కేంద్ర చట్టసభలు | Polity | MCQ | Part -29 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 1. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం ఏది? A. జమ్ము కాశ్మీర్ B. ముంభై C. ఢిల్లీ D. ఏదీ కాదు 2. పార్లమెంట్ కు గల శాసన అధికారాలు ఏవి? A. కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం,ఏర్పాటు చేయడం B. ఆర్థిక మండలి వ్యవహారాలు C. పౌరసత్వ విషయాలు D. పైవన్నీ 3. రాజ్యాంగంలోని 11వ నిబంధన ప్రకారం పార్లమెంట్ కు గల శాసన అధికారం ఏది? A. ప్రాథమిక హక్కులు B. పౌరసత్వ విషయాలు C. ఆర్థిక మండలి వ్యవహారాలు D. పైవన్నీ 4. 123 రాజ్యాంగ నిబంధన ప్రకారం పార్లమెంటుకు గల శాసన అధికారం ఏది? A. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ లను శాసన రూపంలో ఆమోదించటం B. ఆర్థిక మండలి వ్యవహారాలు C. లోక్ సభ కాలపరిమితి పెంపు D. పౌరసత్వ విషయాలు 5. ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం పార్లమెంట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ,ఎన్నికల వ్యవహారాలను పేర్కొంటుంది? A. 33 వ B. 71 వ C. 11 వ D. 83 వ 6. 312 వ నిబంధన ప్రకారం అఖిల భారత సర్వీసుల ఏర్పాటును ఎవరు చేస్తారు? A. రాష్ట్రపతి B. ప్రధాన మంత్రి C. పార్లమెంట్ D. ఉప రాష్ట్రపతి 7. 280(1) నిబంధన ప్రకారం పార్లమెంటు ఏర్పాటు చేసే వ్యవహారాలు ఏవి? A. రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలు B. ఆర్థిక మండలి వ్యవహారాలు C. a & b D. ఏదీ కాదు 8. 169 (1) నిబంధన ప్రకారం రాష్ట్ర విధాన మండలి రద్దు లేదా ఏర్పాటు ఎవరి ఆధీనంలో ఉంటుంది? A. పార్లమెంట్ B. రాష్ట్రపతి C. ఉప రాష్ట్రపతి D. ప్రధాన మంత్రి 9. లోక్ సభ స్పీకర్ ను తొలగించడానికి ఖచ్చితమైన తీర్మానాన్ని లోక్ సభలో ఎన్ని రోజుల ముందు వ్యవధితో ప్రవేశపెట్టాలి? A. 10 రోజులు B. 7 రోజులు C. 14 రోజులు D. 15 రోజులు 10. భారత మొదటి లోక్ సభ స్పీకర్ ఎవరు? A. అనంతశయనం అయ్యంగార్ B. గణేశ్ వాసుదేవ మౌలాంకర్ C. సర్దార్ హుకుంసింగ్ D. గురుదయాల్ సింగ్ థిల్లాన్ 11. భారత ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఎవరు? A. జి.ఎం సి బాలయోగి B. ఓం బిర్లా C. మీరాకుమార్ D. సుమిత్రా మహాజన్ 12. పార్లమెంట్ లో గల వేరు వేరు బిల్లులను ఏ బిల్లుగా నిర్ణయిస్తారు? A. శాసన బిల్లు B. ద్రవ్య బిల్లు C. రాష్ట్ర బిల్లు D. ఏదీ కాదు 13. రాజ్యసభ ఎన్నవ వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన తర్వాత మాత్రమే పార్లమెంట్ కొత్త ఆల్ ఇండియా సర్వీసును సృష్టిస్తుంది? A. 1/3 వ వంతు B. 1/5 వ వంతు C. 2/3 వ వంతు D. 2/5 వ వంతు 14. రాజ్యంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితా పై చట్టం చేయాలంటే ఆ తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? A. 245 వ నిబంధన B. 242 వ నిబంధన C. 243 వ నిబంధన D. 249 వ నిబంధన 15. రాష్ట్ర జాబితాపై చట్టం చేయాలంటే ఆ తీర్మానాన్ని ఏ సభలోమాత్రమే ప్రవేశపెట్టాలి? A. లోక్ సభ B. శాసన సభ C. రాజ్య సభ D. ఏదీ కాదు 16. 