ఆదేశ సూత్రాలు | Polity | MCQ | Part -10 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Directive Principles Total Questions - 50 68. భారత రాజ్యాంగంలో 4 వ భాగంలో నిబంధన 36 నుండి నిబంధన 51 వరకు గల 16 నిబంధనలలో వేటిని పేర్కొన్నారు? A. ప్రాథమిక హక్కులు B. ఆదేశ సూత్రాలు C. ప్రాథమిక విధులు D. పైవన్ని 69. ఆదేశ సూత్రాలు ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడినవి? A. ఐర్లాండ్ రాజ్యాంగం B. అమెరికా రాజ్యాంగం C. బ్రిటన్ రాజ్యాంగం D. ఏది కాదు 70. భారత ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగంలోని ఏ ఆదేశ సూత్రాలను పోలి ఉన్నాయి? A. సాంస్కృతిక విధాన B. సాంఘీక విధాన C. సామాజిక విధాన D. ఆర్థిక విధాన 71. ఆధునిక రాజ్యాంగాలలో ఇలా ఆదేశ సూత్రాలను పేర్కొనడం ఒక కొత్త పోకడ అని వర్ణించినది ఎవరు? A. ఐవార్ జెన్నింగ్స్ B. కె.టి.షా C. డా.బి.ఆర్ అంబేద్కర్ D. వి.టి.కృష్ణ మాచారి 72. ఆదేశ సూత్రాలు ఏ సంరక్షణ లేని హక్కులు? A. ప్రభుత్వ సంరక్షణ B. న్యాయ సంరక్షణ C. సామాజిక సంరక్షణ D. ఆర్థిక సంరక్షణ 73. ఆదేశ సూత్రాల ప్రధాన లక్ష్యం ఏది? A. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం B. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం C. a మరియు b D. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడం 74. కింది వాటిలో ఆదేశ సూత్రాల లక్షణాలేవి? A. ప్రభుత్వ ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి ఇవి అమలు చేయబడతాయి B. ఇవి ప్రభుత్వవిధులను ,భాధ్యతలను తెలుపుతాయి. C. ఇవి రాజ్యకలపాల పరిధిని విస్తృతం చేస్తాయి. D. పైవన్నీ 75. ఆదేశ సూత్రాలను "బ్యాంక్ సౌకర్యం ప్రకారం చెల్లింపదగిన చెక్కు వంటిదని ,విలువ లేని అనవసర సూత్రాలని" వర్ణించినది ఎవరు? A. బి.ఎన్.రావ్ B. డా.బి.ఆర్ అంబేద్కర్ C. సి.కె.దఫ్తారి D. ప్రొ.కె.టి.షా 76. నిర్ధేశిక నియమాలు ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభ రోజున తీసుకునే తీర్మానాల వంటివి. జనవరి 2 వ తేదీనే భంగమవుతాయి అని తన అభిప్రాయాన్ని చెప్పినది ఎవరు? A. నసీరుద్దీన్ షా B. ప్రొ.కె.టి.షా C. ఎం.సి.ఛాగ్లా D. బి.ఎన్.రావ్ 77. ప్రాథమిక విధులు,హక్కులు ఒకే నాణేనికి ఉన్న ఇరు ప్రక్కలు అని వ్యాఖ్యానించింది ఎవరు? A. ఎన్.ఎ పాల్కివాలా B. సి.కె.దఫ్తారి C. డి.కె.బారువా D. హెచ్.జె.లాస్కీ 78. నిర్ధేశిక నియమాలను సంపూర్ణంగా అమలు చేస్తే భారతదేశం భూతల స్వర్గమవుతుంది అని పేర్కొన్నది ఎవరు? A. డి.కె.బారువా B. గాంధీ జీ C. నసీరుద్దీన్ షా D. ఎం.సి.ఛాగ్లా 79. నిర్ధేశిక నియమాలను,నైతిక ప్రవచనాలను, అధికారాలను ప్రభుత్వం గౌరవించాలి అని పేర్కొన్నది ఎవరు? A. డా.బి.ఆర్ అంబేద్కర్ B. సి.కె.దఫ్తారి C. బి.ఎన్.రావ్ D. గాంధీ జీ 80. ఏవారు ఆదేశ సూత్రాల ను, వాటి మౌలిక స్వభావాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించారు? A. ప్రొఫెసర్ M.P శర్మ B. M.N జోషి C. a మరియు b D. ప్రొఫెసర్ కె.