చేత లేదా పవనాల చేత రవాణా చేయబడి ఏర్పడినటువంటి నేలలు ఏవి? A. మండల రహిత మృత్తికలు B. ఉత్తర భారతదేశంలోని నేలలు C. ద్వీపకల్ప భారతదేశంలోని నేలలు D. పైవన్ని 44. ఉత్తర భారతదేశంలోని నేలలు వేటి అవక్షేపాల చేత ఏర్పడి ఉన్నాయి? A. మాంగనీస్ B. అల్యూమినియం C. ఐరన్ D. పొటాషియం 45. శిలలు వేరుగా శైతిల్యం చెంది ఆ శిలలపై ఏర్పడే నేలలు ఏవి? A. అంతర్ మండల మృత్తికలు B. ఉత్తర భారతదేశంలోని నేలలు C. ద్వీపకల్ప భారతదేశంలోని నేలలు D. మండల మృత్తికలు 46. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? A. 1954 సంవత్సరం B. 1955 సంవత్సరం C. 1956 సంవత్సరం D. 1957 సంవత్సరం 47. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఎక్కడ ఉంది? A. కలకత్తా B. ఢిల్లీ C. ముంబాయి D. మద్రాస్ 48. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తర్వాత కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహాయంతో భారతదేశంలోని మృత్తికలను ఎన్ని భాగాలుగా వర్గీకరించింది? A. 4 భాగాలు B. 5 భాగాలు C. 6 భాగాలు D. 8 భాగాలు 49. డెల్టా నేలలకు గల మరొక పేరు? A. ఒండ్రు మట్టి నేలలు B. ఎర్ర నేలలు C. నల్ల రేగడి నేలలు D. పైవన్ని 50. క్రింది వాటిలో నదీ పరివాహక ప్రాంతాలలో విస్తరించి రవాణా చేయబడుట వలన ఏర్పడిన నేలలు ఏవి? A. నల్ల రేగడి నేలలు B. డెల్టా నేలలు C. అటవీ నేలలు D. ఎర్ర నేలలు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next