సింధూ నాగరికత | History | MCQ | Part -2 By Laxmi in TOPIC WISE MCQ History Total Questions - 50 1. గార్డెన్ చైల్డ్ అనే పండితుడు కొత్త రాతి యుగాన్ని ఏమని అభివర్ణించాడు A. నాగరిక విప్లవం B. వ్యవసాయ విప్లవం C. పురుషాధిపత్య విప్లవం D. మత విప్లవం 2. మానవుడు తొలుత ఉపయోగించిన లోహం ఏది ? A. రాగి B. కంచు C. ఇనుము D. ఇత్తడి 3. ఏ యుగాన్ని "ఇనుప యుగం" అంటారు ? A. పాతరాతి యుగం B. మధ్య రాతియుగం C. మధ్య పాతరాతి యుగం D. కొత్తరాతి యుగం 4. మరణించిన వారి జ్ఞాపకార్థం పెద్ద స్తంభాన్ని నిలుపే సమాధిని ఏమని అంటారు ? A. చిస్ట్ B. మెన్ హిర్ C. డాల్మన్ D. సెర్కోఫాగస్ 5. మెన్ హిర్ సమాధులు ఎక్కడ బయట పడ్డాయి ? A. నల్గొండ జిల్లా B. కరీంనగర్ జిల్లా C. మహబూబ్ నగర్ జిల్లా D. పైవన్నీ 6. రాతి పెట్టెలో మృత దేహాన్ని ఉంచి ఆ పెట్టెను ఒక గొయ్యిలో పెట్టి, దాన్ని మట్టిలో కప్పి దాని చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతి గుళ్లను పెర్చే సమాధిని ఏమంటారు? A. మెన్ హిర్ B. డాల్మన్ C. సెర్కోఫాగస్ D. చిస్ట్ 7. రాతి శవ పేటికను గోతిలో పెట్టకుండా భూమి మీదనే పెట్టి దాని చుట్టూ రాళ్లు పెర్చే సమాధిని ఏమంటారు ? A. చిస్ట్ B. డాల్మన్ C. సెర్కోఫాగస్ D. మెన్ హిర్ 8. మట్టితో చేసిన శవ పేటికలో శవాన్ని గాని లేదా దహనం చేసిన తర్వాత ఆస్తికలను గాని ఉంచిన సమాధిని ఏమంటారు ? A. మెన్ హిర్ B. చిస్ట్ C. డాల్మన్ D. సెర్కోఫాగస్ 9. మెసపటోమియా అనగా ఎన్ని నదుల ప్రాంతం? A. 2 నదులు B. 3 నదులు C. 4 నదులు D. 5 నదులు 10. ఇరాక్ లోని యూఫ్రటీస్ మరియు టైగ్రీస్ నదుల మధ్య వెలసిన నాగరికత ఏది ? A. చైనా నాగరికత B. మెసపటోమియా నాగరికత C. ఈగిప్తు నాగరికత D. క్రీట్ నాగరికత 11. మంచు నాగరికత అని దేనికి పేరు ? A. మెసపటోమియా నాగరికత B. ఈగిప్తు నాగరికత C. చైనా నాగరికత D. క్రీట్ నాగరికత 12. చైనా నాగరికత ఎక్కడ వెలసింది ? A. సింధూ లోయ B. చైనా లోని హయాంగ్ లో C. ఈగిప్టు నైలు నది D. గ్రీసు 13. ఈగిప్టు నైలు నది తీరాన వెలసిన నాగరికత ? A. మెసపటోమియా నాగరికత B. ఈగిప్టు నాగరికత C. చైనా నాగరికత D. క్రీట్ నాగరికత 14. క్రీట్ నాగరికత ఎక్కడ వెలసింది ? A. ఈగిప్టులోని నైలు నది తీరం B. ఇరాక్ లోని యూప్రటీస్ మరియు టైగ్రిస్ C. చైనా లోని హయాంగ్ లో D. మధ్యధరా సముద్రంలో గ్రీసు సమీపాన 15. సింధూ నాగరికతను మొట్ట మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు ? A. 1823 B. 1825 C. 1826 D. 1827 16. సింధూ నాగరికతను మొట్ట మొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? A. సర్ జాన్ మార్షల్ B. చార్లెస్ మాజిన్ C. రాబర్ట్ హెన్రీ D. రాబర్ట్ బ్రౌన్ 17. దయారమ్ సహాని, ఆర్. డి. బెనర్జీ ఏ శతాబ్దం ఆరంభంలో సింధూ నాగరికతను గురించి కనుగొన్నారు? A. 15వ శతాబ్ధం B. 16వ శతాబ్ధం C. 17వ శతాబ్ధం D. 20వ శతాబ్ధం 18. సింధూ నాగరికతను కనుగొన్న అప్పటి ASI (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ఛైర్మన్ ఎవరు A. సర్ జాన్ మార్షల్ B. చార్లెస్ మాజిన్ C. ఆర్.డి. బెనర్జీ D. దయారమ్ సహాని 19. మొట్ట మొదట హరప్పా ప్రాంతంలో త్రవ్వకాలు జరిపి ఒక గొప్ప నాగరికత వెలసినది అని ప్రకటించినది ఎవరు? A. ఆర్.డి. బెనర్జీ B. అలెగ్జాండర్ బర్గ్స్ C. దయారాం సహాని D. సర్ జాన్ మార్షల్ 20. హరప్పా నాగరికతకు చెందిన ప్రధాన పట్టణాలు ఏ నదికి ఇరువైపుల ఉండుటచే దీనిని సింధు నాగరికత అంటారు ? A. గంగా నది B. సింధూనది C. కృష్ణా నది D. నర్మదా నది 21. హరప్పా నాగరికతకు చెందిన ప్రధాన పట్టణాలు ఏ నదికి ఇరువైపులా ఉండుటచే దీనిని సింధు నాగరికత అంటారు? A. గంగానది B. సింధు నది C. కృష్ణా నది D. నర్మదా నది 22. సింధూ నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసింది? A. సర్ జాన్ మార్షల్ B. చార్లెస్ జాన్ C. అలెగ్జాండర్ బర్న్స్ D. ఆర్.