టి.షా 81. ఆదేశ సూత్రాలను, వాటి మౌలిక స్వభావాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? A. 2 రకాలు B. 3 రకాలు C. 4 రకాలు D. 5 రకాలు 82. భారతదేశంలో సామాజిక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆదేశ సూత్రాల్లో చేర్చబడినవి ఏవి? A. గాంధేయ నియమాలు B. ఉదారవాద నియమాలు C. సామ్యవాద నియమాలు D. పైవన్ని 83. రాజ్యాంగంలో 38,39,41,42,43,46,47 నిబంధనలు ఆదేశ సూత్రాల యొక్క ఏ భావాలను వివరిస్తాయి? A. ఉదారవాద భావాలను B. గాంధేయవాద భావాలు C. న్యాయ భావాలు D. సామ్యవాద భావాలు 84. ప్రజలందరికీ న్యాయం చేకూరే పద్దతిలో ఒక సామాజిక క్రమాన్ని నెలకొల్పడం ద్వారా ప్రజా సంక్షేమాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలిపే ఆదేశ సూత్ర నిబంధన ఏది? A. 38 వ నిబంధన B. 39 వ నిబంధన C. 41 వ నిబంధన D. 42 వ నిబంధన 85. ఆదేశ సూత్రాల్లో 39 వ నిబంధన వేటి కొరకు చర్యలు తీసుకోవాలని తెలుపుతుంది? A. ప్రజలందరికీ తగిన జీవన భృతిని కల్పించడం B. జాతీయ సంపదను వికేంద్రీకరించుట C. కార్మికుల,పురుషుల,మహిళల,సంపదను ,శక్తిని సంరక్షిచడం D. పైవన్ని 86. ఆదేశ సూత్రాల్లో ఏ నిబంధన లో పని హక్కును, విద్యాహక్కును వినియోగించుకునేటట్లు చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు? A. 38 వ నిబంధన B. 41 వ నిబంధన C. 42 వ నిబంధన D. 43 వ నిబంధన 87. ఆదేశ సూత్రాల్లో 42 వ నిబంధన లో ఏమి పేర్కొన్నారు? A. కార్మికులు పనిచేసేందుకు తగిన మానవీయ పరిస్థితులను కల్పించడం B. స్త్రీ లకు ప్రస్తుతి సౌకర్యాలను కల్పించడం C. a మరియు b D. దేశ సంస్కృతిని కాపాడటం 88. కింది వాటిలో ఆదేశ సూత్రాలకు సంబందించిన కేసులు ఏవి? A. రణధీర్ సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా B. ఎం.సి.మెహతా vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు C. a మరియు b D. ఇందిరా సహాని vs యూనియన్ ఆఫ్ ఇండియా 89. ఆదేశ సూత్రాలలో 43 వ నిబంధన లో ఏమి పేర్కొన్నారు? A. కార్మికులందరికి కనీస జీవన వేతనం,మెరుగైన పని నిబంధనలు B. సామాజిక,సాంస్కృతిక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది C. ప్రభుత్వ ఆస్తిని కాపాడటం,హింసను విడనాడటం D. a మరియు b 90. భారతదేశంలో ఆదర్శపాలనను అందించి రామరాజ్య స్థాపన"చేయాలి అని ప్రవచించినది ఎవరు? A. గాంధీ జీ B. శ్రీనివాసన్ C. ఎం.సి.ఛాగ్లా D. రాజ్ నారాయణ్ 91. కింది వాటిలో గాంధేయవాద నియమాలేవి? A. ప్రభుత్వం గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి,అధికారాలు కల్పించి,వాటిని స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలి B. మత్తు పానీయాలను నిషేదించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి C. వ్యవసాయం,పాడి పరిశ్రమలను శాస్త్రీయా పద్దతిలో నిర్వహించాలి D. పైవన్ని 92. కార్మికులకు కనీస వేతనాల చట్టం ఎప్పుడు అమలు చేశారు? A. 1948 B. 1949 C. 1950 D. 1951 93. బాలలకోసం బాలకార్మిక చట్టం ఎప్పుడు అమలు చేశారు? A. 1965 