కాంతి | Physics | MCQ | Part -1 By Laxmi in TOPIC WISE MCQ Physics - కాంతి Total Questions - 50 1 కంటి దృష్టి జ్ఞానమును గూర్చి అధ్యయనం చేయు శాస్త్రంను ఏమంటారు ? A. అకౌస్టిక్స్ B. ఆప్తాల్మాలజి C. కాస్మాలజీ D. ఫోటోమెట్రీ 2 కింది వాటిలో సహజ స్వయం ప్రకాశకాలు ఏవి ? A. సూర్యుడు B. నక్షత్రాలు C. మిణుగురు పురుగు D. పైవన్నీ 3 కింది వాటిలో కృత్రిమ స్వయంప్రకాశకాలు ఏవి ? A. సూర్యుడు B. నక్షత్రాలు C. మిణుగురు పురుగు D. విద్యుత్ బల్బు 4 జీవులు కాంతిని వెదజల్లే ప్రక్రియను ఏమంటారు ? A. జీవశక్తి B. జీవ ప్రకాశం C. జీవసందీప్తి D. పైవన్నీ 5 కింది వాటిలో అస్వయం ప్రకాశకములు ఏవి ? A. గ్రహాలు B. ఉపగ్రహాలు C. చంద్రుడు D. పైవన్నీ 6 పదార్థముల గుండా కాంతి కిరణాలు చొచ్చుకుని పోతే ఆ పదార్థములను ఏమంటారు ? A. పారదర్శక పదార్థములు B. పాక్షిక పారదర్శక పదార్థములు C. అపారదర్శక పదార్థములు D. పైవన్నీ 7 పదార్థములపైన పతనమయిన కాంతిలో కొంత భాగం తమద్వారా ప్రసారం చేసి మిగిలిన భాగమును ఆపివేస్తే ఆ పదార్థములను ఏమంటారు ? A. పారదర్శక పదార్థములు B. పాక్షిక పారదర్శక పదార్థములు C. అపారదర్శక పదార్థములు D. పైవన్నీ 8 కింది వాటిలో పారదర్శక పదార్థములకు ఉదాహారన ? A. గాజు B. గరుకు ఉపరితలం గల గాజుపలక C. పారాఫిన్ మైనం D. నూనెను అద్దిన కాగితము 9 కింది వాటిలో పాక్షిక పారదర్శక పదార్థములకు ఉదాహారన ? A. నెయ్యిని అద్దిన కాగితం B. గరుకు ఉపరితలం గల గాజుపలక C. పారాఫిన్ మైనం D. పైవన్నీ 10 కింది వాటిలో అపారదర్శక పదార్థములకు ఉదాహారన ? A. కర్ర B. నెయ్యిని అద్దిన కాగితం C. గరుకు ఉపరితలం గల గాజుపలక D. పారాఫిన్ మైనం 11 పదార్థముల గుండా కాంతి కిరణాలను చొచ్చుకుని పోనివ్వని పదార్థములను ఏమంటారు ? A. పారదర్శక పదార్థములు B. పాక్షిక పారదర్శక పదార్థములు C. అపారదర్శక పదార్థములు D. పైవన్నీ 12 కాంతి తీవ్రత కు ప్రమాణాలు ఏవి? A. హెర్ట్జ్ B. వాట్ C. వోల్ట్ D. కాండేలా 13 కాంతి కణ సిద్ధాంతం ను ప్రతిపాదించిన వారు ఎవరు ? A. హైగెన్స్ B. మాక్స్ ప్లాంక్ C. న్యూటన్ D. రాబర్ట్ ఫుల్టన్ 14 కాంతి తరంగ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు ? A. హైగెన్స్ B. మాక్స్ ప్లాంక్ C. న్యూటన్ D. రాబర్ట్ ఫుల్టన్ 15 కాంతి క్వాంటం సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు ? A. హైగెన్స్ B. మాక్స్ ప్లాంక్ C. న్యూటన్ D. రాబర్ట్ ఫుల్టన్ 16 విద్యుత్ అయస్కాంత సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు ? A. హైగెన్స్ B. మాక్స్ ప్లాంక్ C. న్యూటన్ D. మ్యాక్స్ వెల్ 17 ఏ సిద్దాంతం ప్రకారం కాంతి స్వయం ప్రకాశకములైన వస్తువులలో నుండి వెలువడిన కాంతి అనునది చిన్నచిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది ? A. కాంతి తరంగ సిద్ధాంతం B. కాంతి కణ సిద్ధాంతం C. కాంతి క్వాంటం సిద్ధాంతం D. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం 18 ఏ సిద్దాంతం ప్రకారం కాంతి కిరణాలు యాంత్రిక తరంగముల రూపంలో ప్రయాణిస్తాయి ? A. కాంతి తరంగ సిద్ధాంతం B. కాంతి కణ సిద్ధాంతం C. కాంతి క్వాంటం సిద్ధాంతం D. