యాంత్రిక శక్తి | Physics | MCQ | Part -8 By Laxmi in TOPIC WISE MCQ Physics - యాంత్రిక శక్తి Total Questions - 61 1 ఒక వస్తువు సరళరేఖామార్గంలో ప్రయాణించుచున్నట్లయితే ఆ చలనమును ఏమంటారు ? A. రేఖీయ చలనం B. కోణీయ చలనం C. సరళహరాత్మక చలనం D. ఏది కాదు 2 గమనంలో ఉన్న ఒక వస్తువు ఇవ్వబడిన కాలంలో ప్రయాణించిన దూరమును ఏమంటారు ? A. వడి B. వేగం C. స్థానభ్రంశం D. త్వరణం 3 గమనంలో ఉన్న ఒక వస్తువు ఇవ్వబడిన కాలంలో పొందిన స్థానభ్రంశంను ఏమంటారు ? A. వడి B. వేగం C. స్థానభ్రంశం D. త్వరణం 4 విమానాశ్రయం నుండి బయలుదేరిన విమానం యొక్క వేగం పెరగడం వలన దానికి త్వరణం కలుగు త్వరణం ఏది ? A. ధనత్వరణం B. రుణత్వరణం C. అపత్వరణం D. ఏది కాదు 5 గమనంలో ఉన్న వస్తువు సమవేగంతో ప్రయాణించుచన్నట్లయితే దాని త్వరణం ఏమవుతుంది ? A. అనంతం B. పెరుగును C. తగ్గును D. శూన్యం 6 కింది వాటిలో బలము నకు ప్రమాణాలు ఏవి ? A. వాట్ B. డైన్ C. న్యూటన్ D. b మరియు c 7 కింది వాటిలో "జడత్వం నియమం" అనునది దేనికి సంబందించినది ? A. న్యూటన్ మొదటి గమన నియమం B. న్యూటన్ రెండవ గమన నియమం C. న్యూటన్ మూడవ గమన నియమం D. b మరియు c 8 విరామస్థితిలో ఉన్న బస్సు ఒకేసారి ముందుకు కదిలినపుడు దానియందు గల ప్రయాణికులు వెనుకవైపు కదులుటకు కారణం ఏది ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 9 విరామస్థితిలో ఉన్న గుర్రం ఒకేసారి ముందుకు కదిలినపుడు దానిపై గల వ్యక్తి వెనుకవైపు కదులుటకు కారణం ఏది ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 10 చెట్టుపై ఫలాలు ఉన్న కొమ్మను ఊపినపుడు ఫలాలు నేలపై పడటానికి కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 11 దుప్పటిని విదిల్చినపుడు దాన్ని అంటుకొనిన దుమ్ము, ధూళి కణాలు క్రిందపడటానికి కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 12 గమనంలో నున్న బస్సులో నుండి దూకిన ప్రయాణికుడు ఆ బస్సుతో పాటు కొంతదూరం పరిగెత్తడానికి గల కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 13 ఒక లాంగ్ జంప్ చేసే అథ్లెట్ లాంగ్ జంప్ కు ముందు కొంత దూరం నుండి పరుగెత్తడానికి గల కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 14 ఫ్యాన్ స్విచ్ ను ఆపినప్పటికీ కొంత సేపు ఆ ఫ్యాన్ తిరగడానికి గల కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 15 బస్సు డ్రైవర్ బ్రేక్ వేసినపుడు ప్రయాణీకులు ముందువైపు పడడానికి గల కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 16 గమనంలో ఉన్న సైకిలు లేదా మోటారు సైకిలుకు ముందటి చక్రమునకు బ్రేకు వేస్తే అది పల్టీలు కొడుతుంది దీనికి గల కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 17 ఋజుమార్గంలో ప్రయాణించుచున్న ఒక బస్సు/కారు మలుపు తిరుగుచున్నపుడు దానిలో ఉండే ప్రయాణికుడు ఆవలివైపు తూలడానికి గల కారణం ఏమిటి ? A. జడత్వం B. విరామ జడత్వం C. గమన జడత్వం D. దిశా జడత్వం 18 న్యూటన్ రెండవ గమన నియమం దేనిని తెలుపుతుంది ? A. జడత్వం B. బలం C. చర్యకు ప్రతి చర్య D. దిశా జడత్వం 19 న్యూటన్ మొదటి గమన నియమం దేనిని తెలుపుతుంది ? A. జడత్వం B. బలం C. చర్యకు ప్రతి చర్య D. దిశా జడత్వం 20 న్యూటన్ మూడవ గమన నియమం దేనిని తెలుపుతుంది ? A. జడత్వం B. బలం C. చర్యకు ప్రతి చర్య D. దిశా జడత్వం 21 మానిసి నడవడం యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ? A. న్యూటన్ మొదటి గమన నియమం B. న్యూటన్ రెండవ గమన నియమం C. న్యూటన్ మూడవ గమన నియమం