B. 1972 C. 1985 D. 1986 94. ప్రసూతి రక్షణ చట్టం ఎప్పుడు అమలు చేశారు? A. 1949 B. 1950 C. 1955 D. 1961 95. బ్యాంకుల జాతీయకరణ ఎప్పుడు అమలు చేశారు? A. 1961 B. 1965 C. 1969 D. 1976 96. అస్పృశ్యత నివారణ చట్టం ఎప్పుడు అమలు చేశారు? A. 1950 B. 1952 C. 1955 D. 1961 97. పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అమలు చేశారు? A. 1971 B. 1972 C. 1955 D. 1976 98. కనీస అవసరాల పథకం ఎప్పుడు అమలు చేశారు? A. 1969 B. 1971 C. 1974 D. 1976 99. సమగ్ర గ్రామీణ అభివృద్ది పథకం " ఎప్పుడు అమలు చేశారు? A. 1955 B. 1965 C. 1974 D. 1978 100. స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ శాంతి మొదలగు వాటికి సంబంధించిన నియమాలేవి? A. సామ్యవాద నియమాలు B. గాంధేయవాద నియమాలు C. ఉదారవాద నియమాలు D. పైవన్ని 101. ఆదేశ సూత్రాలలో 44 వ నిబంధన దేనిని సూచిస్తుంది? A. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది B. భారతదేశపు ఏకత్వాన్ని,సమైఖ్యతను,సార్వభౌమ అధికారాన్ని పరీక్షించడం C. నేర స్థాపన విషయంలో తగిన రక్షణ D. బలవంతపు చాకిరీ,మనుషులతో వ్యాపారం మొదలైనవి నిషేదం 102. ఆదేశ సూత్రాలలో ఏ నిబందన, పిల్లల సంరక్షణ మరియు ఆరు సంవత్సరాల వరకు ప్రాథమిక విద్య ను ప్రభుత్వం అందిచాలని సూచిస్తుంది? A. 44 వ నిబందన B. 45 వ నిబంధన C. 50 వ నిబంధన D. 51 వ నిబంధన 103. ఆదేశ సూత్రాల 51 వ నిబంధన ఏమి పేర్కొన్నది? A. అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం B. దేశాల మధ్య సత్సబంధాలు నెలకొల్పడం C. అంతర్జాతీయ చట్టాలను ,ఒప్పందాలను గౌరవించి ఆరచరించడం D. పైవన్నీ 104. 1918 వ సం,లో ఏ నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో "బ్రిటిష్ పౌరులకు ఉన్నట్లే భారతీయ ప్రజలకు హక్కులుండాలని "తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది? A. బొంబాయి B. బెంగూళూర్ C. కలకత్తా D. విశాఖపట్నం 105. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరం లో స్థాపించబడింది? A. 1992 B. 1993 C. 1995 D. 1997 106. 1895 వ సంవత్సరం లో "స్వరాజ్" అనే బిల్లును పతిపాదించినది ఎవరు? A. అనిబిసెంట్ B. గాంధీ జీ C. బాల గంగాధర్ తిలక్ D. డా.బి.ఆర్ అంబేద్కర్ 107. పని హక్కు అనునది? A. ప్రాథమిక హక్కు మరియు NREGA క్రింద హక్కు B. కేవలం NREGA క్రింద హక్కు C. ప్రాథమిక హక్కు D. ఆదేశిక సూత్రం మరియు NREGA క్రింద హక్కు 108. పౌరులకు కల్పించే సంస్కృతిక మరియు విద్యాహక్కుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏది? A. భారతదేశ సంస్కృతి ని మరియు వారసత్వాన్ని పరిరక్షించుటకు B. మైనారిటీల సంస్కృతి పరిరక్షించుటకు C. భారతదేశం లో ఒకే రకం సంస్కృతి వృద్ది చేయుటకు D. పై వన్నీ 109. భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు వర్తించని రాష్ట్రం ఏది? A. మణిపూర్ B. ఉత్తరాఖండ్ C. అరుణాచల్ ప్రదేశ్ D. జమ్ము కాశ్మీర్ You Have total Answer the questions Prev 1 Next