ఆధునిక భౌతిక శాస్త్రం | Physics | MCQ | Part -13 By Laxmi in TOPIC WISE MCQ Physics - ఆధునిక భౌతిక శాస్త్రం Total Questions - 66 1 పరమాణువును విభజించుట వీలు కాదని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. మాక్స్ ప్లాంక్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 2 పరమాణు కేంద్రకమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. మాక్స్ ప్లాంక్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 3 మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్ ను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. ప్లక్కర్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 4 ఎలక్ట్రాన్ ను ప్రయోగాత్మకంగా కనుగొనిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. ప్లక్కర్ C. రూథర్ ఫర్డ్ D. J.J థామ్సన్ 5 కాథోడ్ కిరణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. ప్లక్కర్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 6 ఎలక్రాన్కు రుణావేశం ఉంటుందని మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. పెర్రిన్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 7 ఎలక్ట్రాన్ ఆవేశ విలును ప్రయోగాత్మకంగా కనుగొనిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. మిల్లీ కాన్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 8 ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. హిట్టోర్ఫ్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 9 విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి ? A. రుజుమార్గంలో B. వక్ర మార్గంలో C. గోడ అంచులను తాకుతూ D. వంగి ప్రయాణిస్తాయి 10 ఎలక్ట్రాన్లు ఏ లోహము గుండా చొచ్చుకొని వెళ్ళినపుడు X-కిరణాలు ఉత్పత్తి అవుతాయి ? A. వెండి B. రాగి C. టంగ్ స్టన్ D. బంగారం 11 ఎలక్ట్రాన్ లు స్పటికాల గుండా ప్రయాణించినపుడు వివర్తనం చెందుతాయని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. జార్జ్ గాఫెట్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 12 ప్రొటాన్ ను ప్రయోగాత్మకంగా కనుగొనిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. పెర్రిన్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 13 విశ్వంలో గల ఏ వాయువులను శాశ్వతమయిన వాయువులుగా పరిగణిస్తారు ? A. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ B. హైడ్రోజన్ మరియు హీలియం C. హైడ్రోజన్ మరియు నైట్రోజన్ D. హీలియం మరియు నైట్రోజన్ 14 ఎటువంటి ఆవేశం లేని కణాలు ఏవి ? A. ఎలెక్ట్రాన్ లు B. ప్రొటాన్ లు C. న్యూట్రాన్ లు D. ఏది కాదు 15 విద్యుత్ క్షేత్రంలో మరియు అయస్కాంత క్షేత్రంలో రుజుమార్గంలో ప్రయాణించే కణాలు ఏవి ? A. ఎలెక్ట్రాన్ లు B. ప్రొటాన్ లు C. న్యూట్రాన్ లు D. ఏది కాదు 16 యురేనియం ను విచ్చిత్తి చెందించుట కొరకు ఏ కణాలను ఉపయోగిస్తారు ? A. ఎలెక్ట్రాన్ లు B. ప్రొటాన్ లు C. న్యూట్రాన్ లు D. ఏది కాదు 17 న్యూట్రాన్ యొక్క అయనీకరణ సామర్థ్యం ఎంత ? A. అనంతం B. ఎలెక్ట్రాన్ అయనీకరణ సామర్థ్యం కు సమానం C. ప్రొటాన్ అయనీకరణ సామర్థ్యం కు సమానం D. శూన్యం 18 ఒకే పరమాణు సంఖ్యను కలిగి, భిన్న ద్రవ్యరాశి సంఖ్యలను కలిగిన పరమాణువులను ఏమంటారు ? A. ఐసోటోనులు B. ఐసోటోపులు C. ఐసో బార్ D. పైవన్నీ 19 కింది వాటిలో గాయిటర్ వ్యాధిని నివారించడానికి ఉపయోగించే ఐసోటోపు ఏది ? A. రేడియో ఆక్సిజన్ B. రేడియో అయోడిన్ C. రేడియో సోడియం D. రేడియో కోబాల్ట్ 20 కింది వాటిలో మానవుని శరీరంగలోని రక్త సరఫరా యందు గల లోపాలను తెలుసుకొనుట కొరకు ఉపయోగించే ఐసోటోపు ఏది ? A. రేడియో ఆక్సిజన్ B. రేడియో అయోడిన్ C. రేడియో సోడియం D. రేడియో కోబాల్ట్ 21 కింది వాటిలో క్యాన్సర్ గడ్డలను కరిగించుటకొరకు ఉపయోగించే ఐసోటోపు ఏది ? A. రేడియో ఆక్సిజన్ B. రేడియో అయోడిన్ C. రేడియో సోడియం D. రేడియో కోబాల్ట్ 22 “Board of Radiation and Isotopic Technology" ఎక్కడ కలదు ? A. బెంగళూర్ B. చెన్నై C. ముంబాయి D. హైదరబాద్ 23 X-కిరణములను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. రాంట్ జన్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ స్టోని 24 X-కిరణముల యొక్క ఆవేశం ఎంత ? A. అనంతం B. ఎలక్ట్రాన్ ఆవేశానికి సమానం C. ప్రొటాన్ ఆవేశానికి సమానం D. శూన్యం 25 X-కిరణముల యొక్క అయనీకరణ సామర్థ్యం ఎంత ? A. అనంతం B. ఎలెక్ట్రాన్ అయనీకరణ సామర్థ్యం కు సమానం C. ప్రొటాన్ అయనీకరణ సామర్థ్యం కు సమానం D. శూన్యం 26 పైపులు, బాయిలర్లు, ఆనకట్టల యందు గల రంధ్రాలను లేదా పగుళ్లు స్థానమును గుర్తించుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ? A. మృదు X- కిరణాలు B. కఠిన X- కిరణాలు C. గామ కిరణాలు D. కాస్మిక్ కిరణాలు 27 విమానాశ్రయం, నౌకాశ్రయం మరియు దేశ సరిహద్దుల వద్ద ప్రయాణికుల లగేజిని తనిఖీ చేయుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ? A. మృదు X- కిరణాలు B. కఠిన X- కిరణాలు C. గామ కిరణాలు D. కాస్మిక్ కిరణాలు 28 స్మగ్లర్ల శరీరంలో ఉన్న మత్తు మందు, ఆభరణాలు, పేలుడు పదార్థాలను గుర్తించుట కొరకు ఉపయోగించే కిరణాలు ఏవి ? A. మృదు X- కిరణాలు B. కఠిన X- కిరణాలు C. గామ కిరణాలు D. కాస్మిక్ కిరణాలు 29 వైద్య రంగంలో ఉపయోగించే కిరణాలు ఏవి ? A. మృదు X- కిరణాలు B. కఠిన X- కిరణాలు C. గామ కిరణాలు D. కాస్మిక్ కిరణాలు 30 కాస్మిక్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. రాంట్ జన్ C. రూథర్ ఫర్డ్ D. విక్టర్ హెజ్ 31 కాస్మిక్ కిరణాల తీవ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ? A. భూమధ్యరేఖ వద్ద B. దృవాల వద్ద C. భూ ఉపరితలం పై D. శూన్యం లో 32 కాస్మిక్ కిరణాల తీవ్రత ఎక్కడ తక్కువగా ఉంటుంది ? A. దృవాల వద్ద B. భూమధ్యరేఖ వద్ద C. భూ ఉపరితలం పై D. శూన్యం లో 33 భారత మరియు అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి ప్రయోగించి కాస్మిక్ కిరణాలనుగూర్చి అధ్యయనం చేశారు ? A. KALPANA B. APARNA C. ANURADHA D. CHANDRAYAN 34 BLACK HOLE కు పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. రాంట్ జన్ C. రూథర్ ఫర్డ్ D. జాన్ వీలర్ 35 ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగింపబడు అతి పెద్ద ప్రమాణం ఏది ? A. kg B. amu C. csl D. గ్రాం 36 ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగింపబడు అతి చిన్న ప్రమాణం ఏది ? A. kg B. amu C. csl D. గ్రాం 37 అంతరిక్షం యందు వ్యోమగాములు ధరించు space suit ను ఏమంటారు ? A. Extra Terrestrial Management Unit B. Extra Terrestrial Mobile Unit C. Extra Vehicular Unit D. పైవన్నీ 38 వ్యోమగాములు చేయు space walk ను ఏమంటారు ? A. Extra Terrestrial Mobile Unit B. Extra Vehicular Activity C. Extra Vehicular Unit D. పైవన్నీ 39 సహజ రేడియోధార్మికత ధర్మాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. జాన్ డాల్టన్ B. రాంట్ జన్ C. రూథర్ ఫర్డ్ D. హెన్రీ బెకరల్ 40 సహజ రేడియోధార్మికత యందు వెలువడిన ఆల్ఫా , బీటా మరియు గామ కిరణాలను ఏమంటారు ? A. రేడియో తరంగాలు B. బెకరల్ కిరణాలు C. మృదు X- కిరణాలు D. కఠిన X- కిరణాలు 41 విద్యుత్ అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందని కిరణాలు ఏవి ? A. ఆల్ఫా కిరణాలు B. బీటా