ప్రాధమిక విధులు | Polity | MCQ | Part -9 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Fundamental Duties Total Questions - 23 44. ప్రాథమిక విధులను, ఏ కమిటీ సిఫారసుల మేరకు దేశంలో అంతరంగిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నపుడు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? A. సర్దార్ స్వర్ణసింగ్ కమిటీ B. జెవిపీ కమిటీ C. రాజ మన్నార్ కమిటీ D. భూరియా కమిటీ 45. క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది? A. రాజ్యాంగానికి లోబడి దాని ఆశాయాలను,హక్కులను,జాతీయ జెండాను,జాతీయ గీతాన్ని గౌరవించడం B. భారతదేశపు ఏకత్వాన్ని,సమైఖ్యతను,సార్వభౌమాధికారాన్ని పరీక్షించడం C. దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడడం D. కుల మత జన్మస్థల లింగ జాతి వంటి విచక్షణ నిషేదం 46. క్రింది వాటిలో ప్రాథమిక విధి ఏది? A. దేశ సంస్కృతిని కాపాడుట B. ప్రభుత్వ ఆస్తిని కాపాడుట,హింసను విడనాడటం C. సహజ పరిసరాలు,వన్య మృగాలను పరిరక్షించి అభివృద్ది పరచడం D. పైవన్ని 47. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? A. ఎనమిది B. తొమ్మిది C. పది D. పదకొండు 48. క్రింది వాటిలో ప్రాథమిక విధుల లక్షణాలేవి? A. ప్రాథమిక విధుల కు న్యాయ సంరక్షణ లేదు B. ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి C. ప్రాథమిక విధులు సలహా పూర్వకమైనవి మాత్రమే D. పైవన్ని 49. ప్రాథమిక విధులు,హక్కులు ఒకే నాణేనికి ఉన్న ఇరు ప్రక్కలు అని వ్యాఖ్యానించింది ఎవరు? A. ఎన్.ఎ పాల్కివాలా B. సి.కె.దఫ్తారి C. డి.కె.బారువా D. హెచ్.జె.లాస్కీ 50. ప్రాథమిక విధులు అసంగతమై ఉన్నాయి. అని వ్యాఖ్యానించింది ఎవరు? A. డి.కె.బారువా B. ఎన్.ఎ పాల్కివాలా C. కె.పి.ముఖర్జీ D. డి.డి.బసు 51. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం అవసరం. అని వ్యాఖ్యానించింది ఎవరు? A. హెచ్.జె.లాస్కీ B. గాంధీ జీ C. సి.కె.దఫ్తారి D. డి.కె.బారువా 52. ప్రాథమిక విధులు కేవలం నైతిక సలహాల వంటివి. అని వ్యాఖ్యానించింది ఎవరు? A. డి.కె.బారువా B. కె.పి.ముఖర్జీ C. డి.డి.బసు D. బర్జెస్ 53. జాతీయ చిహ్నాల గౌరవ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు? A. 1950 B. 1951 C. 1952 D. 1953 54. ప్రాథమిక విధులు కేవలం అలంకార ప్రాయమే,ఎందుకంటే వాటిని పాటించనివారి పై ఎలాంటి చర్యలను పేర్కొనలేదని వ్యాఖ్యానించింది ఎవరు? A. బర్జెస్ B. సి.కె.దఫ్తారి C. హెచ్.జె.లాస్కీ D. కె.పి.ముఖర్జీ 55. వన్య ప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1955 B. 1971 C. 1972 D. 1974 56. ఆదేశ సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధి పై ఆధారపడినట్లే ప్రాథమిక విధుల పాటింపు అనేది కూడా పౌరుల చిత్తశుద్ధి పై ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యానించింది ఎవరు? A. డి.డి.బసు B. డి.కె.బారువా C. ఎన్.ఎ పాల్కివాలా D. హెచ్.జె.లాస్కీ 57. నీటి కాలుష్య నివారణ చట్టం" ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1950 B. 1971 C. 1972 D. 1974 58. హక్కులు మరియు విధులను విడదిస్తే అవి వికలాంగులుఅని వ్యాఖ్యానించింది ఎవరు? A. బర్జెస్ B. డి.డి.బసు C. కె.పి.ముఖర్జీ D. సి.కె.దఫ్తారి 59. అటవీ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1971 B. 1972 C. 1974 D. 1980 60. ప్రతి పౌరుడు హక్కులను అనుభవించుటకు గల అర్హత,విధులను సక్రమంగా నెరవేర్చడమేనని అభిప్రాయపడిన వారు ఎవరు? A. డి.డి.బసు B. కె.పి.ముఖర్జీ C. గాంధీ జీ D. బర్జెస్ 61. పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1980 B. 1983 C. 1985 D. 1986 62. బాల కార్మిక చట్టం" ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1983 B. 1984 C. 1986 D. 1987 63. బాల్యవివాహాల నిషేధ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1925 B. 1927 C. 1928 D. 1929 64. ఏ కేసు లో జాతీయగీతం పాడడం తప్పనిసరి కాదని,పాడేలా ఆదేశాలు జారీచేయడం కూడా సాధ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది? A. నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004) B. బిజోయ్ ఇమ్నాన్యుయెల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1986) C. a మరియు b D. ఎయిమ్స్ యాజమాన్యం vs విధ్యార్థి యూనియన్ కేసు (2002) 65. ఏ కేసులో ప్రాథమిక విధులు విస్మరించదగినవి కాదని,వాటిని గౌరవించి,పాటించాల్సిన భాధ్యత పౌరులందరి పైనా ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది? A. ఇండియన్ ఎన్విరాన్మెంటల్ లీగల్ ఎయిడ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు B. ఎయిమ్స్ యాజమాన్యం vs విధ్యార్థి యూనియన్ కేసు (2002) C. నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004) D. ఏది కాదు 66. ఏ కేసులో జాతీయ జెండాను ఎగుర వేయడం కూడా భావవ్యక్తీకరణ కిందకు వస్తుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది? A. నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004) B. ఇండియన్ ఎన్విరాన్మెంటల్ లీగల్ ఎయిడ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు C. శ్యామ్ నారాయణ్ చేక్సీ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2003) D. బిజోయ్ ఇమ్నాన్యుయెల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1986) 67. ఏ కేసులో జాతీయ గీతాన్ని సినిమాల వంటి ప్రసార సాధనాల్లో ఉపయోగించరాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది? A. శ్యామ్ నారాయణ్ చేక్సీ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2003) B. నవిన్ జిందాల్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2004) C. ఎయిమ్స్ యాజమాన్యం vs విధ్యార్థి యూనియన్ కేసు (2002) D. బిజోయ్ ఇమ్నాన్యుయెల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1986) You Have total Answer the questions Prev 1 Next