గిరిజన ప్రాంతాల పరిపాలన | Polity | MCQ | Part -43 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 1. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో నిబంధన 244 షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన తీరు గురించి పేర్కొంది? A. 10 B. 9 C. 11 D. 12 2. ప్రతి సంవత్సరం తమ రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన పై ఎవరు రాష్ట్రపతికి నివేదిక ను పంపాలి? A. ప్రధాన మంత్రి B. ఉప రాష్ట్రపతి C. గవర్నర్ D. రాష్ట్రపతి 3. షెడ్యూల్డ్ ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలోనూ ఏమి ఏర్పాటు చేయాలి? A. షెడ్యూల్ తెగల కార్యాలయం B. షెడ్యూల్ తెగల సలహా మండలి C. షెడ్యూల్ తెగల సముదాయం D. పైవన్నీ 4. షెడ్యూల్డ్ తెగల సలహా మండలి లో సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? A. 18 B. 19 C. 20 D. 21 5. షెడ్యూల్డ్ తెగల సలహా మండలి లో సభ్యుల సంఖ్య 20 ఉండాలి. వీరిలో ఎన్నవ వంతు మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన శాసనసభ్యులై ఉండవలెను? A. 4/5 వ వంతు B. 2/3 వ వంతు C. 1/2 వ వంతు D. 3/4 వ వంతు 6. షెడ్యూల్డ్ తెగల సలహా మండలి లో గవర్నర్ కు గల అధికారాలేవీ? A. అధ్యక్షుడిని మరియు సభ్యులను నియమిస్తాడు B. సమావేశాల అజెండాను నిర్ణఇస్తాడు C. షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించు శాసనాలపై నిర్ణయాధికారం D. పైవన్ని 7. గవర్నర్ షెడ్యూల్డ్ తెగల సలహా మండలిని సంప్రదించి మాత్రమే నిబంధనలు రూపొందించాలి ఈ నిబంధనను ఎవరి ఆమోదానికి పంపాలి? A. ముఖ్య మంత్రి B. ప్రధాన మంత్రి C. గిరిజన శాఖ మంత్రి D. రాష్ట్రపతి 8. షెడ్యూల్డ్ తెగల పై పూర్తి అధికారాలు వేటికి మాత్రమే ఉంటాయి? A. కేంద్ర ప్రభుత్వానికి B. రాష్ట్ర ప్రభుత్వానికి C. సలహా మండలికి D. పైవన్ని 9. గవర్నర్ తో సంప్రదించి షెడ్యూల్డ్ ఏరియా పరిధిని ఎవరు విస్తరించవచ్చు? A. గిరిజన శాఖ మంత్రి B. ఉప రాష్ట్రపతి C. రాష్ట్రపతి D. ప్రధాన మంత్రి 10. షెడ్యూల్డ్ తెగల వారు ఎక్కడ నివసిస్తారు? A. నగర ప్రాంతంలో B. గ్రామీణ ప్రాంతంలో C. అటవీ ప్రాంతంలో D. a మరియు b 11. షెడ్యూల్డ్ తెగల వారికి చెందిన భూములను ఇతరులు కొనకుండా వారికి రక్షణ కల్పిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏ చట్టం చేసింది? A. 1/60 చట్టం B. 1/50 చట్టం C. 1/40 చట్టం D. 1/70 చట్టం 12. అస్సాం ,మేఘాలయ,త్రిపుర మరియు మిజోరాంలలో షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతముల పరిపాలనకు సంబంధించిన నిబంధనలేవి? A. 224(2) B. 275(1) C. 244(4) D. a మరియు b 13. అస్సాం లో స్వయం ప్రతిపత్తి గల జిల్లాలేవి? A. ఉత్తర కాచార్ హిల్స్ జిల్లా B. కార్బీ అంగ్ లాంగ్ జిల్లా C. a మరియు b D. ఖాసి హిల్ల్స్ జిల్లా 14. మేఘాలయాలో స్వయం ప్రతిపత్తి గల జిల్లాలేవీ? A. ఖాసిహిల్ల్స్ జిల్లా B. జాంతియా హిల్ల్స్ జిల్లా C. గారి హిల్ల్స్ జిల్లా D. పైవన్ని 15. మిజోరాం లో స్వయం ప్రతిపత్తి గల జిల్లాలేవీ? A. చక్మా జిల్లా B. లక్ హర్ జిల్లా C. లాయి జిల్లా D. పైవన్ని 16. స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో ఏదైనా ప్రాంతాన్ని కలపడం,ఏ ప్రాంతానైన తీసివేయడం మొదలగు అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధాన మంత్రి D. ముఖ్య మంత్రి 17. ప్రతీ స్వయం ప్రతిపత్తి గల జిల్లా కు ఒక జిల్లా మండలి ఉంటుంది,ఆ జిల్లా మండలిలో ఎంత మంది సభ్యులు ఉండాలి? A. 20 B. 25 C. 27 D. 30 18. ప్రతీ స్వయం ప్రతిపత్తి గల జిల్లా మండలిలో 30 మంది సభ్యుల్లో ఎంత మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు? A. 23 B. 24 C. 26 D. 30 19. జిల్లా మండలిలో 30 మంది సభ్యుల్లో 26 మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు మిగిలిన నలుగురిని ఎవరు నామివేట్ చేస్తారు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ఉప రాష్ట్రపతి D. ప్రధాన మంత్రి 20. స్వయం ప్రతి పత్తి జిల్లా మండలి సభ్యుల పదవీ కాలము ఎంత? A. 4 సంవత్సరాలు B. 5 సంవత్సరాలు C. 6 సంవత్సరాలు D. 3 సంవత్సరాలు 21. ఏ నిబంధన ప్రకారం గ్రామ పంచాయతీ విధానం షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించదు? A. 243M B. 244 C. 224(2) D. 275(1) 22. నాగాలాండ్ రాష్ట్రనికి సంబంధించి ఏ జిల్లాకు ప్రత్యేక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం సూచిస్తుంది? A. చక్మా జిల్లా B. తున్సింగ్ C. మారా జిల్లా D. లూయి జిల్లా 23. షెడ్యూల్డ్ తెగల జిల్లా మండలాలు మరియు ప్రాంతీయ మండలాల విషయాలలో గవర్నర్ క్రింది వాటిలో ఏ నిబంధనలను జారీ చేయవచ్చు? A. ప్రాంతీయ మండలి నిర్మాణము,సభ్యుల ఎంపిక విధానము B. తున్సింగ్ జిల్లాకు సంబంధించి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్ దే C. తున్సింగ్ జిల్లా డిప్యూటీ కమిషనరే ప్రాంతీయ మండలి ఎక్స్ అఫిషియో ఛైర్మన్ గా ఉంటారు D. పైవన్ని 24. 2016 నాటికి 10 రాష్ట్రాలలో ఎన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలున్నాయి? A. 5 B. 6 C. 7 D. 8 25. క్రింది వాటిలో "పెసా" చట్టం యొక్క లక్ష్యాలేవి? A. షెడ్యూల్డ్ తెగల జనాభా కూటమికి స్వయం పాలన అవకాశాలు కల్పించడం B. షెడ్యూల్డ్ తెగల వారి సాంప్రదాయక ఆచారాలకు అనుగుణంగా ఉండే పాలనా చట్టాన్ని రూపొందించడం C. షెడ్యూల్డ్ తెగల సమాజం యొక్క సంప్రాదాయాలను ,ఆచారాలను పరిరక్షించడం D. పైవన్ని 26. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన "విధ్యా హక్కు" గురించి పేర్కొన్నది? A. 21 వ నిబంధన B. 21(ఎ) వ నిబంధన C. 22 వ నిబంధన D. 23 వ నిబంధన 27. చట్టం ముందు అందరు సమానులే అని రాజ్యాంగంలోని ఏ నిబంధనలో పేర్కొనబడింది? A. 12 వ నిబంధన B. 13 వ నిబంధన C. 14 వ నిబంధన D. 15 వ నిబంధన 28. భారత రాజ్యాంగంలోని 1 వ నిబంధనలో దేని గురించి పేర్కొన్నారు? A. పిల్లలకు ఉచిత ,నిర్బంద విద్య B. కొత్త రాష్ట్రల ఏర్పాటు C. చట్టం ముందు సమానత్వం D. భారతదేశ యూనియన్ పేరు మరియు ప్రాదేశిక ప్రాంతాలు 29. రాజ్యాంగంలోని ఏ నిబంధన కుల,మత,జాతి,లింగ,పుట్టుక ఆధారంగా వివక్షత పై నిషేదం అని తెలిపింది? A. 14 వ నిబంధన B. 15 వ నిబంధన C. 16 వ నిబంధన D. 17 వ నిబంధన 30. రాజ్యాంగంలోని 17 వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. అంటరానితనం B. బిరుదులను రద్దు చేయుట C. బాలకార్మిక వ్యవస్థపై నిషేదం D. విద్యా హక్కు 31. రాజ్యాంగంలోని ఏ నిబంధన లో "వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించిన హక్కుల" గురించి పేర్కొన్నారు? A. 18 వ నిబంధన B. 19 వ నిబంధన C. 20 వ నిబంధన D. 21 వ నిబంధన 32. ప్రాథమిక హక్కుల నిర్వచనం గూర్చి తెలిపిన భారత రాజ్యాంగ నిబంధన ఏది? A. 11 వ నిబంధన B. 5 వ నిబంధన C. 12 వ నిబంధన D. 13 వ నిబంధన 33. రాజ్యాంగంలోని 24 వ నిబంధన దేనిగురించి పేర్కొన్నది? A. గ్రామ పంచాయితీల ఏర్పాటు B. కార్మికులకు వేతనాలు C. వ్యక్తి జీవితం,స్వేచ్చలకు రక్షణ D. బాలకార్మిక వయ్వస్థ పై నిషేదం 34. రాజ్యాంగంలోని "అరెస్టులు, నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ "కల్పించే నిబంధన ఏదీ? A. 21 వ నిబంధన B. 20 వ నిబంధన C. 22 వ నిబంధన D. 23 వ నిబంధన 35. అల్ప సంఖ్యాకుల