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం 19 ఏ సిద్దాంతం ప్రకారం కాంతి కిరణములు అనునవి చిన్న చిన్న శక్తి పాకెట్ల రూపంలో ప్రయాణిస్తాయి ? A. కాంతి తరంగ సిద్ధాంతం B. కాంతి కణ సిద్ధాంతం C. కాంతి క్వాంటం సిద్ధాంతం D. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం 20 కాంతి క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి యొక్క పౌనఃపున్యం పెరిగినట్లయితే ఫోటాన్ యొక్క శక్తి ఏమవుతుంది ? A. పెరుగుతుంది B. తగ్గుతుంది C. మారదు D. మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది 21 కాంతి క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి యొక్క తరంగదైర్ఘ్యం పెరిగినట్లయితే ఫోటాన్ యొక్క శక్తి ఏమవుతుంది ? A. పెరుగుతుంది B. తగ్గుతుంది C. మారదు D. మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది 22 కింది వారిలో "ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడు" ఎవరు ? A. హైగెన్స్ B. మాక్స్ ప్లాంక్ C. న్యూటన్ D. మ్యాక్స్ వెల్ 23 సర్ సి.వి.రామన్ తన "రామన్ ఫలితమును" నిరూపించుటకొరకు ఏ సిద్ధాంతంను ఉపయోగించారు ? A. కాంతి తరంగ సిద్ధాంతం B. కాంతి కణ సిద్ధాంతం C. కాంతి క్వాంటం సిద్ధాంతం D. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం 24 కాంతి జనకముల నుండి వెలువడిన కాంతి కిరణములు సరళరేఖా మార్గములో ప్రయాణించుటను ఏమంటారు ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి పరిక్షేపణం D. పరావర్తనం 25 సౌరకుటుంబం యందు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం అనునవి ఏర్పడడానికి గల కారణం ఏమిటి ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి పరిక్షేపణం D. పరావర్తనం 26 సూర్యుని కాంతి కిరణాలను ప్రయోగశాల యందు ఉపయోగించి కాంతివేగమును ఖచ్చితముగా కనుగొనిన శాస్త్రవేత్త ? A. హైగెన్స్ B. మాక్స్ ప్లాంక్ C. ఫోకల్ట్ D. మ్యాక్స్ వెల్ 27 పిడుగుపడు సమయంలో మొదట మెరుపు కనిపించి పిదప ఉరుము వినపడుటకు కారణము ఏమిటి ? A. ధ్వని వేగం కాంతివేగం కు సమానం B. ధ్వనివేగం కాంతివేగం కంటే ఎక్కువ C. ధ్వనివేగం కాంతివేగం కంటే తక్కువ D. ఏది కాదు 28 సూర్యుని నుండి బయలుదేరిన కాంతికిరణము భూమిని చేరుచుటకు పట్టు సమయం ఎంత ? A. 2.2 నిమిషములు B. 4.2 నిమిషములు C. 8.2 నిమిషములు D. 9.2 నిమిషములు 29 చంద్రుని నుండి పరావర్తనం చెందిన కాంతికిరణాలు భూమిని చేరుటకు పట్టుకాలము ఎంత ? A. 2 సెకను B. 3 సెకను C. 1 సెకను D. 4 సెకను 30 ధూరం లేదా పొడవును కొలడానికి ఉపయోగింపబడు అతి పెద్ద ప్రమాణం ఏది ? A. కాంతి సంవత్సరం B. ఫెర్మి C. పారలాస్టిక్ సెకండ్ D. కిలో మీటర్ 31 ధూరం లేదా పొడవును కొలడానికి ఉపయోగింపబడు అతి చిన్న ప్రమాణం ఏది ? A. కాంతి సంవత్సరం B. ఫెర్మి C. పారలాస్టిక్ సెకండ్ D. కిలో మీటర్ 32 పరమాణు కేంద్రకం యొక్క పరిమాణమును కొలవడానికి ఉపయోగించు ప్రమాణం ఏది ? A. కాంతి సంవత్సరం B. ఫెర్మి C. పారలాస్టిక్ సెకండ్ D. కిలో మీటర్ 33 కాంతి కిరణములు ఒక యానకంలో నుండి మరొక యానకంలోనికి ప్రయాణించినపుడు, యానక లంబం వద్ద వంగి ప్రయాణిస్తాయి ఈ ధర్మమును ఏమంటారు ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 