D. b మరియు c 22 మానిసి ఈదడం యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ? A. న్యూటన్ మొదటి గమన నియమం B. న్యూటన్ రెండవ గమన నియమం C. న్యూటన్ మూడవ గమన నియమం D. b మరియు c 23 పక్షి ఎగరడం యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ? A. న్యూటన్ మొదటి గమన నియమం B. న్యూటన్ రెండవ గమన నియమం C. న్యూటన్ మూడవ గమన నియమం D. b మరియు c 24 జెట్ విమానములు పనిచేయుట యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ? A. న్యూటన్ మొదటి గమన నియమం B. న్యూటన్ రెండవ గమన నియమం C. న్యూటన్ మూడవ గమన నియమం D. b మరియు c 25 తుపాకి పనిచేయుట యందు ఇమిడి ఉన్న న్యూటన్ గమననియమం ఏది ? A. న్యూటన్ మొదటి గమన నియమం B. న్యూటన్ రెండవ గమన నియమం C. న్యూటన్ మూడవ గమన నియమం D. b మరియు c 26 రాకెట్ నిర్మాణం మరియు పనిచేయుట యందు ఇమిడి ఉన్న నియమం ఏది ? A. ద్రవ్య వేగ నిత్యత్వనియమం B. శక్తినిత్యత్వనియమం C. బెర్నోలి నియమం D. పైవన్నీ 27 కింది వాటిలో ప్రచోదనము నాకు ప్రమాణాలు ఏవి ? A. Dyne sec B. Newton sec C. a మరియు b D. ఏది కాదు 28 జంపింగ్ పోటీలో దూకే వ్యక్తికి ఎటువంటి గాయాలు కావు దీనికి కారణం ? A. ప్రచోదనా ప్రభావం తగ్గడం B. ప్రచోదనా ప్రభావం పెరగడం C. అక్కడ ఇసకను పోయడం వల్ల D. ఏది కాదు 29 క్రికెట్ బంతిని పట్టుకొను సమయంలో ముందుకు చాచిన చేతులను క్రమక్రమముగా వెనుకకు తీసుకోవడం వలన బంతిని పట్టుకొను వ్యక్తికి ఎటువంటి గాయాలు కావు దీనికి కారణం ? A. ప్రచోదనా ప్రభావం తగ్గడం B. ప్రచోదనా ప్రభావం పెరగడం C. అక్కడ ఇసకను పోయడం వల్ల D. ఏది కాదు 30 రిజర్వాయర్ లోగల నీటికి ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 31 ఇంటి పై భాగం యందు గల ట్యాంక్ లోగల నీటికి ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 32 ఒక తీగను స్ప్రింగ్ వలె చుట్టగా చుట్టినపుడు దాని యందు ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 33 ఒక రబ్బరు పట్టీని సాగదీసినపుడు దాని యందు ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 34 ధనస్సు యందు బాణంను అమర్చి విల్లంబులను వెనక్కిలాగినపుడు దాని యందు ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 35 గమనంలో ఉన్న రాయికి ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 36 గమనంలో ఉన్న బంతికి ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 37 పేల్చిన తుపాకీగుండుకి ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 38 రంపపు మిల్లులో వేగంగా తిరిగే రంపంనకు ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 39 గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగమును రెండింతలు చేసినపుడు దాని గతిజశక్తి ఏమవుతుంది ? A. 2 రేట్లు B. 4 రేట్లు C. 3 రేట్లు D. మారదు 40 గగనతలంలో ఎగురుచున్న విమానం నకు ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 41 గమనంలో ఉన్న వాహనం యందు గల ప్రయాణికుడిలో ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 42 సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న గ్రహాలు లేదా గ్రహాల చుట్టూ పరిభ్రమించుచున్న ఉపగ్రహాలకు ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 43 రిజర్వాయర్ యందు గల నీరు జలపాతం వలె క్రిందికి పడుచున్నపుడు దానిలో ఎలాంటి శక్తి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 44 చిన్నపిల్లలు ఆడుకొను ఆట బొమ్మలయందు అమర్చిన ఘటములలోని రసాయనశక్తి