ప్రయోజనాల కు రక్షణ కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది? A. 25 వ నిబంధన B. 24 వ నిబంధన C. 28 వ నిబంధన D. 29 వ నిబంధన 36. భారత రాజ్యాంగంలోని 41వ నిబంధన దేనిని గురించి తెలుపుతుంది? A. రాష్ట్రాల పునర్నిర్మాణం,పేరు మార్పు B. పని హక్కు మరియు విద్యా హక్కుకు సంబందించినది C. కార్మికులకు వేతనాలు D. న్యాయ సమానత్వం,ఉచిత న్యాయ సహాయం 37. ఏ వ్యక్తిని ఒకే నేరం కింద రెండుసార్లు శిక్షించరాదు చట్టం విధించిన దానికన్నా ఎక్కువ శిక్ష వేయరాదు అని రాజ్యాంగంలోని ఏ నిబంధన పేర్కొన్నది? A. 18వ నిబంధన B. 19 వ నిబంధన C. 20 వ నిబంధన D. 21 వ నిబంధన 38. వెట్టిచాకిరి నిషేధం ,మానవ విక్రయాల నిషేధం గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏదీ? A. 22 వ నిబంధన B. 23 వ నిబంధన C. 24 వ నిబంధన D. 25 వ నిబంధన 39. రాజ్యాంగంలోని 36వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. నిర్ధేశిక నియమాల(ఆదేశిక సూత్రాలు) నిర్వచనం B. అల్ప సంఖ్యాకుల ప్రయోజనాలకు రక్షణ C. గ్రామ పంచాయతీల ఏర్పాటు D. అరెస్టు ,నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ 40. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన "న్యాయ సమానత్వం ,ఉచిత న్యాయ సహాయం " గురించి పేర్కొన్నది? A. 36వ నిబంధన B. 39(ఎ) నిబంధన C. 40 వ నిబంధన D. 41 వ నిబంధన 41. కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? A. 1వ నిబంధన B. 2వ నిబంధన C. 3వ నిబంధన D. 5వ నిబంధన 42. రాజ్యాంగంలోని 3వ నిబంధన దేనిగురించి తెలుపుతున్నది? A. రాష్ట్రాల పునర్నిర్మాణం మరియు పేరు మార్పు B. కొత్త రాష్ట్రాల ఏర్పాటు C. భారతదేశ యూనియన్ పేరు,ప్రాదేశిక ప్రాంతాలు D. చట్టం ముందు సమానత్వం 43. కార్మికులకు న్యాయమైన ,సరియైన పని పరిస్థితులను ,స్త్రీలకు ప్రసూతి సౌకర్యాన్ని కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది? A. 40 వ నిబంధన B. 41 వ నిబంధన C. 42 వ నిబంధన D. 43 వ నిబంధన 44. పరిశ్రమల యాజమాన్యం లో కార్మికులకు భాగస్వామ్యం కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది? A. 43 (ఎ) నిబంధన B. 43 వనిబంధన C. 44 వ నిబంధన D. 45 వ నిబంధన 45. యస్.సి, యస్.టిలు, ఇతర బలహీన వర్గాల వారికి విద్యా, ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించే రాజ్యాంగ నిబంధన ఏది? A. 43వ నిబంధన B. 44వ నిబంధన C. 45వ నిబంధన D. 46వ నిబంధన 46. రాజ్యాంగంలోని 44వ నిబంధన దేని గురించి తెలుపుతుంది? A. బాలకార్మిక వ్యవస్థ పై నిషేదం B. పౌరులకు ఉమ్మడి పౌరస్మృతి C. పిల్లలకు,ఉచిత,నిర్బంద విద్య D. కార్మికులకు వేతనాలు 47. అంతరాత్మ స్వేచ్ఛ మరియు వృత్తి స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన మొత్తాన్ని అవలంబించే మరియు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? A. 23 వ నిబంధన B. 24 వ నిబంధన C. 25 వ నిబంధన D. 28 వ నిబంధన 48. విద్యాసంస్థలను నెలకొల్పేందుకు అల్పసంఖ్యాకుల కు స్వేచ్ఛ కల్పించే రాజ్యాంగ నిబంధన ఏది? A. 29వ నిబంధన B. 30 వ నిబంధన C. 32 వ నిబంధన D. 36 వ నిబంధన 49. రాజ్యాంగంలోని ఏ నిబంధన లో "కార్మికుల వేతనాలు" గురించి పేర్కొనబడింది? A. 42 వ నిబంధన B. 43 వ నిబంధన C. 43 (ఎ) వ నిబంధన D. 44 వ నిబంధన 50. రాజ్యాంగంలోని 45వ నిబంధన దేని గురించి పేర్కొన్నది? A. గ్రామ పంచాయితీల ఏర్పాటు B. అంటరానితనం C. అల్ప సంఖ్యాకుల ప్రయోజనాలకు రక్షణ D. అరెస్టులు,నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ You Have total Answer the questions Prev 1 2 Next