ద్రావణాలు | Chemistry | MCQ | Part -5 By Laxmi in TOPIC WISE MCQ Chemistry Total Questions - 19 1. కింది వాటిలో "కొలాయిడ్ " లకు ఉదాహరణ ఏది ? A. గ్రుడ్డులోని తెల్లని భాగం B. జిగురు C. జీలాటిన్ D. పైవన్నీ 2. కింది వాటిలో "విశ్వద్రావణి " అని దేనిని అంటారు ? A. ఆల్కహాల్ B. నత్రిక్ ఆమ్లము C. నీరు D. భారజలము 3. వర్షపు నీటి యొక్క pH విలువ ఎంత ? A. 5.6 B. 7.6 C. 6.6 D. 4.6 4. సముద్రపునీరు యొక్క pH విలువ ఎంత ? A. 7.8 B. 7.6 C. 6.6 D. 4.6 5. "ప్రతిలోమ ద్రవాభిసరణ" అనగా ఏమిటి ? A. మంచినీరుని సముద్రపునీటిగా మార్చే ప్రక్రియ B. సముద్రపునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ C. వర్షపు నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ D. పైవన్నీ 6. "Central Salt and Marine Chemicals Research Institute" ఎక్కడ ఉంది ? A. గుజరాత్ B. గోవా C. మహారాష్ట్ర D. కేరళ 7. "కఠినజలం" అనగా ? A. తాగతనికి వీలులేని నీరు B. సబ్బులతో నురగను ఇచ్చే నీరు C. సబ్బులతో నురగను ఇవ్వని నీరు D. తాగే నీరు 8. మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళు రసాయనికంగా ? A. కాల్షియం ఆక్టరేట్ స్ఫటికాలు B. కాల్షియం పాస్పేట్ స్ఫటికాలు C. యూరిక్ ఆమ్ల స్ఫటికాలు D. పైవన్నీ 9. కింది వాటిలో తాత్కాలిక కాఠిన్యతను నివారించే పద్దతులు ఏవి ? A. నీటిని మరిగించడం B. నీటికి తడిసున్నం కలపడం C. క్లార్క్ పద్దతి D. పైవన్నీ 10. " క్లార్క్ పద్దతి " దేనికోసం ఉపయోగపడును ? A. తాత్కాలిక కాఠిన్యతను నివారించుటకు B. సముద్రపునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ C. శాశ్వత కాఠిన్యతను నివారించుటకు D. వర్షపు నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ 11. కింది వాటిలో చాకలిసోడా అనగా ? A. సోడియం హైడ్రాక్సైడ్ B. సోడియం కార్బోనేట్ C. సోడియం క్లోరైడ్ D. సోడియం హెక్టామెటా పాస్పేట్ 12. కింది వాటిలో కాస్టిక్ సోడా అనగా ? A. సోడియం హైడ్రాక్సైడ్ B. సోడియం కార్బోనేట్ C. సోడియం క్లోరైడ్ D. సోడియం హెక్టామెటా పాస్పేట్ 13. "కాల్షాన్ పద్ధతి " దేనికోసం ఉపయోగపడును ? A. తాత్కాలిక కాఠిన్యతను నివారించుటకు B. సముద్రపునీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ C. శాశ్వత కాఠిన్యతను నివారించుటకు D. వర్షపు నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ 14. "కాల్షాన్ పద్ధతి" లో ఉపయోగించే లవణం ఏది? A. సోడియం హైడ్రాక్సైడ్ B. సోడియం కార్బోనేట్ C. సోడియం క్లోరైడ్ D. సోడియం హెక్టామెటా పాస్పేట్ 15. కింది వాటిలో డిటర్జెంట్స్ యొక్క లక్షణాలు ? A. ఫాటీ ఆమ్లాల బెంజీన్ సల్ఫోనేట్ సోడియం లవణాలు B. నీటి కాఠిన్యాన్ని తొలగిస్తాయి C. కఠినజలంతో కూడా నురుగను ఉత్పన్నం చేయును D. పైవన్నీ 16. ఏనుగు దంతాల రంగు పోగొట్టడానికి ఏ ద్రావణం ఉపయోగిస్తారు ? A. సోడియం హైడ్రాక్సైడ్ B. హైడ్రోజన్ పెరాక్సైడ్ C. సోడియం కార్బోనేట్ D. సోడియం క్లోరైడ్ 17. వెంట్రుకల రంగును బంగారు వర్ణంలోకి మార్చడానికి ఏ ద్రావణం ఉపయోగిస్తారు ? A. సోడియం హైడ్రాక్సైడ్ B. హైడ్రోజన్ పెరాక్సైడ్ C. సోడియం కార్బోనేట్ D. సోడియం క్లోరైడ్ 18. తటస్థ ద్రావణం యొక్క pH విలువ ఎంత ? A. 5 B. 6 C. 7 D. 8 19. యాంటిసెప్టిక్ గా ఉపయోగించే రసాయనం పేరు ? A. బోరికామ్లము B. ఎసిటికామ్లం C. ఆస్కార్బిక్ ఆమ్లం D. హైడ్రోక్లోరిక్ ఆమ్లం You Have total Answer the questions Prev 1 Next