కిరణాలు C. గామ కిరణాలు D. పైవన్నీ 42 కింది వాటిలో ఒక పదార్థం యందు రేడియోధార్మిక కిరణాలు చొచ్చుకుని వెళ్ళు సామర్థ్యం వేటికి ఎక్కువగా ఉంటుంది ? A. ఆల్ఫా కిరణాలు B. బీటా కిరణాలు C. గామ కిరణాలు D. పైవన్నీ 43 సహజ రేడియోధార్మికతకు గల SI ప్రమాణాలు ఏవి ? A. రూథర్ ఫర్డ్ B. క్యూరీ C. బెకరల్ D. పైవన్నీ 44 ఐన్ స్టీన్ చేసిన ఏ పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించినది ? A. ద్రవ్యరాశి శక్తి తుల్యతానియమం B. సాపేక్ష సిద్ధాంతం C. కాంతి విద్యుత్ ఫలిత సమీకరణం D. పైవన్నీ 45 ధోరియం నిల్వల రిత్యా ప్రపంచంలో మొదటి స్తానంలో ఉన్న దేశం ఏది ? A. ఇండియా B. రష్యా C. చైనా D. అమెరికా 46 “Yellow cake” అని దేనిని పిలుస్తారు ? A. ధోరియం B. యురేనియం C. ప్లూటోనియం D. పైవన్నీ 47 కాలమును కొలవడానికి ఉపయోగింపబడు అతిపెద్ద ప్రమాణం ఏది ? A. SHAKE B. కాస్మిక్ సంవత్సరం C. సెకన్ D. కాంతి సంవత్సరం 48 కాలమును కొలవడానికి ఉపయోగింపబడు అతి చిన్న ప్రమాణం ఏది ? A. SHAKE B. కాస్మిక్ సంవత్సరం C. సెకన్ D. కాంతి సంవత్సరం 49 అణురియాక్టర్ నిర్మాణం యందు ఇమిడి ఉన్న సూత్రం ఏది ? A. కేంద్రక విచ్ఛిత్తి B. కేంద్రక సంలీనం C. కేంద్రక విలీనం D. a మరియు b 50 "అణురియాక్టర్ల పితామహుడు" అని ఎవరిని అంటారు ? A. రూథర్ ఫర్డ్ B. ఫెర్మి C. క్యూరీ D. బెకరల్ 51 అణురియాక్టర్ల లో మితకారిణిగా వాడేది ? A. బారజలం B. క్లోరిన్ C. తటస్థ నీరు D. పాదరసం 52 భారజలంను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. యూరే B. ఫెర్మి C. క్యూరీ D. బెకరల్ 53 అణురియాక్టర్ల లో నియంత్రకారిగా వాడేది ? A. కాడ్మియం B. బారజలం C. క్లోరిన్ D. తటస్థ నీరు 54 హైడ్రోజన్ బాంబ్ ను ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు ? A. కేంద్రక విచ్ఛిత్తి B. కేంద్రక సంలీనం C. కేంద్రక విలీనం D. a మరియు b 55 కృత్రిమ సూర్యుడు లోని చర్య ఏది ? A. కేంద్రక సంలీనం B. కేంద్రక విచ్ఛిత్తి C. రసాయన చర్య D. కేంద్రక విలీనం 56 విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో రుజు మార్గంలో ప్రయాణించే కిరణాలు ఏవి ? A. ఎక్స్ B. గామా C. కాంతి D. పైవన్నీ 57 మొదటి న్యూక్లియర్ రియాక్టర్ను నిర్మించింది? A. రూథర్ ఫర్డ్ B. ఐన్ స్టీన్ C. హెచ్ జె బాబా D. ఫెర్మి 58 క్రింది వానిలో అణుబాంబు పితామహుడు? A. రూథర్ ఫర్డ్ B. ఒపెన్ హైమర్ C. ఐన్ స్టీన్ D. ఫెర్మి 59 ఎక్స్ కిరణాల ఉత్పత్తిలో ఉపయోగించే కణాలు ? A. ఎలక్ట్రాన్లు B. అయాన్లు C. ప్రోటాన్లు D. న్యూట్రాన్లు 60 భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్త ఎవరు ? A. రాంట్జెన్ B. రూథర్ ఫర్డ్ C. మిల్లికాన్ D. ఐన్ స్టీన్ 61 న్యూక్లియర్ పరిమాణాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు? A. ఆంగ్ స్ట్రామ్ B. ఫెర్మి C. మైక్రోమీటర్ D. నానోమీటర్ 62 మానవుడు ఆవిష్కరించిన తొలి ప్రాథమిక కణం ఏది ? A. ఎలక్ట్రాన్లు B. పాజిట్రాన్ C. ప్రోటాన్లు D. న్యూట్రాన్లు 63 కింది వాటిలో కృత్రిమ రేడియో ధార్మిక మూలకం కానిది ? A. ఫెర్మియం B. ఫ్లూటోనియం C. క్యూరియం D. థోరియం 64 భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరు? A. సర్ సివి రామన్ B. అబ్దుల్ కలాం C. హెచ్ జె బాబా D. విక్రం సారాబాయి 65 సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశకత్వాన్ని పొందడానికి కారణమయ్యే చర్య ఏది ? A. కేంద్రక విలీనం B. కేంద్రక విచ్ఛిత్తి C. కేంద్రక సంలీనం D. పైవన్నీ 66 ఉష్ణ కేంద్రక ఆయుధంగా ఏ బాంబును పిలుస్తారు ? A. నానోబాంబు B. న్యూట్రాన్ బాంబు C. అణుబాంబు D. హైడ్రోజన్ బాంబు You Have total Answer the questions Prev 1 Next