అనునది ఏవిధంగా మారును ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. విద్యుత్ శక్తి 45 విద్యుత్ మోటారుల యందు విద్యుచ్చక్తి అనునది ఏవిధంగా మారును ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. యాంత్రికశక్తి D. రసానిక శక్తి 46 రేఖీయ స్థానభ్రంశము నకు ప్రమాణాలు ఏవి ? A. సెంటీమీటర్ B. డిగ్రీలు C. రేడియన్లు D. పైవన్నీ 47 కోణీయ స్థానభ్రంశము నకు ప్రమాణాలు ఏవి ? A. సెంటీమీటర్ B. డిగ్రీలు C. రేడియన్లు D. b మరియు c 48 ఒక రాయికి దారమును కట్టి వృత్తాకార మార్గంలో తిప్పుచున్నపుడు దానిపై ప్రయోగించే బలము ఏది ? A. అభికేంద్రబలము B. అపకేంద్రబలము C. a మరియు b D. యాంత్రిక బలము 49 సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్న గ్రహాలు లేదా గ్రహాల చుట్టూ పరిభ్రమించుచున్న ఉపప్రగహాలకు కావలసిన బలం ఏది ? A. అభికేంద్రబలము B. అపకేంద్రబలము C. a మరియు b D. యాంత్రిక బలము 50 మజ్జిగ నుండి వెన్నను వేరుచేయుటకు కావలసిన బలం ఏది ? A. అభికేంద్రబలము B. అపకేంద్రబలము C. a మరియు b D. యాంత్రిక బలము 51 వాషింగ్ మిషిన్, గ్రైండర్లు, మిక్సర్లు అనునవి ఏ సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి ? A. అభికేంద్రబలము B. అపకేంద్రబలము C. a మరియు b D. యాంత్రిక బలము 52 గుర్రపు స్వారి చేసేవాడు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే అవకాశం ఉంది. దీనికి కారణం? A. జడత్వ భ్రామకం B. ద్రవ్యరాశి నిత్యత్వ నియమం C. నిశ్చల జడత్వం D. న్యూటన్ 3వ గమన నియమం 53 ఒక క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకొనే ముందు చేతులు వెనుకకు లాగుతాడు ఎందుకంటే? A. బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది B. బంతి తక్కువ బలాన్ని కలుగజేస్తుంది C. బంతి త్వరణం చెందుతుంది D. బంతి నిశ్చలస్థితికి వస్తుంది 54 మీగడను వేరు చేసే యంత్రంలో ఎటువంటి బలం పనిచేస్తుంది? A. బాహ్యబలం B. కేంద్రక బలం C. అభికేంద్ర బలం D. అపకేంద్ర బలం 55 లిప్టులో ఉన్న వ్యక్తిపై పనిచేయు బలం ఏ సందర్భంలో ఎక్కువ? A. లిఫ్ట్ సమవేగంతో క్రిందికి వస్తునపుడు B. లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నపుడు C. లిఫ్ట్ త్వరణంలో క్రిందికి వస్తున్నప్పుడు D. లిఫ్ట్ త్వరణంలో పైకి వెళుతున్నపుడు 56 లిప్టులో ఉన్న వ్యక్తిపై పనిచేయు బలం ఏ సందర్భంలో తక్కువ? A. లిఫ్ట్ సమవేగంతో క్రిందికి వస్తునపుడు B. లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నపుడు C. లిఫ్ట్ త్వరణంలో క్రిందికి వస్తున్నప్పుడు D. లిఫ్ట్ త్వరణంలో పైకి వెళుతున్నపుడు 57 బస్సులో ప్రయాణించే వ్యక్తి మలుపు తిరిగేట పుడు వేరే వైపుకు పడతాడు. దీనికి కారణం ఏమిటి ? A. స్థిర జడత్వం B. వేగ జడత్వం C. దిశా జడత్వం D. గమన జడత్వం 58 అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేసే వస్తువు ఏది? A. కుక్కర్ B. స్కూ డ్రైవర్ C. సామాన్య లోలకం D. వాషింగ్ మిషన్ 59 ధనస్సులో సంధించిన బాణము ఈ క్రింది ఏ శక్తిని కలిగి ఉంటుంది ? A. స్థితిజశక్తి B. గతిజశక్తి C. ఘర్షణ శక్తి D. గురుత్వకర్షణ శక్తి 60 లిఫ్ట్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. సర్ హంప్రీ డేవిస్ B. మైకేల్ ఫారడే C. ఓటిస్ D. హెన్రీ సెలే 61 భూమికి అతి సమీపంలో పరిభ్రమించుచున్న ఒక కృత్రిమ ఉపగ్రహం యొక్క ఆవర్తనకాలం ఎంత ? A. 90 నిమిషాలు B. 94.5 నిమిషాలు C. 84.6 నిమిషాలు D. 94.6 నిమిషాలు You Have total Answer the questions Prev 1 Next