109వ నిబంధన ప్రకారం రాజ్యసభకు గల అధికారాలు ఏవి? A. రాజ్య సభ సిఫారసులను లోక్ సభ ఆమోదించడం B. లోక్ సభ ఆమోదించిన బిల్లును రాజ్య సభ నిర్వహిచడం C. ఆర్థిక బిల్లులను మొదటగా రాజ్యసభ లో ప్రవేశ పెట్టడం D. పైవన్నీ 17. లోక్ సభ ఆమోదించిన ఆర్థిక బిల్లును రాజ్యసభ ఎన్ని రోజులలో సిఫారసులతో లోక్ సభకు పంపాలి? A. 10 రోజులలో B. 12 రోజులలో C. 14 రోజులలో D. 21 రోజులలో 18. లోక్ సభ సమావేశాలలో కోరమ్ అని ఎవరిని సంబోధిస్తారు? A. కనీస సభ్యుల సంఖ్య ను B. మొత్తం సభ్యుల సంఖ్య ను C. సభకు హాజరు కానివారని D. ఏదీ కాదు 19. లోక్ సభ సమావేశాలను నిర్వహించేందుకు సభ లో ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్య మొత్తం ఎన్నవ వంతుగా నిర్ణయించబడుతుంది? A. 2/10 వంతు B. 3/10 వంతు C. 1/10 వంతు D. 5/10 వంతు 20. భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలు లోక్ సభ స్పీకర్ పదవిని గురించి పేర్కొంటాయి? A. 91 నుండి 95 వరకు గల నిబంధనలు B. 91 నుండి 97 వరకు గల నిబంధనలు C. 93 నుండి 97 వరకు గల నిబంధనలు D. 93 నుండి 95 వరకు గల నిబంధనలు 21. లోక్ సభ స్పీకర్ కార్యాలయం ఏర్పాటు పద్ధతిని ఏ పార్లమెంటరీ వ్యవస్థ నుండి తీసుకోవడం జరిగింది? A. బ్రిటిష్ B. ఫ్రాన్స్ C. కెనడా D. రష్యా 22. ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ నెల వేతనం ఎంత? A. 2.8 lakhs B. 2.25 lakhs C. 3.5 lakhs D. 3.3 lakhs 23. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం లోక్ సభ నిర్మాణం, ఎన్నికలు మొదలగు అంశాలను పేర్కొన్నారు? A. 79 వ నిబంధన B. 80 వ నిబంధన C. 81 వ నిబంధన D. 82 వ నిబంధన 24. భారతదేశంలో తొలి లోక్ సభ ఎప్పుడు ఏర్పాటు చేయబడినది? A. 1952 ఏప్రిల్ 2 B. 1952 ఫిబ్రవరి 12 న C. 1950 ఏప్రిల్ 4 D. 1952 ఫిబ్రవరి 24 25. భారత రాజ్యాంగం ప్రకారం లోక్ సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? A. 550 B. 554 C. 544 D. 552 26. భారత రాజ్యాంగం ప్రకారం లోక్ సభలో కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎంత మంది హాజరవుతారు? A. 15 B. 13 C. 12 D. 18 27. ప్రస్తుతం లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత? A. 552 B. 545 C. 543 D. 525 28. భారత లోక్ సభ సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడతారు? A. నేరుగా ఓటర్ల చేత B. నియోజక వర్గాల ప్రాతిపదికపైన C. సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రకారం D. పైవన్నీ 29. 1927 ,జనవరి 18న పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించారు? A. లార్డ్ ఛేమ్స్ ఫర్డ్ B. బ్రిటిష్ వైశ్రాయ్ C. లార్డ్ కానింగ్ D. లార్డ్ ఇర్విన్ 30. భారతదేశంలో మొదటి పార్లమెంట్ సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1950 B. 1951 C. 1952 D. 1954 31. ఎవరి ఆదేశాన్ని అనుసరించి పార్లమెంట్ సమావేశమవుతుంది? A. ప్రధాన మంత్రి B. ఉప రాష్ట్రపతి C. స్పీకర్ D. రాష్ట్రపతి 32. పార్లమెంట్ ఉభయ సభల్లో దిగువసభ ను ఏమని వ్యవహరిస్తారు? A. లోక్ సభ B. రాజ్య సభ C. విధాన సభ D. ఏదీ కాదు 33. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎగువ సభ ను ఏమని వ్యవహరిస్తారు? A. లోక్ సభ B. విధాన సభ C. రాజ్య సభ D. శాసన సభ 34. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ -అఫిషియో ఛైర్మన్ గా వ్యవహరిస్తారు? A. 79 వ నిబంధన B. 89 వ నిబంధన C. 99 వ నిబంధన D. 95 వ నిబంధన 35. రాజ్యసభకు ఎక్స్-అఫిషియో ఛైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు? A. రాష్ట్రపతి B. ఉప రాష్ట్రపతి C. ప్రధాన మంత్రి D. ఏదీ కాదు 36. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలు కేంద్ర శాసన నిర్మాణ శాఖ ,నిర్మాణం ,అధికారాలు- విధులు వివరిస్తాయి? A. 79 నుండి 129 వరకు గల నిబంధనలు B. 79 నుండి 125 వరకు గల నిబంధనలు C. 75 నుండి 129 వరకు గల నిబంధనలు D. 75 నుండి 125 వరకు గల నిబంధనలు 37. కేంద్ర శాసన నిర్మాణ శాఖ ,నిర్మాణం, అధికారాలు -విధులను తెలియజేసే 79 నుండి 129 వరకు గల నిబంధనలు భారత రాజ్యాంగ ఏ భాగంలోనివి? A. 6 వ భాగం B. 5 వ భాగం C. 4 వ భాగం D. 7 వ భాగం 38. భారత రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంటులో వ్యవహరించే వారు ఎవరు? A. రాష్ట్రపతి B. లోక్ సభ C. రాజ్య సభ సభ్యులు D. పైవన్నీ 39. రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి ,ప్రధానమంత్రి, మంత్రి మండలి మరియు అటార్నీ జనరల్ లు ఏ శాఖలో విధులను నిర్వహిస్తారు? A. శాసన శాఖ B. కేంద్ర కార్యనిర్వాహక శాఖ C. విధాన శాఖ D. ఏదీ కాదు 40. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ప్రాతినిధ్యం వహించునది? A. రాజ్య సభ B. లోక్ సభ C. విధాన సభ D. ఏదీ కాదు 41. ప్రభుత్వం యొక్క విధానం పై నిరసనను లేదా తిరస్కరించడానికి ప్రవేశపెట్టబడే తీర్మానం ఏది? A. కోత తీర్మానం B. అభిశంస తీర్మానం C. అవిశ్వాస తీర్మానం D. విశ్వాస తీర్మానం 42. పార్లమెంటరీ రూల్స్ లోని ఏ నిబంధన ప్రకారం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం జరుగుతుంది? A. 183 B. 185 C. 182 D. 184 43. పార్లమెంటులో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టినపుడు ఏర్పడే తీర్మానం ఏది? A. వాయిదా తీర్మానం B. కోత తీర్మానం C. బడ్జెట్ తీర్మానం D. ఏదీ కాదు 44. ప్రభుత్వం చేసిన డిమాండ్ మొత్తాన్ని కొంతమేరకు తగ్గించమని కోరుతూ చేసే కోత తీర్మానమును ఏ తీర్మానం గా పరిగణిస్తారు? A. విధాన కోత తీర్మానం B. పొదుపు కోత తీర్మానం C. లాంఛన ప్రాయమైన కోత తీర్మానం D. ఏదీ కాదు 45. నిర్ణీత ఇబ్బందులకు మరియు డిమాండ్ మొత్తంలో 100 రూపాయలు తగ్గించమని కోరి చేసే కోత తీర్మానం ఏది? A. విధాన కోత తీర్మానం B. పొదుపు కోత తీర్మానం C. లాంఛన ప్రాయమైన కోత తీర్మానం D. ఏదీ కాదు 46. భారతదేశ అత్యున్నత శాసన నిర్మాణ శాఖ ఏది? A. రాజ్య సభ B. శాసన సభ C. విధాన సభ D. పార్లమెంట్ 47. భారతదేశంలో ఏ చట్టం ద్వారా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు? A. 1911 B. 1919 C. 1929 D. 1947 48. 1919 చట్టం ద్వారా భారతదేశంలో ఏ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? A. ద్వంద్వ విధానం B. ద్విసభా విధానం C. a & b D. ఏదీ కాదు 49. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటీష్ గవర్నర్ మరియు జనరల్ పార్లమెంట్ భవనం కు ఎప్పుడు శంకుస్థాపన చేశారు? A. 1922 ఫిబ్రవరి 12 న B. 1921 ఫిబ్రవరి 12 న C. 1919 మార్చ్ 12 న D. 1919 మార్చ్ 10 న 50. 1921 లో భారత దేశంలో మొదటిసారిగా పార్లమెంట్ భవనం కు శంకుస్థాపన చేసిన వారు ఎవరు? A. లార్డ్ ఛేమ్స్ ఫర్డ్ బ్రిటిష్ వైశ్రాయ్ B. లార్డ్ ఇర్విన్,లార్డ్ ఛేమ్స్ ఫర్డ్ C. బ్రిటిష్ వైశ్రాయ్ D. ఎవరు కాదు You Have total Answer the questions Prev 1 2 3 4 Next