ఒకప్పుడు ఒక అడవిలో ఒక నక్క ఉండేది రాత్రిపూట చీకటిలో అలా వెళ్తూ ఉండగా ఒక బావిలో పడిపోయింది.
బావి చాలా లోతుగా ఉంది ఎంత ప్రయత్నం చేసినా ఆ బావి నుండి రాలేకపోయింది
తెల్లవారే దాక అలా బావిలో ఉండిపోయింది
తెల్లవారి ఆ బావి దగ్గరకు ఒక మేక వచ్చింది.
నక్క అనుకుంటుంది అమ్మయ్య మనం బయటపడవచ్చు అని
మేక బావిలో చూసింది చుస్తే అక్కడ నక్క కనిపిస్తుంది
మేక అంటుంది నువ్వేంటి బావిలో ఉన్నావు
నక్క అంటుంది ఈ బావిలో నీరు ఎంత బాగున్నాయో తెలుసా చాలా తియ్యగా ఉన్నాయి చక్కర కలిపినట్టుగా
మేక అంటుంది అవునా ! నిజమా ?
నక్క అంటుంది హ ఒకసారి నువ్వు కుడా దిగి చూడు ఇలాంటి నిరు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు
అమాయకమైన మేక ముందు వెనుక ఆలోచించకుండా బావిలోకి దుకేసింది నీళ్ళు తాగింది కొంతసేపటికి నక్క లానే మేక కుడా ఇరుక్కుపోయింది
ఇప్పుడు బయటకి వెళ్ళడం ఎలా ని నక్కని అడిగింది
ఓస్ దానిదేముంది ని విపు పై ఎక్కి నేను బయటకి వెళ్తాను తర్వాత నిన్ను బయటకి లాగెస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క
సరే బాగానే ఉంది అనుకోని మేక ఒప్పుకుంది
నక్క మేక విపు ఎక్కి చెంగున బయటకి గంతు వేస్తుంది
నక్క అమ్మయ్య ఎలాగో ఒకలా తప్పించుకున్నాను అనుకుంటుంది
మేక నన్ను లాగు అని అనుంటుంది.
నిన్ను ఎలా లాగాలి బావి ఇంత లోతు ఉంది అయినా ని బరువు నా బరువు కంటే ఎక్కువ నిన్ను ఎలా నేను బయటకు తియగాలను అని నక్క అంటుంది.
తన తెలివితేటలతో నక్క మేకను ఎలా మోసం చేసింది.