34 నీరు గల పాత్రయందు ఒక కర్రను ఉంచి చూసినపుడు నీటియందు గల కర్ర భాగం వంగినట్లుగా కనిపించడానికి గల కారణం ఏమిటి ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 35 ఒక పాత్రయందు కొంత మట్టం వరకు నీటిని నింపి చూసినపుడు అడుగుభాగం పైకి లేచి నీటి లోతు తక్కువగా ఉన్నట్లు అనిపించడానికి కారణం ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 36 నీటి యందు ఒక నాణెంను వేసి చూసినపుడు,ఆ నాణెం అసలు పరిమాణం కంటే పెద్దగా, మరియు తక్కువ లోతులో ఉన్నట్లుగా అనిపించడానికి కారణం ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 37 నీటియందు గల చేప గాలిలో ఎగురుచున్న గ్రద్దను చూసినపుు అది అసలు పరిమాణం కంటే చిన్నగా మరియు ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది దీనికి కారణం ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 38 అక్షరములను కలిగిన పేపర్ పైన గాజు ఫీలర్ ను అమర్చి చూసినపుడు ఆ అక్షరములు పెద్దవిగా మరియు కంటికి దగ్గరగా ఉన్నట్లు కనిపించడానికి కారణం ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 39 సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో సూర్యుడి నుండి వచ్చుచున్న కాంతికిరణములు శూన్యములో నుండి భూమి వాతావరణ పొరలోకి ప్రవేశించినపుడు సూర్యబింబము అండాకృతిలో కనిపించడానికి కారణం ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 40 నక్షత్రాలు మిణుకు మిణుకు మన్నట్లుగా కనిపించడానికి కారణం ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 41 గాలి యొక్క వక్రీభవన గుణకం ఎంత ? A. 1. 33 B. 1.5 C. 2.42 D. 1 42 నీటి యొక్క వక్రీభవన గుణకం ఎంత ? A. 1. 33 B. 1.5 C. 2.42 D. 1 43 గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత ? A. 1. 33 B. 1.5 C. 2.42 D. 1 44 వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎంత ? A. 1. 33 B. 1.5 C. 2.42 D. 1 45 వక్రీభవన గుణక విలువ ఎక్కువగా ఉండే పదార్థం ఏది ? A. గాజు B. నీరు C. వజ్రం D. బట్టలు 46 కాంతి కిరణములు ప్రయాణించుచున్న మార్గంలో ఎదురుగా ఉన్న వస్తువుల ఉపరితలంపైన పతనమయి తిరిగి వెనుకకు మరలుటను ఏమంటారు ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 47 మానవుడికి దృష్టి జ్ఞానం కలగడానికి గల కారణం ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి వక్రీభవనము D. కాంతి పరావర్తనం 48 వజ్రం మెరవడానకి గల కారణం ఏమిటి ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి సంపూర్ణాంతర పరావర్తనము D. కాంతి పరావర్తనం 49 ఇసుక ఎడారుల యందు మరియు వేసవికాలంలో తారు రోడ్లపైన ఎండమావులు ఏర్పడటానికి కారణం ఏమిటి ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి సంపూర్ణాంతర పరావర్తనము D. కాంతి పరావర్తనం 50 నీటిలోపల లేదా ఒక గాజు దిమ్మెలోపల బంధించబడి ఉన్న ఒక గాలి బుడగ, వెండివలె మెరియుచున్నట్లు కనిపించుటకు కారణం ఏమిటి ? A. కాంతి ఋజువర్తనం B. కాంతి విశ్లేషణము C. కాంతి సంపూర్ణాంతర పరావర్తనము D. కాంతి పరావర్తనం You Have total Answer the questions Prev 1 2 3 Next