డి.బెనర్జీ 23. ఏ నాగరికత కాంస్య యుగానికి చెందింది? A. చైనా నాగరికత B. ఈజిప్టు నాగరికత C. క్రీట్ నాగరికత D. సింధూ నాగరికత 24. సింధూ ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? A. అక్టోబర్-ఏప్రిల్ B. జూన్-డిసెంబర్ C. జనవరి-జూన్ D. నవంబర్-మే 25. సింధూ ప్రజలు దేనిని ప్రధానంగా పండించారు A. వరి B. గోధుమ C. బార్లీ D. జొన్న 26. ప్రపంచంలో మొదటి సారిగా వాణిజ్య పంట అయిన పత్తిని ఎవరు పండించారు? A. సింధు ప్రజలు B. పాత రాతియుగం ప్రజలు C. మధ్య రాతియుగం ప్రజలు D. కొత్త రాతియుగం ప్రజలు 27. సింధూ ప్రజల ప్రధాన ఓడరేవు ఏది? A. పాకిస్తాన్ B. లోథాల్ C. పంజాబ్ D. ఏది కాదు 28. హరప్పా ప్రజలు దేనిని పూజించేవారు? A. సూర్యుడు B. చంద్రుడు C. ప్రకృతి D. రాతి 29. పాకిస్తాన్ లోని జుకర్ అనే ప్రాంతంలో ఏమి అధికంగా లభ్యమయ్యాయి? A. ముద్రికలు B. బొమ్మలు C. పనిముట్లు D. పైవన్ని 30. హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు? A. సూర్యుడు B. ఇంద్రుడు C. చంద్రుడు D. పశుపతి మహాదేవుడు 31. పసుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది A. మొహంజదారో B. ఈజిప్ట్ C. చైనా D. ఇరాక్ 32. పసుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి? A. గేదె,ఏనుగు B. ఖడ్గ మృగం C. పులి D. పైవన్ని 33. పసుపతి మహాదేవుని కాళ్ళ వద్ద ఉన్న జంతువులేవి? A. రెండు జింకలు B. రెండు పులులు C. రెండు కుందేళ్లు D. రెండు సింహాలు 34. సింధూ ప్రజల ఆరాధ్య దైవం? A. పార్వతి B. లక్ష్మి C. సరస్వతి D. అమ్మతల్లి 35. సింధూ ప్రజల ఆరాధ్య పక్షి? A. చిలుక B. పావురం C. నెమలి D. కోడి 36. సింధూ ప్రజల ఆరాధ్య జంతువు? A. వృషభం B. బర్రె C. మేక D. కుక్క 37. సింధూ ప్రజల లిపి? A. లిఖిత పూర్వం B. బొమ్మల లిపి C. గీతల లిపి D. a మరియు b 38. సింధూ ప్రజలు కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడికి రాసేవారు దీనినే ఏమంటారు? A. బౌస్ట్రో ఫెడాన్ B. సర్ప లిపి C. విస్ట్రో ఫెడాన్ D. a మరియు b 39. సింధూ ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు? A. స్టీయా టైట్ శిలలతో B. పెబ్బర్ టూల్స్ తో C. లైమ్ స్తోన్స్ D. గులాక రాయి 40. సింధూ ప్రజల మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది? A. ఈజిప్టు B. మొహంజదారో C. చైనా D. ఇరాక్ 41. సింధూ ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు? A. మర్రి చెట్టు B. వేప చెట్టు C. చింత చెట్టు D. రావి చెట్టు 42. సింధూ నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది? A. పట్టణీకరణ నాగరికత B. గ్రామీణ నాగరికత C. అడవి ప్రజల జీవనం D. పైవన్ని 43. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? A. సింధు B. రావి C. గంగా D. కృష్ణా 44. మొహంజదారోలో ప్రతి ఇంటికి ఏమి ఉండేది? A. బావి B. స్నానపుగది C. a మరియు b D. కుళాయి 45. హరప్పా కాలం నాటి గ్రిడ్ విధానం ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తుంది? A. చండీగర్ B. రాజస్థాన్ C. పంజాబ్ D. పాకిస్తాన్ 46. హరప్పా నగరాన్ని ఏమంటారు? A. ధాన్యాగారాల నగరం B. విలాసనగరం C. శిలానగరం D. పైవన్ని 47. మొహంజదారో వద్ద తవ్వకాలు జరిపినది? A. దయారామ్ సహాని B. ఆర్.డి.బెనర్జి C. చార్లెస్ మాజిన్ D. సర్ జాన్ మార్షల్ 48. చిన్న ధాన్యాగారాలు ,ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడి తవ్వకాలలో బయటపడినవి? A. సింధు B. మొహంజదారో C. హరప్పా D. పైవన్ని 49. మొహంజదారో అనగా అర్థం ఏమిటి? A. మృతుల దిబ్బ B. శవ పేటిక C. రాళ్ళతో నిర్మించిన సమాధి D. పైవన్ని 50. నిఖిలిస్తాన్ అని దేనిని పేర్కొంటారు? A. హరప్పా B. మొహంజదారో C. సింధు D. చైనా You Have total Answer the questions Prev 1 2 3 Next